గత ప్రభుత్వ నిర్లక్ష్యం వల్లే పోలవరం ఆలస్యం

చంద్రబాబు అనాలోచిత చర్యలతో ప్రాజెక్టు నిర్మాణంలో సమస్యలు

పోలవరం ప్రాజెక్టు పనులను పరిశీలించిన మంత్రి అంబటి రాంబాబు

ఏలూరు: పోలవరం ప్రాజెక్టు నిర్మాణ పనులను ఇరిగేషన్‌ శాఖ మంత్రి అంబటి రాంబాబు పరిశీలించారు. ప్రాజెక్టులోని లోయర్‌ కాఫర్‌ డ్యామ్, డయాఫ్రం వాల్‌ నిర్మాణ పనులను పరిశీలించి, పనుల పురోగతిని అధికారులను అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా మంత్రి అంబటి రాంబాబు మాట్లాడుతూ.. గత ప్రభుత్వ నిర్లక్ష్యం వల్లే పోలవరం ప్రాజెక్టు నిర్మాణం ఆలస్యమైందన్నారు. కాఫర్‌ డ్యామ్‌ పనులను గత ప్రభుత్వం గాలికొదిలేసిందన్నారు. యుద్ధ ప్రాతిపదికన కాఫర్‌డ్యామ్‌ ఎత్తు పెంచామని చెప్పారు. చంద్రబాబు అనాలోచని నిర్ణయాలు,  తొందరపాటు చర్యలతో పోలవరం ప్రాజెక్టులో సమస్యలు తలెత్తాయని చెప్పారు. కేంద్ర ప్రభుత్వం నిధులు సకాలంలో నిధులు విడుదల చేయకపోయినా ప్రాజెక్టు నిర్మాణం కోసం రాష్ట్ర నిధులు ఖర్చు చేస్తున్నామన్నారు. పోలవరం ప్రాజెక్టును పూర్తి చేయాల్సిన బాధ్యత కేంద్ర ప్రభుత్వానిదేనని మంత్రి అంబటి రాంబాబు చెప్పారు. 
 

Back to Top