చిత్తుశుద్ధితో మ‌ద్య నియంత్ర‌ణ చేస్తున్నాం

- మంత్రి బుగ్గ‌న రాజేంద్ర‌నాథ్‌రెడ్డి

ప్ర‌భుత్వం చేసే మంచి ప‌నుల‌ను మెచ్చుకునే ఉదార మ‌న‌స్త‌త్వం స్వ‌భావం ప్ర‌తిప‌క్షానికి లేదు. విడ‌త‌ల‌వారీగా మ‌ద్య నిషేధం చేస్తామ‌ని చెప్పాము.. అలాగే చేస్తూనే ఉన్నాం. దానికి అనుగుణంగా చ‌ర్య‌లు తీసుకున్నాం. 43వేల బెల్టు షాపులు తొల‌గించాం, 40శాతం మ‌ద్యం షాపులు మూసేశాం, 20 శాతం బార్లు మూసేశాం. మ‌ద్యం షాపులు, బార్ల టైమింగ్స్ త‌గ్గించాం. ఇదంతా ఒక ప‌ద్ధ‌తి ప్ర‌కారం జ‌రుగుతోంది. ఇదంతా ప్ర‌తిప‌క్షం క‌ళ్ల‌కు క‌న‌ప‌డటం లేదు. ఇదంతా మ‌ద్యం షాపుల‌ను ప్ర‌భుత్వ‌మే స్వ‌యంగా చేప‌ట్టడం వ‌ల్లే జ‌రిగింది. ఇంట‌ర్ స్టేట్ స్మ‌గ్లింగ్‌కి అవ‌కాశం ఉంటుంద‌న్న కార‌ణంతో రాష్ట్ర బోర్డ‌ర్ ఏరియాల్లో కొంచెం ఆచితూచి వ్య‌వ‌హ‌రిస్తున్నాం. 12 వేల పైచిలుకు నిరుద్యోగులు ఉద్యోగం సంపాదించారు. ప్ర‌భుత్వ ఆదాయం ప‌డిపోతుందనే బాధ కంటే.. పేద‌వాడి ఆరోగ్యం మీద‌నే మా ప్ర‌భుత్వానికి శ్ర‌ద్ధ ఉంది. గ‌తంలో టీడీపీ ప్ర‌భుత్వం ఒక‌ప‌క్క మ‌ద్య నిషేధం అంటూనే వ‌రుణ వాహిణి పేరిట సారా ప్యాకెట్లు పంపిణీ చేశారు. అలాంటి టీడీపీకి మా ప్ర‌భుత్వం అమ‌లు చేస్తున్న మ‌ద్య నియంత్ర‌ణ విధానాన్ని విమ‌ర్శించే అర్హ‌త లేదు. మ‌ద్యం అమ్మ‌కాలు చూస్తే గ‌తేడాదితో పోల్చితే ఈ ఏడాది దాదాపు స‌గానికి స‌గం త‌గ్గిపోయింది. ఇదే మా చిత్త‌శుద్ధికి నిద‌ర్శ‌నం. 
 

తాజా ఫోటోలు

Back to Top