ఆక్వా రంగానికి ఏం చేశావో చెప్పగలవా బాబూ ?

మంత్రి సీదిరి అప్పలరాజు

తాడేప‌ల్లి: ఆక్వా రంగానికి ఏం చేశావో చెప్ప‌గ‌ల‌వా చంద్ర‌బాబూ అంటూ మంత్రి సీదిరి అప్ప‌ల‌రాజు ప్ర‌శ్నించారు. బాబు ఆక్వారంగానికి విద్యుత్ సబ్సిడీ కింద ఒక్క రూపాయికూడా నిదులు ఇవ్వలేద‌ని ధ్వ‌జ‌మెత్తారు. గతంలో బాబు పెట్టిన బాకాయిలు సుమారుగా రూ.335 కోట్లను మా ప్రభుత్వం తీర్చిందని చెప్పారు. దానితోపాటుగా 2019-20,2020-21,2021-22 మూడేళ్ళకి రూ.2,600 కోట్లను ఆక్వారైతుల విద్యుత్ సబ్సిడీకోసం మా ప్రభుత్వం ఖర్చు చేసింద‌ని వివ‌రించారు. ఇప్పుడు చంద్ర‌బాబు వచ్చి వీధినాటకాలు వేస్తూ, అసత్యాలు చెబితే నమ్మే పరిస్థితుల్లో ఆక్వా రైతులు లేరన్నారు. 

రూ.1.50 పైసలకే యూనిట్‌ విద్యుత్ 
 ఆక్వా జోన్‌లో ఉన్నవారికి రూ.1.50 పైసలకే  విద్యుత్ యూనిట్ ఇస్తున్నామని మంత్రి సీదిరి అప్ప‌ల‌రాజు అన్నారు. చంద్రబాబుకు ఆక్వా రైతుల పట్ల ప్రేమ లేదని విమ‌ర్శించారు. చంద్రబాబు సీఎంగా ఉన్నప్పుడు ఆక్వా రంగానికి ఏం చేశారని మంత్రి సీదిరి అప్పలరాజు ప్రశ్నించారు. చంద్రబాబుకు సిగ్గు, లజ్జ ఉంటే ఆక్వా ఇదిగో ఇది చేశానని చెప్పగలవా..? ఆక్వారంగాన్ని ప్రభుత్వం పట్టించుకోవడం లేదని, ఈ రంగం లో ఏదో జరిగిపోతుందని , ఆక్వా ఫీడ్ తయారీదారులనుండి ప్రభుత్వం డబ్బులు వసూలు చేస్తోందని ఒక అబద్దాన్ని సృష్టించి ఇదే  నిజమని ప్రజలను నమ్మించడానికి ఎల్లో మీడియా అదేపనిగా విషప్రచారాలు చేస్తోందని దుయ్య‌బ‌ట్టారు. నిన్న చంద్ర‌బాబు విద్యుత్ సబ్సిడీ గురించి మాట్లాడుతున్నారు. గతం లో బాబు అధికారం లో ఉన్నప్పుడు ఐదేళ్లలో నాల్గున్నరేళ్లపాటు మీరు ఒక యూనిట్ విద్యుత్ ను రూ.3.80 కి ఇవ్వడం నిజం కాదా ?. వైయ‌స్ జగన్ పాదయాత్రలో బాగంగా ఉభ‌యగోదావరి జిల్లాలకి వచ్చినపుడు ఆ రోజున ఒకమాట చెప్పారు. మన ప్రభుత్వం వచ్చాక ఆక్వా రంగానికి యూనిట్ విద్యుత్తును రూ .1.50 పైసలకే కే సరఫరా చేస్తామని చెప్పారు. వైయ‌స్ జగన్ అలా చెప్పగానే బాబు నేను కూడా యూనిట్ రూ.2 కే ఇస్తానని చెప్పాడు. వైయ‌స్ జగన్ చెప్పిన మాటవలనే బాబు ఆ రోజున విద్యుత్ సబ్సిడీని ఇస్తామని చెప్పారే తప్ప.. ఆక్వా రైతులపై ప్రేమతోకాదన్నారు. నిజంగానే చంద్ర‌ బాబుకు ప్రేమ ఉంటే మొన్న 5 ఏళ్ళు  పాలించారు...అంతకు ముందు 9 ఏళ్ళు పాలించారు...ఏ రోజయినా ఆక్వా రైతులకు సబ్సిడీ ఇచ్చారా ? అని నిల‌దీశారు. రూ.2 కే విద్యుత్ ఇస్తామని చెప్పి మీరు ఒక్క రూపాయి అయినా నిదులు విడుదల చేశారా ? అని ప్ర‌శ్నించారు. ఈ ప్రభుత్వం వచ్చాక బాబు పెట్టిన బాకాయిలు సుమారుగా రూ.335 కోట్లను తీర్చ్గిందని గుర్తు చేశారు. దానితోపాటుగా 2019-20,2020-21,2021-22 మూడేళ్ళకి రూ.2,600 కోట్లను  ఆక్వారైతుల విద్యుత్ సబ్సిడీకోసం మా ప్రభుత్వం ఖర్చు చేసింద‌ని వివ‌రించారు. ఇప్పుడు బాబు వచ్చి వీధినాటకాలు వేస్తూ,అసత్యాలు చెబితే నమ్మే పరిస్దితుల్లో ఆక్వా రైతులు లేరన్నారు. నా 14 ఏళ్ళ పాలనలో నేను ఆక్వా రైతుల కోసం పలానా ఒక మంచి చేశానని, ఇంత సొమ్ము ఇచ్చానని చెప్పగలవా ? అని నిల‌దీశారు. 10 ఎకరాల లోపు ఉన్న ఆక్వా జోన్ లో ఉన్న రైతులకు యూనిట్ విద్యుత్ రూ.1.50 పైసలకే ఇస్తామని మా ప్రభుత్వం జీవో ఇచ్చింద‌న్నారు. నాన్ ఆక్వా జోన్ లో ఉన్న రైతులను ఆక్వా జోన్ లోకి మారాలని మా  ప్రభుత్వం ప్రోత్సహిస్తుంద‌ని తెలిపారు. 10 ఎకరాలకు పైబడి ఉన్న ఆక్వా రైతులు కేవలం 2.8 శాతం మాత్రమే ఉన్నారని చెప్పారు. వారికి రూ.3.80 పైసలకి పవర్ సబ్సిడీ ఇస్తున్నామ‌ని తెలిపారు. గతం తో పోలిస్తే...పవర్ ప్రొడక్షన్ ధర ఇప్పుడు బాగా పెరిగింద‌ని మంత్రి సీదిరి అప్ప‌ల‌రాజు వివ‌రించారు. ప్ర‌జ‌ల‌ను మ‌భ్య‌పెట్టేందుకే చంద్ర‌బాబు రోజుకో డ్రామా ఆడుతున్నార‌ని, ఆయ‌న మాట‌లు ఎవ‌రూ న‌మ్మొద్ద‌ని మంత్రి సీదిరి అప్ప‌ల‌రాజు సూచించారు. సీఎం వైయ‌స్ జ‌గ‌న్ ఆక్వా రంగానికి పెద్ద పీట వేశార‌ని మంత్రి పేర్కొన్నారు. 
 

తాజా వీడియోలు

Back to Top