తండ్రీకొడుకులకు బీసీలంటే గౌరవం లేదు

చంద్రబాబు ఒక్క బీసీ నేతనైనా రాజ్యసభకు పంపాడా..?

పౌరసరఫరాల శాఖ మంత్రి కారుమూరి నాగేశ్వరరావు ప్రశ్న

తాడేపల్లి: తండ్రీకొడుకులు చంద్రబాబు, లోకేష్‌కు బీసీలంటే గౌరవం లేదని పౌరసరఫరాల శాఖ మంత్రి కారుమూరి నాగేశ్వరరావు అన్నారు. ఎన్నికల ప్రణాళిక (మేనిఫెస్టో) అంటే ఏంటో కూడా తెలియని అజ్ఞాని లోకేష్‌ అని ఎద్దేవా చేశారు. మంత్రి కారుమూరి నాగేశ్వరరావు మీడియాతో మాట్లాడుతూ.. టీడీపీ అధికారంలో ఉన్న సమయంలో తమ సమస్యలు పరిష్కరించాలని కోరిన బీసీలను ‘తోకలు కత్తిరిస్తా’ అని చంద్రబాబు బెదిరించాడని గుర్తుచేశారు. టీడీపీ తరఫున ఒక్క బీసీ నాయకుడినైనా రాజ్యసభకు పంపించాడా..? కోట్ల రూపాయలకు రాజ్యసభ సీట్లను అమ్ముకున్న నీచుడు చంద్రబాబు అని మండిపడ్డారు. ముఖ్యమంత్రి వైయస్‌ జగన్‌ బీసీలకు పెద్దపీట వేశారని చెప్పారు. 
 

Back to Top