వైయ‌స్ జ‌గ‌న్ పాల‌న‌లో ఆదర్శవంతంగా అభివృద్ధి 

మంత్రి పెనిపే విశ్వరూప్

అమలాపురం:  ముఖ్యమంత్రి వైయ‌స్‌ జగన్‌మోహన్‌రెడ్డి పాలనలో ఆదర్శవంతంగా అభివృద్ధి పనులు సాగుతున్నట్లు మంత్రి పెనిపే విశ్వ‌రూప్‌ తెలిపారు. మంగ‌ళ‌వారం అల్లవరంలో 15 లక్షల రూపాయల ఎంపీ లాడ్స్ నిధులతో నూతనంగా నిర్మించిన సీసీ రోడ్లను మంత్రి  విశ్వరూప్ తో కలిసి అమలాపురం పార్లమెంట్ సభ్యులు చింతా అనురాధ ప్రారంభించారు. ఈ సంద‌ర్భంగా మంత్రి మాట్లాడుతూ మహాత్మాగాంధీజీ కలలుగన్న గ్రామ స్వరాజ్యాన్ని సచివాలయ వ్యవస్థ ద్వారా ముఖ్యమంత్రి వైయ‌స్‌ జగన్‌మోహన్‌రెడ్డి ఆవిష్కరించారన్నారు. ప్రజల ఇంటి ముంగిటకే ప్రభుత్వ సేవలందించేందుకు సచివాలయాలు ఉపయోగపడుతున్నాయని తెలిపారు. వైయ‌స్ఆర్‌సీపీ ప్రభుత్వంలో  అన్ని విధాలుగా అభివృద్ధి చెందిందని వెల్లడించారు. ప్రతి గ్రామానికి రోడ్డు వేయించామని, వాటర్‌ ట్యాంకులు నిర్మించామని, ఇతర మౌలిక వసతులను పకడ్బందీగా కల్పించామని వివరించారు. ఇంటింటికీ క్రమం తప్పకుండా సంక్షమే పథకాలు అందిస్తున్నామన్నారు. ఎక్కడికి వెళ్లినా ప్రజల నుంచి అపూర్వ స్పందన వస్తోందని, రాబోయే ఎన్నికల్లో ఘన విజయం సాధించి వైయ‌స్‌ జగన్‌ను మళ్లీ ముఖ్యమంత్రిని చేసుకుంటామని స్పష్టం చేశారు. 

క‌దిరి నియోజ‌క‌వ‌ర్గంలో..
అనంత‌పురం జిల్లా గాండ్ల‌పెంట‌ మండలం, పోతవాండ్లపల్లి నుంచి జీనులకుంట వరకు రూ. 53.00  లక్షల రూపాయలతో నూతనంగా నిర్మించిన సిమెంట్ కాంక్రీట్ రోడ్డును కదిరి శాసనసభ్యులు డాక్టర్ పి వి సిద్దా రెడ్డి  ప్రారంభించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ..సీఎం వైయ‌స్ జ‌గ‌న్‌ సహకారంతో నేడు రూ. 53 లక్షల రూపాయలతో 100 సంవత్సరాలు మన్నిక కలిగిన సిమెంట్ కాంక్రీట్ రోడ్డు, కల్వర్టులను నిర్మించుకున్నామన్నారు. దశాబ్దాల కాలం నుంచి ఏమాత్రం అభివృద్ధికి నోచుకోనటువంటి నియోజకవర్గ వ్యాప్తంగా 135 గ్రామాలకు అప్రోచ్ రోడ్లను నిర్మించామన్నారు.  ఈ రహదారుల ద్వారా  ప్రజలకు అత్యవసర సేవలను (108 & 104 వాహనాలను) అందుబాటులోకి తీసుకొచ్చామన్నారు.  జగనన్న ఆనాడు చెప్పిన మాట ప్రకారం తన తండ్రి ఆశయాలను దృష్టిలో ఉంచుకొని వారి కంటే రెండు అడుగులు ముందుకేసి అభివృద్ధి అంటే ఏమిటో చేసి చూపించారన్నారు.  కులం మతం వర్గం పార్టీ అన్న బేధం లేకుండా అర్హత కలిగిన ప్రతి ఒక్కరికి సంక్షేమ కార్యక్రమాలు అందజేస్తూ గ్రామ సచివాలయ వ్యవస్థలు వాలంటీర్ వ్యవస్థల ద్వారా లబ్ధిదారుని ఇంటి వద్దకే సంక్షేమ ఫలాలను అందజేయడం జరుగుతున్నదన్నారు. వీటన్నిటిని చూసి ఓర్వలేని కొందరు దుష్టులు జగనన్నపై బురద చల్లే కార్యక్రమాలు చేస్తున్నారని, ఒక అబద్దాన్ని పదే పదే చెబుతూ నిజం చేయాలని చూస్తున్నారన్నారు.  అధికారం అడ్డం పెట్టుకొని గతంలో ప్రజల సొమ్మును ఇష్టం వచ్చినట్టు దోచుకుతిన్నారన్నారు.   మరి ఈనాడు ఏ గ్రామానికి వెళ్లిన వైయ‌స్ జ‌గ‌న్ చేసిన అభివృద్ధి కళ్లకు కట్టినట్లు కనిపిస్తుందని, వీటన్నిటినీ ప్రజలు గమనించి, అభివృద్ధికే పట్టం కట్టాలన్నారు.  

Back to Top