అర్హత కలిగిన ప్రతి రైతుకు వైయస్‌ఆర్‌ రైతు భరోసా

వ్యవసాయ శాఖ మంత్రి కురసాల కన్నబాబు
 

కాకినాడ: అర్హత కలిగిన ప్రతి రైతు, కౌలు రైతుకు వైయస్‌ఆర్‌ రైతు భరోసా పథకం అందుతుందని వ్యవసాయ శాఖ మంత్రి కురసాల కన్నబాబు అన్నారు. రైతు భరోసా పథకం లబ్ధిదారుల కోసం ఈ నెల 25వ తేదీ వరకు సర్వే కొనసాగుతుందన్నారు. కాకినాడలో మంత్రి కన్నబాబు మీడియాతో మాట్లాడుతూ.. సర్వే కోసం మోనటరింగ్‌ కమిటీలను నియమించినట్లు చెప్పారు. సర్వేను వేగవంతంగా పూర్తి చేయడానికి వలంటీర్లతో కలిసి వ్యవసాయ, రెవెన్యూ శాఖల అధికారులు పనిచేయాలని ఆదేశించినట్లు వివరించారు. లబ్ధిదారుల జాబితాలో అర్హత కలిగిన ప్రతి రైతు, కౌలు రైతు ఉండాలని సీఎం వైయస్‌ జగన్‌మోహన్‌రెడ్డి ఆదేశించారన్నారు. రైతు భరోసా కింద రైతులకు ఇచ్చే సొమ్మును వేరొక రుణాలకు జమ చేయకూడదని బ్యాంకర్లను సీఎం ఆదేశించారన్నారు.

Back to Top