జనరంజక పాలనకు పాదయాత్రే ప్రధాన కారణం

సాంఘిక సంక్షేమ శాఖ మంత్రి విశ్వరూప్‌

అమరావతి: ముఖ్యమంత్రి వైయస్‌ జగన్‌మోహన్‌రెడ్డి జనరంజక పాలనకు పాదయాత్రే ప్రధాన కారణమని సాంఘిక సంక్షేమ శాఖ మంత్రి పినిపే విశ్వరూప్‌ అన్నారు. పాదయాత్రలో ప్రజలతో మమేకమై వారి కష్టాలు అన్నీ వైయస్‌ జగన్‌ తెలుసుకున్నారన్నారు. ప్రజా సంకల్ప పాదయాత్ర రెండేళ్లు పూర్తిచేసుకున్న సందర్భంగా మంత్రి విశ్వరూప్‌ మీడియాతో మాట్లాడుతూ.. రాష్ట్రంలోని రైతాంగం పడుతున్న కష్టాలు తెలుసుకొని వాటిని పరిష్కరించేందుకు వైయస్‌ఆర్‌ రైతు భరోసా అనే పథకాన్ని తీసుకువచ్చారన్నారు. ఇచ్చిన మాట కంటే మిన్నగా రూ.వెయ్యి పెంచి రైతులకు పెట్టుబడి సాయం రూ. 13500 అందజేస్తున్నారన్నారు. అదే విధంగా డాక్టర్‌ బీఆర్‌.అంబేడ్కర్‌ ఆశయాలను నెరవేర్చే విధంగా ప్రతి ఒక్కరూ చదువుకోవాలని అమ్మఒడి పథకాన్ని తీసుకువచ్చారన్నారు. పిల్లలను బడికి పంపిన ప్రతి తల్లి ఖాతాలో రూ.15 వేలు ఇచ్చే విధంగా అద్భుతమైన కార్యక్రమాన్ని తీసుకువచ్చారన్నారు. అంతేకాకుండా చేనేతలను ఆదుకోవడానికి మగ్గం ఉన్న ప్రతి చేనేత కుటుంబానికి రూ. 24 వేలు అందజేయాలని నిర్ణయం తీసుకున్నారన్నారు. రాష్ట్రంలోని అన్ని వర్గాలను ఆదుకుంటూ సీఎం వైయస్‌ జగన్‌ ప్రజారంజక పాలన సాగిస్తున్నారన్నారు.  
 

Read Also: ఆ నాలుగు రోజులు పండగ వాతావరణం

తాజా ఫోటోలు

Back to Top