జ‌గ‌న‌న్న కంట్లో భ‌యం ఉండ‌దు.. ఒంట్లో బెదురుండ‌దు

మంత్రి ఆర్‌కే రోజా 
 

 అమ‌రావ‌తి:  చంద్ర‌బాబు చీట‌ర్ అయితే సీఎం వైయ‌స్ జ‌గ‌న్ మోహ‌న్ రెడ్డి నిజ‌మైన నాయ‌కుడ‌ని మంత్రి ఆర్కే రోజా అన్నారు. సోమ‌వారం అసెంబ్లీలో మ‌హిళా సాధికార‌త‌పై జ‌రిగిన చ‌ర్చ‌లో మంత్రి మాట్లాడారు.  నాలుగున్నరేళ్ల కాలంలో ప్రతి ఆడబిడ్డ కన్నీళ్లు సీఎం వైయ‌స్ జగన్‌ తుడిచార‌ని చెప్పారు. మహిళా సాధికారత కోసం ఎంతో కృషి చేశార‌ని ఆమె కొనియాడారు. ప్రతి ఆడబిడ్డ కష్టాలు సీఎం వైయ‌స్ జగన్‌ తీర్చుతున్నార‌ని పేర్కొన్నారు. సీఎం వైయ‌స్‌ జగన్‌ మహిళల కోసం చేసిన కృషిన చూసి.. మహిళలందరూ జయహో జగన్‌ అంటున్నారని కీర్తించారు.  సంక్షేమం అంటే ఏమిటో సీఎం వైయ‌స్ జగన్‌ నాలుగున్నరేళ్లలో చేసి చూపించారని చెప్పారు.  ముఖ్య‌మంత్రి వైయ‌స్ జ‌గ‌న్‌ పాలనలో మహిళలు ఆర్థికంగా ఎంతో బలంగా మారార‌ని వివ‌రించారు. 14 ఏళ్లలో చంద్రబాబు ఏం చేశారో చెప్పగలరా? అని ప్ర‌శ్నించారు. ఆడపుట్టకనే ఎగతాళి చేసిన వ్యక్తి చంద్రబాబు నాయుడు అని ఆగ్ర‌హం వ్య‌క్తం చేశారు.  చంద్రబాబు చెప్పేవన్నీ మాయమాటలేనని మహిళలందరికీ తెలుసు. చంద్రబాబును ఈ రాష్ట్ర ప్రజలు ఎప్పటికీ నమ్మరని పేర్కొన్నారు. బాలకృష్ణ మొన్న తొడగొట్టారు.. ఇవాళ తోక ముడిచారని ఎద్దేవా చేశారు. చంద్రబాబుకు పబ్లిసిటీ పిచ్చి ఎక్కువ అని  విమ‌ర్శించారు. సీఎం వైయ‌స్‌ జగన్‌ సంక్షేమ పథకాలపై బాలకృష్ణ చర్చకు రాగలరా? అని స‌వాలు విసిరారు. రాష్ట్రంలో టీడీపీ ప్రతిపక్ష పార్టీ కాదు.. పనికిమాలిన పార్టీ అని అభివ‌ర్ణించారు. మహిళలకు రాజకీయంగా సీఎం వైయ‌స్ జగన్‌ ఎన్నో అవకాశాలు కల్పించార‌ని చెప్పారు.  దేశంలో అన్ని రాష్ట్రాల కంటే ఏపీలోనే రాజకీయంగా సీఎం వైయ‌స్‌ జగన్‌ అవకాశాలు ఇచ్చార‌ని తెలిపారు. జగనన్న కంట్లో భయం ఉండదు.. జగనన్న ఒంట్లో బెదురుండదు.. 2024లో జగనన్న కొట్టే దెబ్బకు తిరుగుండదు అర్థమైందా రాజా..అంటూ మంత్రి రోజా వ్యాఖ్యానించారు. 

Back to Top