ముంపు బాధితుల‌కు అండ‌గా ఉంటాం

నివ‌ర్ తుపాన్ ప్ర‌భావిత ప్రాంతాల్లో మంత్రుల పర్యటన
 

నెల్లూరు: నివర్‌ తుపాన్‌ ప్రభావంతో న‌ష్ట‌పోయిన బాధిత కుటుంబాల‌కు ప్ర‌భుత్వం అన్ని విధాల అండ‌గా ఉంటుంద‌ని మంత్రులు అనిల్‌కుమార్ యాద‌వ్‌, మేక‌పాటి గౌతంరెడ్డి హామీ ఇచ్చారు. నివ‌ర్ తుపాన్ కార‌ణంగా నెల్లూరు  జిల్లాలోని పలు ప్రాంతాల్లో భారీ వర్షం కురిసింది. పెన్నా నది ముంపు ప్రాంతమైన నెల్లూరు, భగత్‌సింగ్ కాలనీతోపాటు పలు లోతట్టు కాలనీలు జలమయం అయ్యాయి. ఆదివారం మంత్రులు మేకపాటి గౌతమ్‌రెడ్డి, అనిల్ కుమార్ యాదవ్ ముంపు ప్రాంతాల్లో పర్యటించారు. ప్రజల వద్దకు వెళ్లి ప్రభుత్వం ద్వారా తాము ప్రజలకు అండగా ఉంటామని, భరోసా కల్పిస్తామని హామీ ఇచ్చారు. అనంతరం ఇల్లు కూలిపోయిన ప్రాంతాన్ని పరిశీలించి, ప్రభుత్వం ద్వారా రావాల్సిన సహాయ సహకారాలు వీలైనంత త్వరగా అందిస్తామని తెలిపారు.

మరో తుఫాన్ వస్తుందన్న వాతావారణ శాఖ సమాచారం నేపథ్యంలో ముంపుకు గురైన ప్రాంతాన్ని ప్రత్యేక దృష్టితో వారికి కావాల్సిన సౌకర్యాలు ముందస్తుగా కల్పించాలని అధికారులను ఆదేశించారు. ప్రజలకు ఏ కష్టం రాకుండా చూడాలని చూచించారు. ఈ విషయం ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి దృష్టికి తీసుకెళ్లి పెన్నా నది పరివాహక ప్రాంతాన్ని రాబోయే కాలంలో వరదల వల్ల ఇబ్బందులు లేకుండా చూస్తామని తెలిపారు. బ్యారేజీ వద్ద పెన్నానది అనుకోని ఉన్న కాలనీలకు ఇబ్బంది రాకుండా నదికి ఇరువైపులా బండ్స్ నిర్మిస్తామని మంత్రులు పేర్కొన్నారు.

తాజా వీడియోలు

తాజా ఫోటోలు

Back to Top