చంద్రబాబు దగాకోరు మాటలను ప్రజలు నమ్మరు

ఇసుకపై చంద్రబాబువన్నీ పచ్చి అబద్ధాలు

విద్యుత్‌ శాఖ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి

చిత్తూరు: ఇసుకపై చంద్రబాబు పచ్చి అబద్ధాలు మాట్లాడుతున్నాడని, ప్రభుత్వంపై నిందలు వేయడమే చంద్రబాబు పనిగా పెట్టుకున్నాడని విద్యుత్‌ శాఖ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి మండిపడ్డారు. చంద్రబాబు దగాకోరు మాటలు నమ్మే పరిస్థితుల్లో ప్రజలు లేరన్నారు. చిత్తూరులో మంత్రి పెద్దిరెడ్డి మీడియాతో మాట్లాడారు. ఎల్లో మీడియా పథకం ప్రకారం ప్రభుత్వంపై తప్పుడు ప్రచారం చేస్తోందని, నిత్యం విషం కక్కుతోందని ధ్వజమెత్తారు. చంద్రబాబును, ఎల్లో మీడియాను ప్రజలంతా చీదరించుకుంటున్నారని చెప్పారు. 

మహానేత వైయస్‌ఆర్‌ పథకాలు దేశానికే ఆదర్శం
దివంగత మహానేత వైయస్‌ రాజశేఖరరెడ్డి ప్రవేశపెట్టిన పథకాలు దేశానికే ఆదర్శంగా నిలిచాయని విద్యుత్‌ శాఖ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి అన్నారు. ప్రధానంగా వైయస్‌ఆర్‌ ప్రవేశపెట్టిన ఆరోగ్యశ్రీ, ఉచిత విద్యుత్‌ వంటి పథకాలు గతంలో ఏ రాష్ట్రంలోనూ అమలు కాలేదని గుర్తుచేశారు. వైయస్‌ఆర్‌ తాను ప్రవేశపెట్టిన పథకాలతో కోట్లాదిమంది గుండెల్లో చిరస్థాయిగా నిలిచిపోయారని చెప్పారు. ఉచిత విద్యుత్‌పై చంద్రబాబు దుష్ప్రచారం చేశారని, కరెంట్‌ తీగలపై బట్టలు ఆరేసుకోవాలని అవహేళనగా మాట్లాడారని గుర్తుచేశారు. వైయస్‌ఆర్‌ చెప్పిన మాట ప్రకారం ఉచిత విద్యుత్‌ ఫైల్‌పై మొదటి సంతకం చేసి ఉమ్మడి రాష్ట్ర రైతాంగానికి ఉచిత విద్యుత్‌ అందించారని చెప్పారు. ఈరోజుకీ రైతాంగమంతా వైయస్‌ఆర్‌కి నీరాజనాలు పలుకుతున్నారన్నారు. 

 

తాజా వీడియోలు

Back to Top