ఆద‌ర్శ‌వంత‌మైన పాల‌న సాగిస్తున్న సీఎంకు శుభాకాంక్షలు

ఏపీలో రికార్డుస్థాయి వ్యాక్సినేషన్‌పై మెగాస్టార్‌ ప్రశంసలు

తాడేపల్లి: ముఖ్యమంత్రి వైయస్‌ జగన్‌మోహన్‌రెడ్డి నాయకత్వంలో ఆంధ్రప్రదేశ్‌లో రికార్డు స్థాయిలో వ్యాక్సినేషన్‌ చేపట్టడం పట్ల మెగాస్టార్‌ చిరంజీవి సంతోషం వ్యక్తం చేశారు. ఓకే రోజు 13.72 లక్షల మందికి వ్యాక్సిన్‌ వేయించిన రాష్ట్ర ప్రభుత్వంపై ప్రశంసల జల్లు కురిపించారు. కోవిడ్‌ మహమ్మారి కట్టడి కోసం ఏపీ వైద్య ఆరోగ్య శాఖ చేస్తున్న ప్రయత్నాన్ని అభినందించారు. కోవిడ్‌ నియంత్రణ కోసం ఏపీ ప్రభుత్వం చేసిన ప్రయత్నం దేశానికే ఆదర్శంగా నిలిచిందని కొనియాడారు. ఆదర్శవంతమైన పరిపాలన కొనసాగిస్తున్న ముఖ్యమంత్రి వైయస్‌ జగన్‌మోహన్‌రెడ్డికి శుభాకాంక్షలు అంటూ మెగాస్టార్‌ చిరంజీవి ట్వీట్‌ చేశారు.  
 

తాజా వీడియోలు

తాజా ఫోటోలు

Back to Top