సంక్షేమం, అభివృద్ధి ప్రభుత్వ లక్ష్యాలు 

అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేసిన మంత్రి కాకాణి గోవ‌ర్ధ‌న్‌రెడ్డి

నెల్లూరు: సంక్షేమంతో పాటు అభివృద్ధికీ తమ ప్రభుత్వం కట్టుబడి ఉందని మంత్రి కాకాణి గోవ‌ర్ధ‌న్‌రెడ్డి స్పష్టం చేశారు. వెంకటగిరి నియోజకవర్గం సైదాపురం మండల కేంద్రంలో తిరుపతి ఎంపీ గురుమూర్తి, వెంకటగిరి శాసనసభ్యులు ఆనం రామనారాయణరెడ్డి, జడ్పీ చైర్‌ప‌ర్స‌న్‌ ఆనం అరుణమ్మ తో కలిసి పలు అభివృద్ధి కార్యక్రమాల్లో రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి  కాకాణి గోవర్ధన్ రెడ్డి పాల్గొన్నారు. రూ. 1.60 కోట్లతో మండల ప్రజా పరిషత్ కార్యాలయ భవన సముదాయ నిర్మాణానికి భూమి పూజ, రూ. 45 కోట్ల సి ఆర్ ఐ ఎఫ్ నిధులతో రోడ్డు ఆధునీకరణ, రూ. 1.70 లక్షలతో ఎఎంసి గోడౌన్ల నిర్మాణం, రూ. 3.47 కోట్లతో ఎఐఐబి రోడ్ల నిర్మాణానికి శంకుస్థాపన చేశారు. 
 
ఈ సందర్భంగా కాకాణి గోవ‌ర్ధ‌న్ రెడ్డి మాట్లాడుతూ.. అభివృద్ధి ఫలాలను అందరికీ అందించాలన్నది తమ ప్రభుత్వ ఉద్దేశమన్నారు. గడపగడపకు మన ప్రభుత్వం కార్యక్రమం ద్వారా ఇంటింటికీ వెళ్లి ప్రజల సామాజిక, వ్యక్తిగత సమస్యలను సైతం తెలుసుకొని, వాటిని పరిష్కరించేందుకు కృషి చేస్తున్నామని చెప్పారు. ప్రజల సౌకర్యం కోసం ఇప్పటికే పలు రహదారులను నిర్మించామని తెలిపారు.  
 
 

Back to Top