ఆక్సిజన్‌ సరఫరాను పునరుద్ధరించాం

మున్సిపల్‌ శాఖ మంత్రి బొత్స సత్యనారాయణ

విజయనగరం: జిల్లాలోని మహారాజా ఆస్పత్రిలో ఆక్సిజన్‌ సరఫరా పునరుద్ధరించామని, సాంకేతిక లోపం వల్లే ఆక్సిజన్‌ సరఫరాలో అంతరాయం ఏర్పడిందని మున్సిపల్‌ శాఖ మంత్రి బొత్స సత్యనారాయణ అన్నారు. ఈ మేరకు మంత్రి బొత్స మాట్లాడుతూ.. విశాఖ స్టీల్‌ ఫ్యాక్టరీలో రెండు ప్లాంట్‌లు నిర్వీర్యంగా ఉన్నాయి. వాటిని పునరుద్ధరించేందుకు ముఖ్యమంత్రి వైయస్‌ జగన్‌ కేంద్రంతో సంప్రదింపులు జరుపుతున్నారన్నారు. ఒడిశా, కర్ణాటక నుంచి ఆక్సిజన్‌ రప్పిస్తున్నామని చెప్పారు. అందరికీ కోవిడ్‌ వ్యాక్సిన్‌ ఇచ్చేలా చర్యలు చేపడుతున్నట్లు మంత్రి వివరించారు. 
 

Back to Top