తాడేపల్లి: గతంలో పెళ్ళి అంటే అప్పులు చేయాల్సి వచ్చేది, ఇప్పుడు మాత్రం మీరు గొప్ప ఆలోచనతో ముందుకు వెళుతున్నారని సాంఘీక సంక్షేమ శాఖా మంత్రి మేరుగు నాగార్జున అన్నారు. సీఎం క్యాంప్ కార్యాలయంలో వైయస్ఆర్ కళ్యాణమస్తు, వైయస్ఆర్ షాదీ తోఫా కార్యక్రమంలో భాగంగా వధువు తల్లుల ఖాతాల్లో సీఎం వైయస్ జగన్ నగదు జమ చేశారు. ఈ సందర్భంగా జరిగిన సమావేశంలో మంత్రి మాట్లాడారు. అందరికీ నమస్కారం, అన్నా ఈ రోజు సామాజిక ఎదుగుదలలో భాగంగా మీరు ప్రవేశపెట్టిన అనేక సంక్షేమ పథకాలతో పాటు, ఇదివరకు ఆగిపోయిన కాన్సెప్ట్‌ను మరలా వైయస్ఆర్ కళ్యాణమస్తు, వైయస్ఆర్ షాదీ తోఫా పేరుతో సాయం చేయడం, పైగా గతంలో కంటే ఎక్కువగా సాయం చేస్తున్నారు, దీంతో రాష్ట్రంలోని అనేకమంది పేదలు లబ్ధి పొందుతున్నారు, గతంలో పెళ్ళి అంటే అప్పులు చేయాల్సి వచ్చేది, ఇప్పుడు మాత్రం మీరు గొప్ప ఆలోచనతో ముందుకు వెళుతున్నారు. దీనిపై ప్రతిపక్షాలు, కొన్ని పత్రికలు కట్టుకథలు రాస్తున్నాయి, కానీ ఇది మూడో పర్యాయం సాయం చేస్తున్నాం, దీనిని గమనించాలి. సంక్షేమ పథకాలు కొనసాగించడం లేదంటున్నారు కానీ వారు వాస్తవాలు గుర్తించాలి. ఇది పేదలకు ఉపయోగకరం, దీనిపై వ్యతిరేక మాటలు మాట్లాడే వారికి దేవుడు మంచి ఆలోచనలు ఇవ్వాలి. ధన్యవాదాలు. మీరిచ్చిన విద్యా దీవెన, వసతి దీవెనతో చదువు పూర్తిచేశాను: ఎం.సుమతి, లబ్ధిదారు ఐరాల మండలం, పూతలపట్టు నియోజకవర్గం అన్నా నమస్తే, మేం ముగ్గురం ఆడపిల్లలం, మా పేదరికం వల్ల నేను ఆరో తరగతి నుంచి డిగ్రీ వరకు సోషల్ వెల్ఫేర్ హాస్టల్స్ లోనే చదువుకున్నాను. మీరిచ్చిన విద్యా దీవెన, వసతి దీవెనతో నా బీఎస్సీ బీఈడీ పూర్తిచేశాను, నాకు తండ్రి లేరు, నా పెళ్ళికి చాలా ఇబ్బందులు పడ్డాను, ఈ స్కీమ్ గురించి తెలియగానే సచివాలయంలో అప్లై చేశాను, నేను ఎలిజబుల్ అయ్యానని తెలిసి సంతోషపడ్డాను, అన్నదమ్ములు లేని నాకు మీరు ఈ విధంగా సపోర్ట్ చేశారు, చాలా థాంక్స్ అన్నా, మా అమ్మకు కూడా అనేక పథకాలు అందాయి, మాలాంటి పేదలు బాగా బతకాలని మీరు పెట్టే స్కీమ్స్ వల్ల మేం సమాజంలో గౌరవంగా తలెత్తుకుని బతుకుతున్నాం, మీకు చాలా రుణపడి ఉన్నాం, మీ బ్లెస్సింగ్ మాకు ఎప్పుడూ ఉండాలి, మళ్ళీ కూడా మీరు సీఎంగా ఉండాలని కోరుకుంటున్నాను. ధ్యాంక్యూ అన్నా. మాది కులాంతర వివాహం: కె.