చంద్రబాబు నరరూప రాక్షసుడు

మంత్రి మేరుగ నాగార్జున

ప్రజలను భక్షించడం తప్ప..చంద్రబాబు చేసిన మేలు ఏమీ లేదు

పేదలను పీల్చి పిప్పి చేసిన వ్యక్తి చంద్రబాబు

టీడీపీ హయాంలో ఒక్క మంచి పథకమైనా ఉందా?

చంద్రబాబుకు అధికార యాత పత్ప..మరొకటి లేదు

చంద్రబాబు చెప్పేవన్నీ అభూత కల్పనలే

వచ్చే ఎన్నికల్లో చంద్రబాబుకు ప్రజలు మళ్లీ బుద్ధి చెబుతారు

తాడేప‌ల్లి:  ప్ర‌తిప‌క్ష‌నేత చంద్రబాబు నరరూప రాక్షసుడ‌ని మంత్రి మేరుగ నాగార్జున మండిప‌డ్డారు.  చంద్రబాబువి దిగజారుడు రాజకీయాలని విమ‌ర్శించారు. అన్ని వర్గాలను మోసం చేసిన చరిత్ర చంద్రబాబుది అని ధ్వ‌జ‌మెత్తారు.  చంద్రబాబు రాష్ట్రానికి 14 ఏళ్ల పాటు సీఎంగా ఉన్నా ఒక్క మంచి పని కూడా చేయలేదు. అన్ని వర్గాలను మోసం చేసిన చరిత్ర చంద్రబాబుది. కరోనాకు భయపడి పక్క రాష్ట్రం పారిపోయారు. ముఖ్యమంత్రి వైయ‌స్‌ జగన్‌మోహన్‌రెడ్డి హయాంలో అన్ని వర్గాల అభివృద్ది జరిగింది. డీబీటీ రూపంలో లక్షల కోట్ల రూపాయలు బదిలీ చేశాం. టీడీపీ హయాంలో ఒక్క మంచి పథకమైనా ఉందా?. చంద్రబాబుకు అధికార యావ తప్ప మరొకటి లేదు. చంద్రబాబు చెప్పేవన్నీ అభూత కల్పనలే. చంద్రబాబువి అన్నీ దిగజారుడు రాజకీయాలే. పేదల కోసం చంద్రబాబు చేసిందేమీ లేదు. పేదలను పీల్చి పిప్పి చేసిన వ్యక్తి చంద్రబాబు. వచ్చే ఎన్నికల్లో చంద్రబాబుకు ప్రజలు మళ్లీ బుద్ధి చెబుతారని హెచ్చ‌రించారు. శుక్ర‌వారం తాడేప‌ల్లిలోని వైయ‌స్ఆర్‌సీపీ కేంద్ర కార్యాల‌యంలో మేరుగ నాగార్జున మీడియాతో మాట్లాడారు. 

మంత్రి మేరుగ నాగార్జున ఏం మాట్లాడారంటే..:

ఓడిపోయి.. హైదరాబాద్‌ పారిపోయి..:
    2014 ఎన్నికల ముందు ఇచ్చిన ఏ ఒక్క హామీ నిలబెట్టుకోని చంద్రబాబు, గత ఎన్నికల్లో చిత్తుగా ఓడిపోయి, హైదరాబాద్‌ పారిపోయారు. కరోనా సమయంలో సీఎంగారు నిత్యం ప్రజలకు మనోధైర్యం కల్పిస్తే.. చంద్రబాబు, ఆయన కుమారుడు హైదరాబాద్‌లో దాక్కున్నారు. 

నమ్మించి గొంతు కోసే యత్నం:
    మరో ఏడాదిలో ఎన్నికలు జరగనుండడంతో హైదరాబాద్‌ నుంచి వస్తున్న చంద్రబాబు, మళ్లీ ప్రజలను ఏమార్చడానికి ప్రయత్నం చేస్తున్నారు. అందుకే దెయ్యాలు వేదాలు వల్లించినట్లు మాట్లాడుతున్నాడు. ప్రజల్ని మళ్లీ నమ్మించి గొంతు కోయాలని ప్రయత్నిస్తున్నాడు.
    14 ఏళ్లు సీఎంగా పని చేసిన చంద్రబాబు రాష్ట్రానికి ఈ మంచి చేశాను అని చెప్పగలరా? విపక్షనేతగా ప్రజల శ్రేయస్పు కోసం ఒక్క సలహా అయినా ఇచ్చారా? చంద్రబాబు నరరూప రాక్షసుడు. ప్రజలను భక్షించడమే తప్ప రక్షించాలనే తపన ఆయనకు ఏ మాత్రం లేదు.

