అభివృద్ధికి ఆటంకం కలిగించొద్దు

మండలి రద్దు ఆలస్యం అవుతుందేమో ..కానీ నిర్ణయం మారదు

అందుకే ఆయన్ను యూటర్న్‌ బాబు అంటారు.

నిబంధనలు పాటించమనే మండలి చైర్మన్‌ను కోరాం

చంద్రబాబు ఏమి చెబితే అది జరగాలని రామోజీరావు కోరిక 

ఈనాడు వాళ్లు దైవ సంభూతులు అనుకుంటే పొరపాటు

మంత్రి బొత్స సత్యనారాయణ

తాడేపల్లి: అభివృద్ధికి ఆటంకం కలిగించవద్దని మంత్రి బొత్స సత్యనారాయణ ప్రతిపక్ష నేత చంద్రబాబుకు సూచించారు. మండలి గౌరవాన్ని కాపాడే ప్రయత్నం చేశామని తెలిపారు. నిబంధనలు పాటించమనే మండలి చైర్మన్‌ను కోరామని చెప్పారు.  ఈ రాష్ట్రం అభివృద్ధి కాకూడదని కొంత మంది భావిస్తున్నారు. ఈనాడు రామోజీ రావు దైవ సంభూతులా? వారు ఏది ఊహిస్తే అది జరగాలా అని ప్రశ్నించారు.  మండలి రద్దు ఆలస్యం అవుతుందేమో ..కానీ నిర్ణయం మారదని స్పష్టం చేశారు.
తాడేపల్లిలోని పార్టీ కేంద్ర కార్యాలయంలో మంత్రి బొత్స సత్యనారాయణ మాట్లాడుతూ..విశాఖలో లక్షా 75 వేల మందికి ఇళ్ల స్థలాలు ఇచ్చి ఇల్లు కట్టిస్తామని చెప్పారు. అన్ని వర్గాలు, ప్రాంతాల శ్రేయస్సు కోసమే వికేంద్రీకరణ. తుఫాను ముప్పు లేకుండా ఏ నగరమైనా ఉంటుందా అని ఆయన ప్రశ్నించారు. చెన్నై, ముంబాయిలకు కూడా తుపాను ముపు లేదా? కమిటీ నివేదికలు పరిశీలించి అన్ని విధాలా ఆలోచించే నిర్ణయం తీసుకున్నాం. ఎల్లో మీడియాతో చంద్రబాబు దుష్ప్రచారం చేస్తున్నారు. తనకు అనుగుణంగానే చంద్రబాబు మాట్లాడుతున్నారు. రోజుకొక రకంగా మాట్లాడటం చంద్రబాబుకు అలవాటు. శివరామకృష్ణన్‌ కమిటీని చంద్రబాబు పరిగణలోకి తీసుకోలేదు. బోస్టన్‌, జీఎన్‌ రావు కమిటీలను క్షుణంగా పరిశీలించాం. హైపవర్‌ కమిటీలో కూడా  ఈ కమిటీల నివేదికలను పరిశీలించాం. చంద్రబాబులాగా వ్యాపారుల సలహాలు తీసుకోలేదు. రాజ్యాంగ పరిరక్షణకు నిబంధనల మేరకు మండలి చైర్మన్‌పై మేం   ఒత్తిడి తీసుకురావచ్చు. చంద్రబాబులాగా చైర్మన్‌ను ప్రభావితం చేయలేదు. రూల్స్‌కు విరుద్ధంగా వెళ్లవద్దని మండలి చైర్మన్‌ను కోరాం.  చంద్రబాబు ప్రతి విషయంలోనూ యూటర్న్‌ తీసుకుంటారు. అందుకే ఆయన్ను యూటర్న్‌ బాబు అంటారు. రాజధాని, మండలికి సంబంధం ఏమిటీ?.మండలిలో పెట్టిన బిల్లుకు ఆమోదం తెలపాలి. లేదా వెనక్కి పంపించాలి. మండలి రద్దు కొంత జాప్యం జరుగవచ్చే కానీ..మరేమీ లేదు. ఈనాడు ఏది ఊహించుకుంటే అది నిజమవుతుందా?. మండలి రద్దు ఆలస్యం కావాలని మీ మనసులో కోరిక. ఈ రాష్ట్రంలో ఈనాడు ప్రమేయం లేకుండా చీమ కూడా కదలకూడదని మీరు ఊహిస్తారు. చంద్రబాబు ఏమి చెబితే అది జరగాలని రామోజీరావు కోరిక. దేవుడు ముందే నిర్ణయాలు తీసుకొని ఉంటాయి. దేవుడి ఆలోచన, దైవ కృప వల్ల జరుగుతుంటాయి. మీరు ఏది ఊహిస్తే అది జరగాలనుకోవడం పొరపాటు. మీరు దైవ సంభూతులు అనుకుంటే పొరపాటు. చంద్రబాబుకు పోరాటం చేసేందుకు ఏమి లేక రాజధాని అంశాన్ని పట్టుకున్నారు. ముందు ఇసుక అన్నారు..ఆ తరువాత ఇంగ్లీష్‌ మీడియం అన్నారు..ఇవి పరిష్కారం కావడంతో అమరావతి అంటూ కృత్రిమ ఉద్యమం సృష్టించారు.  అమ్మ ఒడి విషయంలో కూడా అన్యాయంగా మాట్లాడుతున్నారు. సీఎం వైయస్‌ జగన్‌ ప్రతి తల్లికి రూ.15 వేలు అకౌంట్లో డబ్బులు జమా చేశారు. ఆ పథకం ప్రారంభం రోజే సీఎం వైయస్‌ జగన్‌ తల్లులకు ఒక విషయం చెప్పారు. స్కూల్‌ అభివృద్ధికి మీకిచ్చిన రూ.15 వేలలో ఒక వెయ్యి ఇవ్వమని కోరారు. దీనిపై పిచ్చి రాతలు రాస్తున్నారు. నాడు-నేడు కార్యక్రమం ద్వారా స్కూళ్ల రూపురేఖలు మార్పు చేయబోతున్నాం. ఇందులో తల్లిదండ్రుల భాగస్వామ్యం ఉంటే బాగుంటుందని సీఎం ఈ రకంగా విజ్ఞప్తి చేశారు. దీనిపై లేనిపోని ఆరోపణలు సరికాదు.
 

Back to Top