మాట నిలబెట్టుకునే ఏకైక నాయకులు సీఎం వైయస్‌ జగన్‌

మంత్రి కురసాల కన్నబాబు
 

తాడేపల్లి:  మాట ఇచ్చి నిలబెట్టుకునే ఏకైక నాయకులు ముఖ్యమంత్రి వైయస్‌ జగన్‌ మోహన్‌ రెడ్డి అని వ్యవసాయ శాఖ మంత్రి కురసాల కన్నబాబు పేర్కొన్నారు. 2021 ఖరీఫ్‌ సీజన్‌లో గులాబ్‌ తుపాను కారణంగా నష్టపోయిన రైతులకు మంగళవారం  పంట నష్టపరిహారం పంపిణీ కార్యక్రమం తాడేపల్లిలోని ముఖ్యమంత్రి క్యాంపు కార్యాలయంలో ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా కన్నబాబు మాట్లాడారు.
మాట ఇచ్చి నెరవేర్చే నాయకుడు దేశంలో సీఎం వైయస్‌ జగన్‌ ఒక్కరే. ప్రకృతి విపత్తులతో నష్టపోయిన రైతులకు అదే సీజన్‌లో పరిహారం అందజేసిన ముఖ్యమంత్రి దేశంలో ఎక్కడా లేరు. సెప్టెంబర్‌లో సంభవించిన గులాబ్‌ తుపాన్‌లో పంటలు నష్టపోయిన రైతులకు ఇవాళ రైతుల ఖాతాల్లో నేరుగా డబ్బులు జమ చేయడంతో రైతులు కూడా ఈ పరిణామాన్ని ఊహించలేకపోతున్నారు. రబీలో నష్టపోయిన రైతులకు ఇవాళ ఇన్‌ఫు సబ్సిడీ విడుదల చేయడం శుభపరిణామం. 34,586 మంది రైతులకు రూ.22 కోట్ల ఇన్‌పుట్‌ సబ్సిడీ ఇవాళ సీఎం అందజేయడం, పంటలు మళ్లీ భారీ వర్షాల ద్వారా ఇబ్బంది పడుతున్న రైతులకు ఈ పరిహారం ఆసరా అవుతుంది. వైయస్‌ జగన్‌ అధికారంలోకి వచ్చిన తరువాత దాదాపు 13.96 లక్షల రైతు కుటుంబాలకు ఒక్క వెయ్యి 70 కోట్ల రూపాయలు నేరుగా బ్యాంకు ఖాతాల్లో పంట నష్ట పరిహారాన్ని ఇ చ్చారు. అధికారంలోకి వచ్చిన వెంటనే రూ.2 వేల కోట్లతో ప్రకృతి వైఫరిత్యాల నిధిని ఏర్పాటు చేసి ..రైతుకు ఏ కష్టం వచ్చినా ఆదుకుంటామనే ఒక భరోసాను ఇచ్చారు. వ్యవసాయ రంగానికి ఊతాన్ని ఇచ్చేందుకు ఈ ప్రభుత్వం వ్యూహాత్మకంగా ముందుకు వెళ్తోంది. శాశ్వతంగా వ్యవస్థలను మార్పు చేయడం, సంస్కరణలు తీసుకురావడం, తాత్కాలికంగా ఆదుకునే ప్రయోజనాలు కల్పించేందుకు సీఎం వైయస్‌ జగన్‌ ద్విముఖ వ్యూహంతో ముందుకు వెళ్తున్నారు. అలాంటి నాయకత్వంలో ఈ రాష్ట్రంలో వ్యవసాయ రంగం పురోగతి సాధిస్తుందని మంత్రి కన్నబాబు హర్షం వ్యక్తం చేశారు.
 

Back to Top