రఘువీరారెడ్డి పొలిటికల్ బ్రోకర్

మంత్రి పెద్దిరెడ్డి రామ‌చంద్రారెడ్డి

అనంతపురం: రఘువీరారెడ్డి పొలిటికల్‌ బ్రోకర్‌ అంటూ మండిపడ్డారు మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి. మంత్రి పెద్దిరెడ్డి మీడియాతో మాట్లాడుతూ.. తనపై ఎలాంటి హత్య కేసులు లేవని.. రఘువీరారెడ్డి ఆరోపణలు అర్థరహితమన్నారు. తనపై హత్య కేసులున్నట్లు నిరూపిస్తే రాజకీయాల నుంచి తప్పుకుంటానంటూ మంత్రి పెద్దిరెడ్డి సవాల్‌ విసిరారు.

సీఎం వైయ‌స్ జగన్ రాప్తాడు సిద్ధం సభ చరిత్రలో నిలిచిపోతుందని మంత్రి అన్నారు. రాయలసీమ జిల్లాలకు చెందిన వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ శ్రేణులు రాప్తాడు సభలో పాల్గొంటాయి. మధ్యాహ్నం 1 గంటకు రాప్తాడు ‘సిద్ధం’ సభ ఉంటుందని మంత్రి పెద్దిరెడ్డి అన్నారు.

Back to Top