తాడేపల్లి: కరోనాను కట్టడి చేసేందుకు ప్రభుత్వం అన్ని రకాల చర్యలు తీసుకుంటుందని డిప్యూటీ సీఎం, వైద్య ఆరోగ్య శాఖ మంత్రి ఆళ్ల నాని అన్నారు. ఈ నేపథ్యంలో అన్ని ప్రభుత్వ మెడికల్ కాలేజీల్లో ఆర్టీపీసీఆర్ పరీక్షల సంఖ్యను పెంచేందుకు 113 మంది టెక్నికల్ సిబ్బంది నియామానికి సీఎం వైయస్ జగన్‌మోహన్‌రెడ్డి ఆమోదం తెలిపారన్నారు. మంత్రి ఆళ్ల నాని మీడియాతో మాట్లాడుతూ.. రాష్ట్రంలోని 12 ప్రభుత్వ మెడికల్ కాలేజీలతో పాటు మరో 2 ప్రైవేట్ మెడికల్ కాలేజీల్లోని వీఆర్‌డీఎస్ కేంద్రాల్లో సిబ్బంది నియామకానికి గ్రీన్‌సిగ్నల్ ఇచ్చామన్నారు. కొత్త సిబ్బంది విధుల నిర్వహణకు 6 నెలల పాటు అనుమతిచ్చామన్నారు. ఆర్టీపీసీఆర్ పరీక్షలు 60 వేలకు పైబడి చేసేందుకు చర్యలు తీసుకుంటున్నట్ట వివరించారు. ట్రూనాట్ పరీక్షలు మరింత పెంచాలని ప్రభుత్వం నిర్ణయించిందన్నారు.