నెల్లూరులోని నివాసానికి గౌతమ్‌రెడ్డి భౌతికకాయం

నెల్లూరు: గౌతమ్‌రెడ్డి భౌతికకాయం కొద్దిసేప‌టి క్రిత‌మే నెల్లూరులోని ఆయ‌న నివాసానికి త‌ర‌లించారు. ఉద‌యం హైదరాబాద్‌ జూబ్లీహిల్స్‌లోని నివాసం నుంచి  బేగంపేట ఎయిర్‌పోర్ట్‌కి గౌతమ్‌రెడ్డి భౌతికకాయం తరలించారు.  ఉదయం 10 గంటలకు అక్కడ నుంచి ఏపీ ప్రభుత్వం ఏర్పాటు చేసిన ప్రత్యేక హెలికాఫ్టర్‌లో ఆయన  భౌతికకాయం నెల్లూరుకు చేరుకుంది. పోలీస్‌ పరేడ్‌ గ్రౌండ్‌ నుంచి రోడ్డు మార్గం ద్వారా గౌతమ్‌రెడ్డి నివాసానికి ఆయన భౌతికకాయం తరలించారు అభిమానుల సందర్శనార్థం గౌతమ్‌రెడ్డి భౌతికకాయాన్ని క్యాంపు కార్యాల‌యంలో ఉంచారు. గౌతమ్‌రెడ్డి నివాసం వద్ద విషాద ఛాయలు అలుముకున్నాయి. గౌతమ్‌రెడ్డి నివాసానికి భారీగా కార్యకర్తలు, అభిమానులు చేరుకుంటున్నారు. ఆయన మరణంతో అభిమానులు క‌న్నీటి పర్యంతమవుతున్నారు.

 ఈరోజు రాత్రి అమెరికా నుంచి గౌతమ్‌రెడ్డి కుమారుడు అర్జున్‌రెడ్డి రానున్నారు. రేపు(బుధవారం) ఉదయగిరిలోని మేకపాటి ఇంజనీరింగ్‌ కాలేజీ ఆవరణలో అంత్యక్రియలకు ఏర్పాట్లు చేశారు. రేపు ఉదయం 11 గంటలకు అధికారిక లాంఛనాలతో గౌతమ్‌రెడ్డి భౌతికకాయానికి అంత్యక్రియలు నిర్వహించనున్నారు. గౌతమ్‌రెడ్డి అంత్యక్రియలకు ముఖ్యమంత్రి వైయ‌స్‌ జగన్‌మోహన్‌రెడ్డి హాజరుకానున్నారు.  

తాజా వీడియోలు

Back to Top