అనూష, లబ్ధిదారు, దిగువమండ, గుమ్మలక్ష్మీపురం మండలం, మన్యం జిల్లా నమస్తే సార్, నేను ఎస్టీ కులం, మా వారు ఎస్సీ కులం, మా గ్రామంలో మా పెద్దలు కులాంతర వివాహం చేశారు, ఆ తర్వాత మా సచివాలయం వలంటీర్ వచ్చి మీరు దరఖాస్తు చేస్తే జగనన్న మీకు రూ. 1,20,000 సాయం అందుతుందన్నారు. మేం దరఖాస్తు చేయగానే కొద్ది రోజులకే ఎలిజబుల్ లిస్ట్ లో మా పేరు వచ్చింది, ధన్యవాదాలు సార్, మీకు ఎప్పటికీ రుణపడి ఉంటాం, ఈ డబ్బు వృధా చేయకుండా ఏదో ఒక వ్యాపారం పెట్టుకుని దానికి మీ పేరే పెట్టుకుంటాం, మా నాన్నకు ఫించన్ వస్తుంది, గతంలో ఫించన్ కోసం ఎదురుచూడాల్సి వచ్చేది, ఇప్పుడు సూర్యుడు రాకముందే మా నాన్నకు ఫించన్ వస్తుంది, ఆర్‌బీకేలు చాలా ఉపయోగపడుతున్నాయి, మా అమ్మకు వైఎస్సార్ చేయూత అందింది, మా చెల్లికి జగనన్న విద్యా దీవెన సాయం వస్తుంది, మేమే కాదు మా గ్రామంలో లబ్ధిదారులందరికీ అనేక పథకాలు అందుతున్నాయి, పెద్దలు ఎప్పుడూ చెబుతుంటారు, మనం పుట్టకముందు విధిరాత బ్రహ్మ రాస్తుంటాడని, కానీ మేం పుట్టిన తర్వాత మీరు వచ్చారు, మా భవిష్యత్‌ను తిరిగి రాస్తున్నారు, మీరే మాకు నిజమైన బ్రహ్మదేవుడు, మీరు ఎప్పుడూ ఒక మాట అంటుంటారు, పైన దేవుడు ఉన్నాడు, కింద నా ప్రజలు ఉన్నారని, మీ నమ్మకం ఎప్పుడూ వమ్ము చేసుకోం, మళ్ళీ మీరే సీఎంగా రావాలి, జగనన్నా మీకు ముందస్తుగా స్వాతంత్ర దినోత్సవ, రాఖీ పౌర్ణమి శుభాకాంక్షలు, థ్యాంక్యూ అన్నా. అనుకోకుండా నాన్న చనిపోవడంతో ఇబ్బంది పడ్డాం: ఎస్. ధనలక్ష్మి, పుల్లేటికుర్రు, అంబాజీపేట మండలం అన్నా, నేను ఈ పథకం లబ్ధిదారుగా ఎంపికవడంతో చాలా సంతోషంగా ఉంది, నాలాంటి పేద అమ్మాయిలకి ఈ పథకం వరం, నేను శెట్టి బలిజ సామాజికవర్గానికి చెందిన మహిళను, నేను తమ్ముడు ఉన్నాం, అనుకోకుండా నాన్న చనిపోవడంతో అమ్మ కూలీ పనులు చేసి జీవనం కొనసాగించింది, తమ్ముడు ఐటీఐ చదువుకున్నాడు, నా వివాహం మాకు ఆర్ధిక ఇబ్బంది అయినా మా అమ్మ ఈ పథకం వస్తుందన్న భరోసాతో పెళ్ళి చేశారు, నేను వలంటీర్ ద్వారా అప్లికేషన్ పెట్టుకుని ఎలిజబుల్ అయ్యాను, చాలా సంతోషంగా ఉంది, మా అమ్మకు ఆరోగ్యశ్రీ ద్వారా గుండె ఆపరేషన్ జరిగింది, లేదంటే మేం అనాధలయ్యాం, మా అమ్మకు వితంతు ఫించన్ వస్తుంది, మీరు ప్రవేశపెట్టిన అనేక పథకాల వల్ల మా పేదలు ఆనందంగా బతుకుతున్నారు, మీరు చల్లగా పదికాలలపాటు ఉండాలని భగవంతున్ని కోరుకుంటున్నాను, మీరు మళ్ళీ మళ్ళీ సీఎంకావాలి, ధన్యవాదాలు అన్నా.