వేసిన రోడ్లు, చేస్తున్న అభివృద్ధి కనిపించడం లేదా..?

ప్రతిపక్షాలకు ఆర్‌ అండ్‌ బీ శాఖ మంత్రి దాడిశెట్టి రాజా ప్రశ్న

బాగున్న రోడ్లను గోతులు తవ్వి ఫొటోలు తీసి నాటకాలాడుతున్నారు

2023 మార్చి నాటికి రోడ్లన్నీ బాగుచేద్దామని సీఎం స్పష్టం చెప్పారు

రహదారుల కోసం రూ.2300 కోట్లు ఖర్చుచేసిన ఏకైక సీఎం వైయస్‌ జగన్‌

రోడ్ల కోసం మరో రూ.1500 కోట్లు వెచ్చిస్తానని సీఎం చెప్పారు

వర్షాలు తగ్గిన వెంటనే రహదారుల నిర్మాణం, మరమ్మతులు చేపడతాం

కాకినాడ: రాష్ట్రంలో జరుగుతున్న అభివృద్ధి, వేస్తున్న రోడ్లు చంద్రబాబు, ఎల్లో మీడియా, దత్తపుత్రుడికి కనిపించడం లేదా..? గుడ్‌ మార్నింగ్‌ సీఎంసార్‌ అనే హ్యాష్‌ట్యాగ్‌ పెట్టి బాగున్న రోడ్లను తవ్వి నాటకాలు ఆడుతున్నారని ఆర్‌ అండ్‌ బీ శాఖ మంత్రి దాడిశెట్టి రాజా ధ్వజమెత్తారు. రోడ్లను బాగు చేయడం కోసం మా ప్రభుత్వం చిత్తశుద్ధి పనిచేస్తోందని మంత్రి దాడిశెట్టి రాజా అన్నారు. రాష్ట్రంలోని రోడ్లపై ప్రతిపక్షాలు చేస్తున్న తప్పుడు ప్రచారాన్ని మంత్రి ఖండించారు. కాకినాడలో మంత్రి దాడిశెట్టి రాజా విలేకరుల సమావేశం నిర్వహించారు.

ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. 
‘‘సీఎం వైయస్‌ జగన్‌ అధికారం చేపట్టిన తరువాత బ్యాంక్‌ ఆఫ్‌ బరోడా నుంచి సుమారు రూ. 2300 కోట్ల నిధులు తీసుకొచ్చి రాష్ట్రంలోని రోడ్లను బాగుచేయడం జరిగింది. రోడ్లు మరమ్మతులు అనేది నిరంతర ప్రక్రియ. రెండు రోజులు ఎడతెరిపిలేని వర్షం పడితే రోడ్లన్నీ పాడవుతాయి. కానీ, ఈ ప్రభుత్వం చిత్తశుద్ధితో  రాష్ట్రంలోని రోడ్లను బాగు చేయడానికి అహర్నిశలు పనిచేస్తోంది. ఎల్లోమీడియా, చంద్రబాబు, దత్తపుత్రుడుకు రాష్ట్ర ప్రభుత్వం నాడు–నేడుతో వేసిన రోడ్లు కనిపించడం లేదు. ప్రతీ జిల్లా కలెక్టరేట్లలో నాడు–నేడు రోడ్ల ఫొటలను డిస్‌ప్లే చేశాం. 

వెయ్యని రోడ్లను భూతద్దంలో పెట్టి చూపిస్తారు. గుడ్‌ మార్నింగ్‌ సీఎం సార్‌ అనే హ్యాష్‌ట్యాగ్‌ పెట్టి బాగున్న రోడ్లకు గోతులు తవ్వి నాటకాలు ఆడుతున్నారు. ‘నాకు ఓట్లు వేయనివారు నేను వేసిన రోడ్ల మీద మీరు నడవొద్దు’ అని ప్రజలను హెచ్చరించిన వ్యక్తి చంద్రబాబు. ఎలాగూ రోడ్లు వేయలేదు కాబట్టి.. బాబు వేసిన రోడ్ల మీద ప్రజలు నడవలేదు కాబట్టి ఓట్లు వేయడం మానేశారు. 

