మూడోసారి పరీక్షలు చేసిన తరువాతే ఇంటికి పంపుతాం

పశుసంవర్థక, మత్స్య శాఖ మంత్రి మోపిదేవి వెంకటరమణ

గుంటూరు: మహమ్మారి కరోనా వైరస్‌ నియంత్రణకు ప్రజల నుంచి మరింత సహకారం కావాలని పశుసంవర్థక, మత్స్య శాఖ మంత్రి మోపిదేవి వెంటక రమణ కోరారు. గుంటూరులో మంత్రి మోపిదేవి వెంకట రమణ మ ఈడియాతో మాట్లాడుతూ.. క్వారంటైన్‌లో ఉన్న 5190 మందికి మెరుగైన వైద్య సేవలు అందిస్తున్నామని వివరించారు. 14 రోజులు క్వారంటైన్‌ పూర్తయి బయటకు వచ్చిన వారికి మళ్లీ పాజిటివ్‌ వచ్చే పరిస్థితులు ఉన్నాయన్నారు. 14 రోజులు పూర్తయిన తరువాత కూడా మరో 14 రోజులు క్వారంటైన్‌లో ఉండాలని, మూడోసారి కూడా పరీక్షలు నిర్వహించిన తరువాతే వారిని ఇంటికి పంపుతామని చెప్పారు. క్వారంటైన్‌లో ఉండి ఇంటికి వెళ్లే వారికి రూ.2 వేల సాయం అందించేందుకు ప్రభుత్వం సిద్ధంగా ఉందన్నారు. ప్రభుత్వ నిర్ణయం మేరకు లాక్‌డౌన్‌కు ప్రజలు సహకరించాలని, భౌతిక దూరం కచ్చితంగా పాటించాలని కోరారు. 

తాజా వీడియోలు

Back to Top