తాడేపల్లి: ఈనాడు అధినేత రామోజీ రావు చట్ట వ్యతిరేక కార్యక్రమాలకు పాల్పడుతున్నారని మంత్రి అంబటి రాంబాబు మండిపడ్డారు. రామోజీ ఆరాటమే తప్ప చంద్రబాబు రాజకీయంగా బతికే పరిస్థితి లేదన్నారు. పాత ఫోటోలతో పట్టాభి కథనాన్ని వండి వార్చారని తప్పుపట్టారు. ప్రభుత్వంపై బురద జల్లడమే రామోజీ లక్ష్యమన్నారు. రామోజీ వైట్ కాలర్ క్రిమినల్, ఆర్థిక నేరాల్లో అగ్రగణ్యుడని విమర్శించారు. చంద్రబాబు మాటలు ప్రజలు నమ్మే పరిస్థితిలో లేరని, అందరూ కలిసొచ్చినా వైయస్‌ఆర్‌సీపీని ఏమీ చేయలేరన్నారు. కన్నా లక్ష్మీ నారాయణ నైతిక విలువలు లేని వ్యక్తి అన్నారు. చంద్రబాబు చేతిలో కన్నా రాజకీయ భవిష్యత్ శూన్యమన్నారు. రేపు సాయంత్రం లోగా రామోజీ బహిరంగ క్షమాపణ చెప్పాలని, లేకుంటే రామోజీపై పరువు నష్టం దావా వేస్తామని మంత్రి అంబటి రాంబాబు హెచ్చరించారు. గురువారం తాడేపల్లిలోని వైయస్‌ఆర్‌సీపీ కేంద్ర కార్యాలయంలో మంత్రి మీడియాతో మాట్లాడారు.
ఈనాడుది నీచమైన జర్నలిజం..
కథ ముగిసినటువంటి రాజకీయ పార్టీని ఏదోవిధంగా పునరుజ్జీవనానికి తేవాలనే ప్రయత్నంలో ‘ఈనాడు’పత్రిక పడుతున్న పాట్లు చూస్తుంటే.. నిజమైన జర్నలిస్టులు, జర్నలిజం విలువలు తెలిసిన వారు బాధపడుతున్నారు. ఇదేం జర్నలిజం అంటూ నవ్వుకుంటున్నారు.
ఈనాడు పత్రికలో నిన్న మొదటి పేజీలో బ్యానర్ వార్తను ప్రజలంతా చూశారు. అది ఎంత నీచమైన జర్నలిజమో ప్రజలు గమనిస్తున్నారు.
పొలిటికల్ పోర్న్‌స్టార్ పట్టాభి
పట్టాభి, లోకేశ్, అయ్యన్నపాత్రుడు లాంటి తెలుగుదేశం నాయకులు తమనోటికి ఏది వస్తే అది మాట్లాడతాడు. పచ్చిబూతులు సైతం మాట్లాడుతున్నాడు. అత్యంత ప్రజాదరణ కలిగిన రాష్ట్ర ముఖ్యమంత్రిని పట్టుకుని తప్పుడు మాటలు మాట్లాడతారు. అలా మాట్లాడి అతను ఆనందిస్తారు. మాట్లాడించిన చంద్రబాబు నాయుడు ఆ మాటలకు మరీ ఆనందపడతాడు. అది రాసి మరింతగా ఆనందిస్తాడు ఈనాడు రామోజీరావు. ఒకవిధంగా చెప్పాలంటే, పొలిటికల్ పోర్న్‌స్టార్స్ గా వీళ్లని గుర్తించాలి.