వెలివేయాల్సిన వారిలో ఫస్ట్‌:
    నిరుపేదలన్నా, దళితులన్నా చంద్రబాబుకు, ఆయన కుమారుడు లోకేశ్‌కు ఎలాంటి చిత్తశుద్ధి లేదు. వారిని బాగు చేయాలన్న ఆలోచన అంతకన్నా లేదు. పేదలను మోసం చేçస్తున్న చంద్రబాబు రాజకీయం చేస్తున్నారు. ఆయన హయాంలో ఎందరో దళితులను వెలివేశారు. అందుకే చంద్రబాబు మాటలు ఎవ్వరూ నమ్మరు. ఇంకా చెప్పాలంటే రాష్ట్రంలో కేవలం తన వాళ్లే బతకాలనుకునే మూర్ఖుడు చంద్రబాబు. అందుకే సమాజంలో వెలివేయాల్సిన రాజకీయ నాయకుల్లో చంద్రబాబే ఫస్ట్‌ ప్లేస్‌లో ఉంటారు.

పాలనలో తేడాపై చర్చించే దమ్ముందా?:
    ప్రభుత్వంపై బురద చల్లుతూ ఏదో ఒక కార్యక్రమం పేరుతో పర్యటిస్తున్న చంద్రబాబు, మళ్లీ హామీలు గుప్పిస్తూ, ప్రజలను నమ్మించే ప్రయత్నం చేస్తున్నారు. 14 ఏళ్ల పాలనలో ఏనాడూ ప్రజలకు మేలు చేయని చంద్రబాబు.. తన పరిపాలనలో ఏం చేశాననేది చెప్పుకునే ధైర్యం ఉందా? ఇచ్చిన ప్రతి హామీ నిలబెట్టుకున్న ప్రభుత్వం మాది. 
    అందుకే చంద్రబాబుకు సవాల్‌ చేస్తున్నా. నీ 14 ఏళ్ల పాలన.. మా నాయకుడి నాలుగేళ్ల పరిపాలనపై చర్చకు సిద్ధమా? ఆ దమ్మూ ధైర్యం నీకుందా? మెడలో మైక్‌ పెట్టుకుని, అదేపనిగా విమర్శలు, ఊకదంపుడు ఉపన్యాసాలు చేయడం కాదు. రాష్ట్రంలో సంక్షేమ పథకాల ఒరవడి కొనసాగుతోంది. ఇది నభూతో నభవిష్యత్తు. 

మాది సంక్షేమ, అభివృద్ధి ప్రభుత్వం:
    జగన్‌గారి పాలనలో రాష్ట్రం సుబిక్షంగా ఉంది. అన్ని వర్గాల ప్రజలు సంతోషంగా ఉన్నారు. మాది సంక్షేమ, అభివృద్ధి ప్రభుత్వం. సీఎం శ్రీ వైయస్‌ జగన్, తన అత్యుత్తమ పాలనతో రాష్ట్రంలో సామాజిక విప్లవానికి తెర తీశారు.
    గ్రామ స్వరాజ్యాన్ని సాకారం చేస్తూ, ఊళ్ల రూపురేఖలు పూర్తిగా మార్చారు. గ్రామాల్లో సచివాలయాలు, ఆర్బీకేలు, హెల్త్‌ సెంటర్లు, డిజిటల్‌ లైబ్రరీల వంటి వాటితో అనేక మార్పులు తెచ్చారు. ప్రతి 50 ఇల్లకు వలంటీర్లు ప్రభుత్వ పథకాలను డోర్‌ డెలివరీ చేస్తున్నారు. పరిపాలన వికేంద్రీకరణ కోసం, కొత్త జిల్లాలు ఏర్పాటు చేశారు. ఎక్కడా అవినీతికి తావు లేకుండా, డీబీటీ విధానంలో, పూర్తి పారదర్శకంగా పలు పథకాల ద్వారా ఏకంగా రూ.2.08 లక్షల కోట్లు నేరుగా లబ్ధిదారుల ఖాతాల్లో జమ చేశారు.
    మరోవైపు పారిశ్రామిక రంగంలోనూ రాష్ట్రం పురోగమిస్తోంది. 
ప్రాజెక్ట్‌ టుడే వారు పెట్టుబడుల విషయంలో సర్వే చేస్తే దేశంలోనే ఏపీ నంబర్‌ వన్‌ స్థానంలో ఉందని తేలింది. ఇది వాస్తవం. ఒక చరిత్ర. దాన్ని ఎవ్వరూ మార్చలేరు. 

