తెలుగుదేశం పార్టీ దాదాపు చచ్చిపోయింది

న‌ర‌స‌రావుపేట బ‌హిరంగ స‌భ‌లో మంత్రి ఆదిమూల‌పు సురేష్‌

న‌ర‌స‌రావుపేట‌: గ‌త ప్ర‌భుత్వాల‌న్నీ బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనారిటీలను కేవలం ఓటు బ్యాంక్‌గానే చూశాయ‌ని, కానీ సీఎం వైయ‌స్ జ‌గ‌న్ బీఆర్‌ అంబేడ్కర్‌ కలలు కన్న సమసమాజం సాకారం చేస్తున్నారని మున్సిప‌ల్ శాఖ మంత్రి ఆదిమూల‌పు సురేష్ అన్నారు. జన హృదయనేత.. అభివృద్ది, సంక్షేమం అనే రెండు చక్రాలతో రాష్ట్ర రథాన్ని ముందుకు పరుగెత్తిస్తున్నారన్నారు. గతంలో ఏనాడు విద్య, వైద్య రంగాలను అభివృద్ది చేయాలని, బడుగు, బలహీనవర్గాల బ‌తుకులు మార్చాలని ఆలోచన చేయలేదని, అవన్నీ సీఎం వైయ‌స్ జ‌గ‌న్ చేసి చూపిస్తున్నారని, రాజ్యాంగం కల్పించిన హక్కులు దక్కేలా చేస్తున్నారన్నారు. న‌ర‌స‌రావుపేట బ‌హిరంగ స‌భ‌లో మంత్రి ఆదిమూల‌పు సురేష్ మాట్లాడారు. 

``చంద్రబాబు ఏనాడూ మనల్ని కేవలం ఓటు బ్యాంక్‌గానే చూశారు తప్ప, ఏనాడూ మన బాగోగుల గురించి పట్టించుకోలేదు. చివరకు మైనారిటీ, గిరిజనులకు మంత్రివర్గంలో చోటు కూడా ఇవ్వలేదు. ఎస్సీల్లో మాల, మాదిగల మధ్య చిచ్చు పెట్టి రాజకీయ ప్రయోజనం పొందాలని చూశారు చంద్రబాబు. కానీ సీఎం వైయస్‌ జగన్‌ బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనారిటీలకు అత్యధిక ప్రాధాన్యం ఇస్తూ, వారిని చేయి పట్టి నడిపిస్తూ, పరిపాలనలో భాగస్వామ్యులను చేస్తూ, మంత్రివర్గంలో 17 పదువలు, అంటే 70 శాతం ఇచ్చారు. అందులో కూడా కీలకమైన హోం శాఖను కూడా దళితులకే ఇచ్చారు.

సీఎం వైయ‌స్‌ జగన్‌ భావజాలాన్ని, ఆలోచన విధానం వల్లనే బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనార్టీల‌కు అన్ని పదవులు దక్కాయి. వాటిని వివరించేందుకే ఈ బస్సు యాత్ర చేప‌ట్టాం. మా కోరిక మేరకు ఒక జిల్లాకు అంబేడ్కర్‌ పేరు పెడితే, చంద్రబాబు కులాల మధ్య చిచ్చు పెట్టి, రాష్ట్రంలో అలజడులకు కుట్ర చేస్తున్నాడు. నేను చంద్రబాబును ఒకటే అడుగుతున్నాను. జిల్లాకు అంబేడ్కర్‌ పేరు పెట్టొద్దు అంటున్నారా? ఆ ధైర్యం ఉంటే చెప్పండి. అంతే తప్ప, కడుపు చుట్టూ కత్తులు పెట్టుకుని కౌగిలించుకోవద్దు. ఇవాళ సమ సమాజ స్థాపన, వాస్తవ సామాజిక న్యాయం జరుగుతోంది. సీఎం వైయస్‌ జగన్‌ ఇంగ్లిష్‌ మీడియం ప్రవేశపెడుతున్నారు. ఆ భాష మీద పట్టు సాధిస్తే భవిష్యత్తు ఉంటుందని, అది పులి పాల వంటిదని ఆనాడు అంబేడ్కర్‌ చెప్పారు. దాన్ని సాకారం చేస్తున్నారు. కాబట్టి అది మనందరి అవసరం కాబట్టి, అందరం సీఎం వైయ‌స్‌ జగన్‌కి అండగా ఉండాలి. తెలుగుదేశం పార్టీ దాదాపు చచ్చిపోయింది. ఆ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడే చెబుతున్నాడు. పార్టీ లేదు. బొక్క లేదని. చివరకు చంద్రబాబుకు కూడా నమ్మకం పోయింది కాబట్టే, దత్తపుత్రుడిని తీసుకొస్తున్నాడు. సీఎం వైయ‌స్‌ జగన్  ఇవాళ ఒక సామాజికవేత్తగా, సంఘ సంస్కర్తగా పని చేస్తున్నారు. మంత్రివర్గంలోనే కాకుండా, అన్ని పదవుల్లోనూ మాకు ఎంతో ప్రాధాన్యం ఇచ్చారు.  అందుకే ఏం చేసినా సరే, మేము సీఎం రుణం తీర్చుకోలేం.``

Back to Top