కుట్ర ప్రణాళికతో ‘ఈనాడు’ దుష్ప్రచారం
పచ్చిబూతులు తప్ప ఏమీ మాట్లాడని పట్టాభి ఇంటిమీదికి ఫిబ్రవరి మాసం 2021లో గుర్తుతెలియని వ్యక్తులు దాడి చేశారని.. ఆ సమయంలో పట్టాభికి గాయాలయ్యాయని ఫోటోలు తీసి..ఇదే ఈనాడు, ఆంధ్రజ్యోతిలో ప్రచురించారు. అది ముగిసిన అధ్యాయం. అయితే, మొన్న గన్నవరంలో టీడీపీ నాయకులు గందరగోళం సృష్టించి, పోలీసులను కొట్టి, పోలీసుల మీద దౌర్జన్యం చేసినటువంటి సంఘటనలో పట్టాభి, ఇతరులపై కేసులు పెట్టి కోర్టులో ప్రవేశపెట్టారు. కేసులో వారి ప్రమేయం ఉందని భావించిన న్యాయస్థానం రిమాండ్‌కు అదేశిస్తే రాజమండ్రి సెంట్రల్ జైలుకు పంపారు. దీన్ని నీరుగార్చడానికి .. ఏదో వైఎస్‌ఆర్‌సీపీ ప్రభుత్వం అధికార దుర్వినియోగానికి పాల్పడిందని చెప్పే ప్రయత్నంలో భాగంగా ఈ పోర్న్‌స్టార్ పట్టాభిని పోలీసులు చితక్కొటేశారని ఈనాడు ప్రచారం చేసే కార్యక్రమానికి పూనుకుంది. పట్టాభిని కోర్టులో ప్రవేశపెట్టగానే.. తనను పోలీసులు కొట్టారని.. మెడికల్ టెస్టుల కోసం ఆస్పత్రిలో చేరవచ్చని ప్రణాళిక ప్రకారం.. కుట్ర ప్రకారం ‘పోలీసులు పట్టాభిని చితకొట్టేశారు’ అని టీడీపీ ఎత్తుగడలేసింది. సరే, టీడీపీ అంటే వైఎస్‌ఆర్‌సీపీకి అపోజిట్ పార్టీ కాబట్టి.. అనేక కుట్రలతో ప్రజల మద్ధతు పొందాలని పాకులాడొచ్చు. కానీ,ఈ ఈనాడు రామోజీరావుకు ఏం పోయేకాలం వచ్చిందని.. మా ప్రభుత్వంపై విషప్రచారానికి ఒడిగట్టింది...?
రామోజీ క్షమాపణ చెప్పకపోతే.. పరువునష్టం దావా వేస్తాం..
పవిత్రమైన జర్నలిజంలో ఉన్నటువంటి రామోజీరావు పనిగట్టుకుని మరీ.. 2021 ఫిబ్రవరిలో పట్టాభి అనే వ్యక్తికి గుర్తుతెలియని దుండగుల దాడిలో చోటుచేసుకున్న గాయాల్ని తీసుకొచ్చి.. ఇప్పుడే తాజాగా పోలీసులు కొట్టారంటూ.. ఇది ప్రభుత్వ దుశ్చర్య అంటూ మొదటిపేజీలో ప్రచురిస్తాడా..? ఇది ఎంత దుర్మార్గం. ఇలాంటి నీచమైన వార్తలు రాసి వండివార్చిన రామోజీరావు తాను చేసిన తప్పునకు రేపు సాయంత్రంలోగా.. ‘మేం తప్పుడు రాతలు రాశాం’ అని క్షమాపణ చెప్పకపోతే ఈ ప్రభుత్వం తరఫున క్రిమినల్ డిఫమేషన్ సూట్ ఫైల్ చేస్తామని హెచ్చరిస్తున్నాను.
రామోజీ ఆరాటమే కానీ...బాబు గెలిచేది లేదు..
రాజకీయంగా, సామాజికంగా అన్నివిధాలుగా చచ్చిపోయిన చంద్రబాబును మరలా బతికించాలని.. అతన్ని అధికారంలోకి తీసుకురావాలని రాజగురువుగా చెప్పుకునే రామోజీరావు తెగ తాపత్రాయం పడుతుంటాడు. ‘ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి శ్రీ వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి మా వాడు కాదు.. చంద్రబాబే మాకు కావాల్సిన వాడు... అందుకని ఈ రాష్ట్రానికి చంద్రబాబునే మేం ముఖ్యమంత్రిని చేస్తాం’ అనేది రామోజీరావు ఆరాటం. అక్క ఆరాటమే కానీ బావ గెలిచేది లేదనే పాత సామెతను రామోజీరావు గుర్తుంచుకోవాలి. అయినా.. నీకేం పోయేంకాలం వచ్చింది రామోజీరావు? ఇంకా ఎన్నేళ్లు బతికి ఉంటావు..? ముసలి వయసులో ధర్మంగా బతకాల్సిన నువ్వు.. ఇలాంటి నీచమైన కుట్రపూరిత ఆలోచనలకు ఒడిగడతావా..?
