కాకినాడ: ఎన్నికల సమయంలో ప్రజలకు ఇచ్చిన హామీలలో 95 శాతానికి పైగా నెరవేర్చి అర్హులు అందరికీ ప్రభుత్వ సంక్షేమ పథకాలు అందజేస్తూన్న ఏకైక ముఖ్యమంత్రి వైయస్ జగన్ మోహన్ రెడ్డి అని మంత్రి దాడిశెట్టి రాజా అన్నారు. తుని మండలం సూరవరం అన్నవరం గ్రామంలో గడప గడపకు మన ప్రభుత్వం కార్యక్రమంలో మంత్రి పాల్గొన్నారు. మండల అధికారులు, ప్రజా ప్రతినిధులు, స్థానిక నాయకులు, సచివాలయం సిబ్బంది, వాలంటీర్లు, కార్యకర్తలతో పాటు కలిసి గ్రామంలో గడప గడపకి వెళ్లి ప్రజలను కలుసుకుని, వారు పొందిన సంక్షేమ పథకాలను తెలియచేస్తూ ప్రతీ గడప వద్దనుంచి దీవెనలు స్వీకరిస్తున్నారు. గ్రామానికి వచ్చిన మంత్రికి గ్రామస్తులు ఘన స్వాగతం పలికారు. దాడిశెట్టి రాజా గడపగడపకు వెళ్లి సీఎం వైయస్ జగనన్న నాయకత్వంలో మన ప్రభుత్వం చేస్తున్న అభివృద్ధి, సంక్షేమ పథకాల ద్వారా వారికి కలిగిన ప్రయోజనాన్ని తెలియశారు. ప్రతీ గడపలో ఆయా కుటుంబ సభ్యులు పొందుతున్న పథకాల వివరాలతో సీఎం వైయస్ జగన్ సంతకం చేసిన కరపత్రాన్ని స్వయానా లబ్ధిదారులకు అందచేశారు. మీరంతా మనస్ఫూర్తిగా మరోసారి సీఎం వైయస్ జగన్‌ను ఆశీర్వదించాలని మంత్రి కోరారు.