జ్యుడిషియల్‌ క్యాపిటల్‌ నిర్ణయం సాహసోపేతం

అన్ని ప్రాంతాల అభివృద్ధి కోసమే మూడు రాజధానులు

ప్రతి విద్యార్థి ఇంగ్లీష్‌లో చదువుకోవాలనేది సీఎం వైయస్‌ జగన్‌  తపన

మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్‌రెడ్డి

కర్నూలు: కర్నూలును జ్యుడిషియల్‌ రాజధానిగా సీఎం వైయస్‌ జగన్‌ మోహన్‌ రెడ్డి తీసుకున్న నిర్ణయం సాహసోపేతమని ఆర్థిక మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్‌రెడ్డి పేర్కొన్నారు.  వికేంద్రీకరణకు నిర్ణయం తీసుకున్న సీఎం వైయస్‌ జగన్‌కు కృతజ్ఞతలు తెలిపారు. కర్నూలులో ఏర్పాటు చేసిన బహిరంగ సభలో బుగ్గన మాట్లాడుతూ.. 1856వ సంవత్సరంలో మహారాష్ట్ర తీరంలోని రత్నగిరి గ్రామంలో జన్మనిచ్చి..దాదాపు తన విద్యాభ్యాసం సొంత కష్టంతో చదువుకొని స్వాతంత్ర్య పోరాటంలో ముఖ్య పాత్ర పోషించిన వ్యక్తి..అప్పటికే ఇంగ్లీష్‌ అనే భాషను నేర్చుకుంటేనే దేశానికి ప్రగతి ఉండదని ఆ రోజుల్లో పూనాలో దీ ఇంగ్లీష్‌ స్కూల్‌ను స్థాపించారు. ఆ సొసైటీలోనే మన ప్రధాని పీవీ నరసింహారావు చదువుకున్నారు. ఆ వ్యక్తి ఎవరంటే..బాలగంగాధరతిలక్‌. 150 సంవత్సరాల క్రితమే ఇంగ్లీష్‌కు ఎంత ప్రాధాన్యత ఉందని చెప్పిన వ్యక్తి. స్వరాజ్యమే నా జన్మహక్కు అంటూ స్వాతంత్ర్య పోరాటాన్ని ముందుకు తీసుకెళ్లారు. రాష్ట్రం అంతా కూడా సమానంగా, సమతుల్యంతో ఎలాంటి బేధం లేకుండ అందరిని ముందుకు తీసుకెళ్లాలనే భావంతో ఈ రోజు మూడు రాజధానులు ఏర్పాటు చేసిన సీఎం వైయస్‌ జగన్‌కు ఎన్ని రకాలుగా కృతజ్ఞతలు చెప్పినా తక్కువే. 90 సంవత్సరాల క్రితమే ఆంధ్రభాష,  తెలుగు భాష మాట్లాడే వ్యక్తులకు సమతుల్యం ఉండాలని శ్రీబాగ్‌ ఒప్పందంలో పెద్దలు భావించారు. దాదాపు 90 ఏళ్ల తరువాత ఆ ఆలోచనతో, చిత్తశుద్ధితో కర్నూలును జ్యుడిషియల్‌ రాజధానిగా చేసిన సీఎం వైయస్‌ జగన్‌కు కృతజ్ఞతలు. మనం ఒడిపోవడం మన వద్ద శక్తి లేక కాదు..పట్టుదల లేకనే. అన్ని వృత్తుల కంటే గొప్పది న్యాయ వృత్తి. న్యాయవాదుల కుటుంబంలో వచ్చిన గొప్ప వ్యక్తుల్లో మహాత్మాగాంధీ ఒక్కరు. సత్యమన్నది అమలైనప్పుడే న్యాయం జరుగుతుంది. బాలగంగాధర్‌ తిలక్‌ ఆలోచనతో సీఎం వైయస్‌ జగన్‌ ఇంగ్లీష్‌ మీడియాన్ని అమలు చేస్తున్నారు. పిల్లలకు కంటి చూపు ఇచ్చేందుకు వైయస్‌ఆర్‌ కంటి వెలుగు పథకాన్ని అమలు చేశారు. అమ్మ ఒడి ద్వారా తల్లుల ఖాతాల్లో రూ.15 వేలు అందజేస్తున్నారు. రైతులకు బీమాను అలవాటు చేస్తున్నారు. సీఎం వైయస్‌ జగన్‌ సుక్ష్మమైన ఆలోచన చేస్తున్నారు. విద్యార్థుల మధ్యాహ్న భోజనం మెనూను తయారు చేశారు. పోషకాహారం అందిస్తున్నారు. లోకమాన్య బాలగంగాధర తిలక్‌ అందరికి ఆమోదయోగ్యమైన వ్యక్తి అని అర్థం. రాష్ట్రంలోని అన్ని జిల్లాలకు ఆమోదయోగ్యమైన పరిపాలన అందిస్తున్నారు. రాయలసీమ, కర్నూలు అంటే సీఎంకు ఎంతో ప్రేమ. అన్ని జిల్లాల కంటే కర్నూలు జిల్లా ఎమ్మెల్యేలు నవ్వుతు ఉంటారని, వీరికి జాలీ బ్రదర్స్‌ అంటూ సీఎం పేరు పెట్టారు. ఇక్కడి నుంచి చక్కటి న్యాయ పరిపాలన ఇస్తూ ముందుకు సాగాలి. మన నాయకుడికి గొప్ప ఘన స్వాగతం ఇచ్చినందుకు అందరికి కృతజ్ఞతలు.

తాజా ఫోటోలు

Back to Top