చెరుకూరు రామోజీరావు వైట్‌కాలర్ క్రిమినల్..
చట్టవ్యతిరేక ఆర్థికలావాదేవీలు నడుపుతూ.. నీతిమాలిన వ్యాపారాలకు అధిపతిగా చెలామణి అవుతున్న చెరుకూరి రామోజీరావు అనే వ్యక్తి ఒక వైట్‌కాలర్ క్రిమినల్. అతన్ని కాపాడే వ్యక్తి చంద్రబాబు. అందుకే, అతనికి ఒకటే లక్ష్యం. జగన్‌మోహన్‌రెడ్డిని తొక్కడం, చంద్రబాబును పైకి లేపడం. నువ్వు ఎన్ని కుట్రలు పన్నినా.. మా నాయకుడు జగన్‌మోహన్‌రెడ్డిని తొక్కడం నీవల్లకాదు రామోజీ. ఈరోజు రాష్ట్రంలో ప్రతీ ప్రాజెక్టు మీద ఈనాడు విషపు రాతలే.. చంద్రబాబు హయాంలోనే ప్రాజెక్టులు బాగా పూర్తయినట్లు.. మరే ఇతర ముఖ్యమంత్రులు ప్రాజెక్టులు పూర్తి చేయలేరన్నట్లు రామోజీరావు భావిస్తాడు.
పొలిటికల్ పోర్న్‌స్టార్లకు రక్షకుడుగా రామోజీ..
తండ్రి చెప్పినట్లు ఏదిబడితే అది వాగే లోకేశ్ ఒక పొలిటికల్ పోర్న్‌స్టార్ అయితే.. అయ్యన్నపాత్రుడు అనే వ్యక్తి ఒక పాయిఖానా కంపు.. నోరుతెరిస్తే బూతుల పురాణమే.. వీళ్లందరికీ రక్షకుడుగా రాజగురువు రామోజీరావు నిలిచాడు. నీ చేతిలో కలముందని.. జగన్‌పై బురదజల్లే ప్రయత్నాలు చేస్తే ప్రజలు చూస్తూ ఊరుకోరు. మేం ఈనాడుపై చట్టపరమైన అన్ని కార్యక్రమాలకు సిద్ధపడతాం. వైట్‌కాలర్ క్రిమినల్ రామోజీకి ప్రజలు బుద్ధిచెప్పేందుకు సిద్ధంగా ఉన్నారు. ఈనాడు ఇప్పటికైనా వాస్తవాలు రాయకపోతే.. వైఎస్‌ఆర్‌సీపీ తరఫున ప్రజాస్వామ్య పద్ధతిలో నిరసనలు చేస్తామని హెచ్చరిస్తున్నాం.
నైతిక విలువల్లేని వ్యక్తి ‘కన్నా’
కన్నా లక్ష్మీనారాయణ టీడీపీలో చేరికను మేము అతి సాధారణ విషయంగానే చూస్తున్నాం. ఆయన ఒకప్పుడు కాంగ్రెస్‌పార్టీ నాయకుడు. నిన్నటిదాకా బీజేపీ నాయకుడు. ఇప్పుడు టీడీపీ.
తిన్నింటి వాసాలు లెక్కపెట్టడం ‘కన్నా’కు బాగా అలవాటు. కాంగ్రెస్‌లో పదవులు వెలగబెట్టి బీజేపీలోకి వెళ్లాడు. బీజేపీలో చేరేముందు వైఎస్‌ఆర్‌సీపీలో చేరతానని అన్నాడు. ఢిల్లీ నుంచి ఫోన్‌లు రాగానే గుండెజబ్బు వచ్చిందని ఆస్పత్రికి వెళ్లాడు. బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడైన కొన్నాళ్లలోనే అతన్ని అధిష్టానం పక్కనబెట్టింది. ఏదేమైనా.. బీజేపీ తిన్నింటి వాసాలు లెక్కపెట్టి.. మరలా జనసేనకు వెళ్లేందుకు బేరాలాడాడు. అతని వ్యాపారం పారలేదు. అందుకని, ఇప్పుడు టీడీపీ గూటికి చేరాడు. నైతిక విలువలు కోల్పోయి.. పదవికోసం ఏ పార్టీ కండువానైనా వేసుకునే దిగజారుడు నాయకుడు కన్నా లక్ష్మీనారాయణ.
