సీఎం వైయ‌స్‌ జగన్‌కు పేరు, ప్రఖ్యాతలు వస్తుంటే బాబు తట్టుకోలేకపోతున్నారు

మంత్రి గుడివాడ అమ‌ర్‌నాథ్
 

 అమ‌రావ‌తి:  ముఖ్య‌మంత్రి వైయ‌స్‌ జగన్ మోహ‌న్ రెడ్డికి మంచి పేరు, ప్రఖ్యాతలు వస్తుంటే ప్ర‌తిప‌క్ష నేత చంద్ర‌బాబు తట్టుకోలేకపోతున్నార‌ని మంత్రి గుడివాడ అమ‌ర్‌నాథ్ మండిప‌డ్డారు.  సీఎం వైయ‌స్ జ‌గ‌న్ ప‌ర్య‌ట‌న‌పై టీడీపీ అధినేత నారా చంద్రబాబు నాయుడు, ఆ పార్టీ నేత‌లు చేస్తున్న దుష్ప్ర‌చారాన్ని ఏపీ పరిశ్రమల శాఖా మంత్రి గుడివాడ అమర్నాథ్ తీవ్రంగా ఖండించారు. దావోస్‌ పర్యటనలో ఉన్న మంత్రి అమర్నాథ్‌ మీడియాతో మాట్లాడుతూ.. ‘‘ఆంధ్రప్రదేశ్‌ ముఖ్యమంత్రి వైయ‌స్‌ జగన్‌మోహన్‌రెడ్డి దావోస్‌ పర్యటనపై చంద్రబాబు తప్పుడు ప్రచారం చేస్తున్నారు. ఏపీ రాష్ట్ర ప్రతిష్ట ఏమైపోయినా పర్వాలేదన్నది బాబు ఉద్ధేశం. సీఎం వైయ‌స్‌ జగన్‌కు పేరు, ప్రఖ్యాతలు వస్తుంటే చంద్రబాబు తట్టుకోలేకపోతున్నారు. మంచి ఫలితాలతో దావోస్‌ నుంచి తిరిగివస్తామ‌ని గుడివాడ అమ‌ర్‌నాథ్‌ స్పష్టం చేశారు. 
 

తాజా వీడియోలు

తాజా ఫోటోలు

Back to Top