మద్యనిషేధం గురించి మాట్లాడే అర్హత టీడీపీకి లేదు

మద్యపాన నిషేధానికి తూట్లు పొడిచింది చంద్రబాబే..

జంగారెడ్డిగూడెం సహజ మరణాలపై టీడీపీ శవరాజకీయం చేస్తోంది

బాబు లాంటి నీచమైన ప్రతిపక్షనేత దొరకడం రాష్ట్రానికి దౌర్భాగ్యం 

 అసెంబ్లీలో టీడీపీ సభ్యుల తీరుపై మంత్రి కొడాలి నాని మండిపాటు

అసెంబ్లీ: చంద్రబాబు, టీడీపీ సభ్యులకు మద్యపాన నిషేధం గురించి మాట్లాడే నైతిక అర్హత లేదని, ఎన్టీఆర్‌ మద్యపాన నిషేధం పథకానికి తూట్లు పొడిచిన దుర్మార్గుడు చంద్రబాబు అని పౌరసరఫరాల శాఖ మంత్రి కొడాలి నాని అన్నారు. ఈ రాష్ట్రంలో బెల్టుషాపులు, బార్లు, వైన్‌ షాపులు, పర్మిట్‌ రూమ్‌లు పెట్టి భయంకరంగా మద్యాన్ని ఏరులై పారించిన దుర్మార్గుడు చంద్రబాబు అని ధ్వజమెత్తారు. అసెంబ్లీలో తెలుగుదేశం పార్టీ సభ్యుల డ్రామాలపై మంత్రి కొడాలి నాని ధ్వజమెత్తారు. టీడీపీ అధికారంలో ఉన్నప్పుడు మద్యపానాన్ని అమలు చేయాలని, అధికారంలో లేకపోతే మద్యపాన ఉద్యమాన్ని నడిపే పరిస్థితిలో ఈనాడు రామోజీరాము వ్యవహరిస్తాడన్నారు. రామోజీరావుకు వయస్సు వచ్చింది కానీ బుద్ధిరాలేదన్నారు.  

జంగారెడ్డిగూడెంలో మరణాలపై బాధిత కుటుంబ సభ్యులు ఎక్కడా ఆందోళనకు దిగలేదని, మృతులను ఆస్పత్రులకు తీసుకురాలేదని, కేసులు పెట్టలేదని, కల్తీ మద్యం, నాటు సారాయి వల్ల చనిపోయారని ఆ కుటుంబ సభ్యులు చెప్పకపోయినా.. శ్మశానానికి వెళ్లి చనిపోయిన వారి లిస్టు తెచ్చుకొని ఈనాడు ప్రచురిస్తే.. మద్యపానానికి తూట్లు పొడిచిన నీచుడు చంద్రబాబు జంగారెడ్డిగూడెం వెళ్తున్నాడన్నారు. టీడీపీ సభ్యులు అసెంబ్లీకి వెళ్లి గొడవ చేయండి అని చెబితే డ్రామా ఆర్టిస్టులంతా వచ్చి సభ నడవకుండా డ్రామాలాడుతున్నారని మండిపడ్డారు. చంద్రబాబు అనే సిగ్గులేని నీచమైన ప్రతిపక్షనేత రాష్ట్రానికి దొరకడం దౌర్భాగ్యమన్నారు. సిగ్గు, శరం లేకుండా మద్యపానం గురించి మాట్లాడే నైతిక హక్కు టీడీపీకి ఉందా.. అని మంత్రి కొడాలి ప్రశ్నించారు. 

మద్యపానంతో చనిపోయిన ప్రతీ వ్యక్తి ఉసురు చంద్రబాబుకే  తగులుతుందన్నారు. ఈ రాష్ట్రంలో వైయస్‌ఆర్‌ సీపీ అధికారంలోకి వచ్చిన తరువాత బెల్టుషాపులు రద్దు, వైన్‌షాపుల పర్మిట్‌ రూమ్‌లను సీఎం వైయస్‌ జగన్‌ సస్పెండ్‌ చేశారు. బార్లను కూడా రద్దు చేయాలని చూస్తే దుర్మార్గుడు చంద్రబాబు 2018లో బార్లను 5సంవత్సరాలు రెన్యూవల్‌ చేసి వెళ్లాడని, ఆ బార్ల యాజమాన్యాలు కోర్టులకు వెళ్లి రద్దును అడ్డుకున్నారన్నారు. చంద్రబాబు వల్లే బార్లు నడుస్తున్నాయన్నారు. సహజంగా మరణిస్తే.. ఆ మరణాలపై సిగ్గులేకుండా అసెంబ్లీలో టీడీపీ సభ్యులు డ్రామాలు ఆడుతున్నారని మంత్రి కొడాలి నాని మండిపడ్డారు. 
 

Back to Top