ఆర్టీసీని కష్టాల నుంచి గట్టెక్కించాలి

గత ప్రభుత్వం ఆర్టీసీ ఉద్యోగులు,కార్మికుల సొమ్మును వాడేసింది

రవాణా,సమాచార,ప్రజా సంబంధాల శాఖ మంత్రి పేర్ని నాని

అమరావతిః ఆర్టీసీని కష్టాల నుంచి గట్టెక్కించామని ఆర్థిక మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్‌రెడ్డిని కోరామని రవాణా,సమాచార,ప్రజా సంబంధాల శాఖ మంత్రి పేర్ని నాని తెలిపారు.ఉద్యోగులకు పీఆర్సీ బకాయిలు చెల్లించలేని స్థితిలో ఆర్టీసీ ఉందన్నారు.గత ప్రభుత్వం ఆర్టీసీ ఉద్యోగులు,కార్మికుల డబ్బును కూడా వాడేసిందన్నారు.రూ.6,500 కోట్ల అప్పుల్లో ఉన్న ఆర్టీసీని ఆదుకోవాలని కోరినట్లు తెలిపారు.రవాణశాఖలో ఖాళీలను భర్తీ చేయాలని కోరామని వెల్లడించారు.మరోసారి ఆర్టీసీ సమస్యలపై ఆర్థిక మంత్రితో చర్చించి చర్యలు తీసుకుంటామని తెలిపారు.

 

Back to Top