సార్వత్రిక ఎన్నికల్లో చంద్రబాబు బండారం బయటపడుతుంది

మంత్రి కాకాణి గోవర్ధన్‌రెడ్డి
 

అమరావతి: 2024 సార్వత్రిక ఎన్నికల్లో చంద్రబాబు బండారం బయటపడుతుందని మంత్రి కాకాణి గోవర్ధన్‌రెడ్డి అన్నారు. అసెంబ్లీ మీడియా పాయింట్‌ వద్ద మంత్రి మాట్లాడారు. సార్వత్రిక ఎన్నికల్లో ప్రాథమిక ఓటు ఉండదు..ఒకరికి ఒక ఓటే ఉంటుందన్నారు. పార్టీకి వ్యతిరేకంగా ఓటు వేసిన ఎమ్మెల్యేలను గుర్తిస్తామని చెప్పారు. 2024 ఎన్నికల్లో వైయస్‌ఆర్‌సీపీ ఘన విజయం సాధిస్తుందని మంత్రి ధీమా వ్యక్తం చేశారు. వైయస్‌ జగన్‌ మోహన్‌ రెడ్డి మరల ముఖ్యమంత్రి కావడం ఖాయమన్నారు. ఈ మధ్యలో ఎక్కడైన ఒకటి రెండు పొరపాట్లు జరిగితే వాటిని సరిచేసుకుని ముందుకు వెళ్తామని చెప్పారు.
 

Back to Top