మ‌ళ్లీ జ‌గ‌న‌న్నే ముఖ్య‌మంత్రి

గ‌డ‌ప గ‌డ‌ప‌కు మ‌న ప్ర‌భుత్వం కార్య‌క్ర‌మంలో నిన‌దించిన మ‌హిళ‌లు

ఓర్ల‌గొందితిప్పా గ్రామంలో మంత్రి జోగి ర‌మేష్‌కు ఘ‌న స్వాగ‌తం

కృష్ణా జిల్లా: 2024లో కూడా వైయ‌స్ జ‌గ‌న్ మోహ‌న్ రెడ్డినే ముఖ్య‌మంత్రి అవుతార‌ని మ‌హిళ‌లు నిన‌దించారు. తోడబుట్టిన అన్నలు కన్నా జగనన్న మిన్న అని అక్కా చెల్లెమ్మలు కొనియాడారు. ఓర్లగొందితిప్పా గ్రామంలో మంత్రి జోగి రమేష్ గ‌డ‌ప గ‌డ‌ప‌కు మ‌న ప్ర‌భుత్వం కార్య‌క్ర‌మాన్ని నిర్వ‌హించారు.  ఈ సంద‌ర్భంగా మంత్రి జోగి ర‌మేష్ ఇంటింటా ప‌ర్య‌టిస్తూ నాలుగేళ్లుగా ప్రభుత్వం అందిస్తున్న సంక్షేమ పథకాలు గురించి వివరిస్తూ, ప్రజల సమస్యలు ఏమైనా ఉంటే తెలుసుకుంటూ, వాటికి అక్కడికక్కడే పరిష్కారం చూపుతూ ప్రజలతో మమేకమయ్యారు.   

అనంత‌రం మంత్రి మాట్లాడుతూ..స‌చివాల‌య‌, వాలంటీర్ల వ్య‌వ‌స్థ‌తో గాంధీజీ క‌ల‌లు క‌న్న గ్రామ స్వ‌రాజ్యాన్ని సీఎం వైయ‌స్ జ‌గ‌న్ తీసుకువ‌చ్చార‌న్నారు. కులాలు,మ‌తాలు, పార్టీలు, ప్రాంతాల‌కు అతీతంగా సంక్షేమ ప‌థ‌కాలు అందిస్తున్నార‌ని చెప్పారు. విత్తనం నుంచి పంట విక్రయం వరకు ప్రతి అంశంలోనూ రైతుకు మేలు జరిగేలా ప్రభుత్వం చర్యలు తీసుకుంటోందన్నారు. అకాల వర్షాలు, ప్రకృతి విపత్తుల సమయంలో దెబ్బ తిన్న పంటకు అదే సీజన్‌లో పరిహారం అందించి అండగా నిలుస్తోందన్నారు.   కౌలు రైతులకు వైయ‌స్ఆర్  రైతు భరోసా అందించడం సంతోషకరమన్నారు. దేశంలో ఎక్కడా లేని విధంగా కౌలు, అటవీ భూములు, దేవదాయ భూములు సాగు చేసే రైతులకు కూడా ప్రభుత్వం రైతు భరోసా అందిస్తోందన్నారు.  ముఖ్యమంత్రి వైయ‌స్ జగన్‌మోహన్‌ రెడ్డి మాట ఇచ్చిన దాని కన్నా మిన్నగా రైతులకు ఆర్థిక సహాయం చేస్తున్నారన్నారు.  

చంద్రబాబు హయాంలో ఆంధ్ర రాష్ట్రం చదువుల్లో 15వ స్థానంలో ఉండేది. నేడు ఆంధ్ర రాష్ట్రం విద్యా వ్యవస్థలో 3వ స్థానంలోకి తీసుకొచ్చారు సీఎం వైయ‌స్‌ జగన్. పప్పు లోకేష్ పాదయాత్రలో యువకుల్ని గొడవలు పడండి, కేసులు పెట్టించుకోండి  అంటున్నాడు. మీ పిల్లలు గొప్పగా ఉన్నత స్థితిలో ఉండాలని సీఎం వైయ‌స్ జగన్ కోరుకొంటున్నారు. ముఖ్యమంత్రి పారదర్శక పాలన గురించి ఇతర రాష్ట్రాల నుంచి వచ్చి మరీ తెలుసుకుని వెళ్తున్నారు. ఇన్ని పథకాల ద్వారా సీఎం వైయ‌స్ జగన్‌ మీకు ఇన్ని డబ్బులు ఇస్తున్నారు కదా.. మరి గతంలో ఈ డబ్బంతా ఏమైపోయిందో ఆలోచించండి అని అన్నారు.  కార్యక్రమంలో కృత్తివెన్ను మండల ప్రజా ప్రతినిధులు, నాయకులు, అధికారులు కార్యకర్తలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. 

Back to Top