మళ్లీ హామీల బాట:
    నిరుపేదలకు మేలు జరిగితే, వారు బాగు పడితే చంద్రబాబుకు కడుపు మంట. ఆయన దాన్ని ఓర్చుకోలేరు. ఆయన పాలనంతా అవినీతి, అశ్రిత పక్షపాతమే. అందుకే నిత్యం అసత్యాలతో ప్రభుత్వాన్ని నిందిస్తూ, ఎలాగైనా తిరిగి అధికారంలోకి రావాలని విశ్వ ప్రయత్నం చేస్తున్నారు. అందుకే మళ్లీ హామీలు గుప్పిస్తున్నారు.
    అధికారంలోకి వస్తే ఇంటికో ఉద్యోగం ఇస్తానంటున్న చంద్రబాబు, గతంలో ఆ పని ఎందుకు చేయలేదు? ఒక గజదొంగ ఏనాడైనా తన హామీలు నిలబెట్టుకోగలరా? పైగా అర్ధం లేని పిచ్చి విమర్శలు.

జగన్‌గారు సంఘ సంస్కర్త:
    మాది పేదల పక్షపాత ప్రభుత్వం. మాది ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీల సంక్షేమ ప్రభుత్వం. అందుకే పెత్తందార్లంతా ఒక వైపు.. పేదలంతా మరోవైపు అని మా నేత ధైర్యంగా చెబుతుంటారు. అందుకే సీఎం శ్రీ వైయస్‌ జగన్‌ ఒక సంఘ సంస్కర్త. అంబేద్కర్, జ్యోతిరావుపూలే మాదిరిగా ధీరోదాత్త గుణాలున్న వ్యక్తి.

నీ అబ్బ సొమ్మా లోకేశ్‌?:
    తాము అధికారంలో వస్తే విద్యా దీవెన పథకం తొలగిస్తామని లోకేశ్‌ చెబుతున్నాడు. అదేమైనా నీ అబ్బ సొమ్మా లోకేశ్‌? పిల్లలకు ఎంతో మేలు చేసే పథకాన్ని తొలగిస్తామని ఎలా చెబుతున్నారు. అంటే మీకు పేద ప్రజలపై ఏ మాత్రం చిత్తశుద్ధి లేదని అర్ధమవుతోంది. ఆ విషయం ప్రజలకూ బాగా అర్ధమైంది. అందుకే మీకు మళ్లీ ఘోర పరాజయం తప్పదు. 

అంబేద్కర్‌ పేరునే ఒప్పుకోని కన్నా:
    నాడు కాంగ్రెస్‌లో ఎన్నో పదవులు అనుభవించిన కన్నా లక్ష్మీనారాయణ. ఇప్పుడు స్వార్థ రాజకీయం కోసం చంద్రబాబు పంచన చేరాడు. అలాంటి వ్యక్తి వచ్చే ఎన్నికల్లో తమ పార్టీని గెలిపిస్తానంటున్నాడు. 2024లో గుంటూరు జిల్లాలో ఆయన ఎంత మందిని గెలిపిస్తాడో చూద్దాం. గుంటూరు లాడ్జి సెంటర్‌కు అంబేద్కర్‌ సెంటర్‌ అని పేరు పెడితే ఆనాడు కన్నా ఒప్పుకోలేదు. మళ్లీ ఆయనే ఈరోజు అంబేద్కర్‌ విగ్రహానికి పూల దండ వేస్తాడని మంత్రి శ్రీ మేరుగ నాగార్జున గుర్తు చేశారు

 

Back to Top