ఈరోజు ‘కన్నా’ రాజకీయంగా చచ్చినట్లే..
ఒకప్పుడు ఇదే కన్నా లక్ష్మీనారాయణ ఒక మాట చెప్పాడు. ‘ఈ చంద్రబాబు అనే దుర్మార్గుడు.. నన్ను, వంగవీటి రంగాను ఎలిమినేట్ చేయడానికి కుట్ర చేశాడు. రంగాను అడ్డుతొలగించుకున్నారు గానీ.. నన్ను మాత్రం చంపలేకపోయారు..’ అని అందరికీ చెప్పుకున్నాడు. ఈరోజు కన్నా లక్ష్మీనారాయణకు నేను చెబుతున్నాను. నిన్ను సర్వనాశనం చేయడానికి చంద్రబాబు వ్యూహం పన్నాడు. అతని చేతితో టీడీపీ కండువా వేయించుకున్న క్షణంలోనే కన్నా లక్ష్మీనారాయణ రాజకీయంగా చచ్చిపోయినట్లేనని చెబుతున్నాను.
ఖబడ్దార్ కన్నా.. నోరు అదుపులో పెట్టుకో..
‘నీ రాజకీయ బతుకు కోసం చంద్రబాబు దగ్గరకు వెళ్లావు...అది నీ ఇష్టం.. ఈ ప్రభుత్వానిది దుర్మార్గమైన పరిపాలన.. అని ఏవేవో కబుర్లు చెప్పి ప్రజలను మభ్యపెడతావా..?’ చూడు కన్నా.. నీకు నోటిదూల ఎక్కువని మాకందరికీ బాగా తెలుసు. మా గౌరవ ముఖ్యమంత్రి శ్రీ జగన్‌మోహన్‌రెడ్డి గారిని నోటికొచ్చినట్లు మాట్లాడితే..ఖబడ్దార్ .. వళ్లు దగ్గరపెట్టుకుని మాట్లాడు. లేదంటే నీకు తగిన బుద్ధి చెబుతాం.
వారాహికి తుప్పుబడుతుందేమో...
వారాహి అని ఒక సెలబ్రిటీ స్టార్ అన్నాడు. యాత్రకు బండి తెచ్చుకుని ఇంట్లో పెట్టుకున్నాడు. చంద్రబాబు వారాహి రోడ్లపైకి రావడానికి గ్రీన్ సిగ్నల్ ఇవ్వకపోవడంతో అది తప్పు పట్టి పోతోంది.
ఫ్రస్టేషన్‌లో చంద్రబాబు, లోకేశ్..
ఈ రాష్ట్రంలో ఎన్ని యాత్రలు చేసినా ఫలితం కనిపించడంలేదని చంద్రబాబు, లోకేశ్‌కు ఫ్రస్టేషన్ పెరిగి పిచ్చెక్కి మాట్లాడుతున్నారు. తిరిగి వైఎస్‌ఆర్‌సీపీ అధికారంలోకి రావడం ఖాయమని తండ్రీకొడుకులకు అర్ధమైంది. ఈ దుష్టచతుష్టయానికి తప్ప మా పరిపాలన అందరికీ నచ్చుతుంది. మద్యం ధరలు పెరుగుతున్నాయని చంద్రబాబు తెగబాధ పడిపోతున్నాడు. ఆయన చెబుతున్నట్లు.. మద్యంలో మంచి మద్యం ఏంటో.. ఆయన పాలనలో జనాలకు ఏరకమైన మద్యం పోయించాడో.. ప్రజలకు అంతా తెలుసు. లోకేశ్‌ను ప్రశాంతత అని అనమనండి.. ‘ప్రశాంత అత్త’ అనేవాడు ఈ రాష్ట్రంలో ఒక నాయకుడంట. అధికారం కోసం లోకేశ్ పిచ్చెక్కి కొట్టుకుంటున్నాడు. మధ్యంతర ఎన్నికలు వస్తాయని చంద్రబాబుకు ఎవరు చెప్పారు..? బహుశా కన్నా లక్ష్మీనారాయణ లాంటి వాళ్లు పార్టీలో చేరతారని బాబు అలా మాట్లాడుతుంటాడు.