వర్షాలు తగ్గిన వెంటనే 2023 మార్చి నాటికి రాష్ట్రంలోని రోడ్లన్నీ కంప్లీట్‌ చేస్తామని సీఎం వైయస్‌ జగన్‌ చెప్పారు. వర్షాలు పడుతున్నప్పుడు రోడ్లు వేయడం ఎలాగూ కుదరదు.. వర్షాలు తగ్గిన వెంటనే పనులు ప్రారంభించి.. 2023 మార్చి నాటికి రోడ్లు కంప్లీట్‌ చేస్తామని స్పష్టంగా ముఖ్యమంత్రి చెప్పారు. అందుకు తగిన విధంగా అందరం పాటుపడతాం. రోడ్ల కోసం మరో రూ.1500 కోట్లు వెచ్చిస్తానని సీఎం చెప్పారు. గతంలో ఉమ్మడి రాష్ట్ర చరిత్రలో కూడా ఏ నాయకుడు కూడా రూ.2300 కోట్లు రోడ్ల కోసం వెచ్చించలేదు. 

వైయస్‌ఆర్‌ సీపీ ప్రభుత్వం వచ్చిన తరువాత వేసిన రోడ్లు చంద్రబాబు, ఎల్లో మీడియా, దత్తపుత్రుడికి కనిపించడం లేదా..? ఎందుకు వాటి గురించి మాట్లాడరు. వర్షం వల్ల రోడ్లు పాడైతే దాన్ని పెద్దగా ఫోకస్‌ చేసి చూపించడం, నోటికి వచ్చినట్టుగా రాతలు రాస్తున్నారు. గతంలో అమరావతిలో సింగపూర్, చైనా, జపాన్, కొరియా టెక్నాలజీతో చంద్రబాబు వేసిన సీడ్‌ యాక్సెస్‌ రోడ్లు ఏ విధంగా ఉన్నాయో ప్రజలంతా చూశారు. 

రాష్ట్ర ప్రజలు పన్నుల రూపంలో కట్టిన లక్ష కోట్ల సంపద దోచుకోవడానికి అమరావతి పేరుతో చంద్రబాబు పెద్ద ప్రణాళిక వేశాడు. ఆ ప్రణాళికలో భాగమే అమరావతి పాదయాత్ర. ఎవరి కోసం గర్జన అని పవన్‌ మాట్లాడుతున్నాడు. ఈ రాష్ట్రంలో మూడు ప్రాంతాల ప్రజలకు వీకేంద్రీకరణ కావాలి.. రాష్ట్రమంతా అభివృద్ధి కావాలని కోరుకుంటూ వైజాగ్‌లో 15వ తేదీన గర్జన నిర్వహిస్తున్నారు. ప్రజలంతా స్వచ్ఛందంగా ఈ కార్యక్రమాన్ని రూపొందించారు. దానికి వైయస్‌ఆర్‌ సీపీ సంపూర్ణ మద్దతు తెలిపింది. 

పవన్‌ కల్యాణ్‌కు ఎంత అహంభావం ఉంటే ఎవరి కోసం ఈ గర్జన అని మాట్లాడతాడు. చంద్రబాబు బినామీలు 150 మంది, దత్తపుత్రుడికి అమరావతి ఇష్టమైనంత మాత్రానా.. రాష్ట్ర ప్రజలకు వారి మనసులో ఉన్న భావన తెలియజేసే హక్కు లేదా..? అని పవన్‌ను సూటిగా ప్రశ్నిస్తున్నాను. చంద్రబాబు బినామీలు 150 మంది, ప్యాకేజీ తీసుకునే నువ్వు బాగుంటే సరిపోతుందా..? ఈ రాష్ట్ర ప్రజలను తరాలుగా బానిసలుగా చేసి అమరావతిని పెద్ద వ్యాపార సంస్థ చేయాలని కోరుకుంటున్నారు కాబట్టి.. ఈ రకమైన అహంభావమైన మాటలు మాట్లాడుతున్నారా..?’’ అని మంత్రి దాడిశెట్టి రాజా ప్రశ్నించారు.  
 

తాజా వీడియోలు

తాజా ఫోటోలు

Back to Top