సరైన సమయంలో ఇన్‌సైడర్‌ ట్రేడింగ్‌ వివరాలు బయటపెడతాం

చంద్రబాబు ఇంటిని ముట్టడిస్తానన్న పవన్‌ ఏం చేశారు?

బీజేపీ, జనసేన నేతల మాటలు ప్రజలు గమనిస్తున్నారు

మంత్రి బొత్స సత్యనారాయణ

అమరావతి:  ఇన్‌సైడర్‌ ట్రేడింగ్‌ వివరాలు సరైన సమయంలో బయటపెడతామని మంత్రి బొత్స సత్యనారాయణ పేర్కొన్నారు. టీడీపీ మాజీ నేత రాజధానిలో భూములు లేవంటున్నారని, భూములపై సవాలు చేస్తే తాను చూపిస్తానని పేర్కొన్నారు. అమరావతి రైతులు కౌలు అందలేదని ధర్నా చేస్తున్నారని త్వరలోనే కౌలు రైతులకు కౌలు చెల్లించేందుకు ప్రభుత్వం చర్యలు తీసుకుంటుందన్నారు. పవన్‌ కళ్యాణ్‌ గతంలో చాలా చెప్పారు, బాబు ఇంటిని ముట్టడిస్తామన్నారని గుర్తు చేశారు. రాజధాని భూములపై కూడా పోరాడతామని చెప్పారని..ఏం చేశారని ప్రశ్నించారు. గతంతో అవినీతి, అక్రమాలు జరిగాయని బీజేపీ నేతలే చెప్పారని తెలిపారు. బీజేపీ, జనసేన నేతలు గతంలో ఏం మాట్లాడారో ..ఇప్పుడు ఏం మాట్లాడుతున్నారో ప్రజలు గమనిస్తున్నారని వ్యాఖ్యానించారు.

Back to Top