మ‌హాత్ముడు చూపిన బాట‌లోనే వైయ‌స్ జ‌గ‌న్ పాల‌న‌

వైయస్ జగన్ తన పాలనతో నిశ్శబ్ధ విప్లవాన్ని తీసుకొచ్చారు

ప్రజాధనాన్ని దోచుకుని సత్యాగ్రహ దీక్షలేంటి..?

మహాత్ముడిని అవమనించే రీతిలో చంద్రబాబు దీక్షలు ఉన్నాయి

వైయ‌స్ఆర్ సీపీ ప్ర‌ధాన కార్య‌ద‌ర్శి, ప్ర‌భుత్వ స‌ల‌హాదారు స‌జ్జ‌ల రామ‌కృష్ణారెడ్డి

పార్టీ కేంద్ర కార్యాల‌యంలో ఘనంగా మహాత్మాగాంధీ, లాల్ బహుదూర్ శాస్త్రి జయంతి వేడుకలు 

మ‌హ‌నీయుల‌కు నివాళుల‌ర్పించిన మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, నేత‌లు

తాడేప‌ల్లి: మహాత్మాగాంధీ, మాజీ ప్ర‌ధాని లాల్ బహుదూర్ శాస్త్రి జయంతి వేడుకలు తాడేపల్లిలోని వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కేంద్ర కార్యాలయంలో ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా స్వాతంత్ర్య పోరాట సాధనలో ఆ మహనీయులు చేసిన త్యాగాలను, పోరాటాలను గుర్తుచేసుకున్నారు.  మహాత్మాగాంధీ, లాల్ బహుదూర్ శాస్త్రి చిత్ర పటాలకు పార్టీ ప్రధాన కార్యదర్శి, ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి, మంత్రులు అంబటి రాంబాబు, మేరుగు నాగార్జున, శాసన మండలి చీఫ్ విప్ ఉమ్మారెడ్డి వెంకటేశ్వర్లు, ఎంపీ నందిగం సురేష్, మాజీ మంత్రి వెలంపల్లి శ్రీనివాస్, ఎమ్మెల్సీలు లేళ్ల‌ అప్పిరెడ్డి, ఎండీ రుహుల్ల, ఎమ్మెల్యే కైలే అనిల్ కుమార్, గుంటూరు మేయర్ కావటి మనోహర్ నాయుడు, మాజీ మంత్రులు శిద్దా రాఘవరావు, డొక్కా మాణిక్య వరప్రసాద్‌లు పూలమాలలు వేసి ఘన నివాళుల‌ర్పించారు.

అనంత‌రం సజ్జల రామకృష్ణారెడ్డి మాట్లాడుతూ.. మహాత్మాగాంధీ, ఫూలే, అంబేద్కర్ లు భారతీయ ఆత్మ లాంటి వారని సజ్జల రామకృష్ణారెడ్డి అన్నారు. మహాత్మాగాంధీ ప్రపంచంలోనే అరుదైన మహనీయుల్లో ఒకరని అన్నారు. జాతిపిత మహాత్మాగాంధీ మరణించిన తర్వాత వారి ఆశయాలు, ఆచరణ గురించీ చర్చలు జరుగుతూనే ఉన్నాయని, అయితే సమాజంలో అనుకున్నంత చైతన్యం ఉండటం లేదు. ప్రజాస్వామ్యం అన్న భావన అకడమిక్ అంశంగానే ఉండి పోతోందన్నారు. ముఖ్యంగా చెప్పాలంటే సిద్ధాంతాల పై చర్చే కానీ ఆచరణ జరగటం లేదు. అహింస, సహనం వంటివి గొప్ప లక్షణాలు వాటిని చెప్పే ముందు మనం ఆచరించాలని.. వాస్తవ రూపంలో అది ఆచరించి చూపించటం వల్లే జాతిపిత మహాత్మాగాంధీ మహానీయుడు అయ్యారని వివరించారు. లాల్ బహుదూర్ శాస్త్రి స్వాతంత్ర్య పోరాటంలో త్యాగాలు చేయడంతోపాటు విలువలతో కూడిన జీవితిం గడిపారన్నారు. రాజకీయాలలో ఆయన ఎందరికో మార్గదర్శకుడు అని అన్నారు.

గాంధీ ఆశయాలను, ఆలోచనలను స్ఫూర్తిని సీఎం వైయ‌స్ జ‌గ‌న్ ముందుకు తీసుకుని వెళుతున్నారు. ప్రకటనలు.. పైపై పూతలు కాకుండా కింది స్థాయి నుంచి మార్పులు తీసుకుని వస్తున్నారని అన్నారు. గ్రామ, వార్డు సచివాలయాల ద్వారా క్షేత్ర స్థాయిలో పరిపాలనను ఎలా అందిస్తున్నారో మనం అందరం చూస్తూనే ఉన్నామన్నారు. ఫలితాలు ఎలా ఉన్నాయో అవి ఎంతగా సత్ఫలితాలు ఇస్తున్నాయో మనకు అర్థం అవుతున్నాయి అని అన్నారు. 

స్కిల్ డెవలప్ మెంట్ స్కామ్ లో అడ్డంగా దొరికి జైలు ఊచలు లెక్కపెడుతున్న చంద్రబాబు సిగ్గు లేకుండా గాంధీ జయంతి రోజున నిరాహారదీక్ష చేయడం ఏంటని ప్రశ్నించారు. మహాత్మాగాంధీని అవమానించే రీతిలో చంద్రబాబు దీక్షలు ఉన్నాయన్నారు. చంద్రబాబు ఆధారాల‌తో దొరికిపోవడంతో ఆ సాక్ష్యాలను చూసి కోర్టు రిమాండ్ విధించిందని తెలియచేశారు. ప్రజాధనాన్ని దోపిడీ చేసి జైలులో దీక్షలు చేయడం హాస్యాస్పదం అన్నారు. చంద్రబాబు తప్పుచేసినట్లు కోర్టు గుర్తించిందని అందుకే రిమాండ్ కు పంపారన్నారు. అక్కడ దీక్షలు చేయడంపై ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రజల కోసం పోరాటం చేసి జైలుకెళ్తే వేరు. ప్రజాధనాన్ని నిస్సిగ్గుగా దోచుకుని సత్యాగ్రహదీక్షలు ఎలా చేస్తారని అన్నారు. దీక్షలు చేయడం చూస్తే చంద్రబాబుతో పాటు టిడిపి నేతల్లో బరితెగింపు కనిపిస్తోందన్నారు.

గాంధీ కలలు క‌న్న గ్రామ స్వరాజ్యం వైయ‌స్ జగన్ పాలనలో కనిపిస్తోందన్నారు. జగనన్న సురక్ష కార్యక్రమం ద్వారా 98 లక్షల సర్టిఫికెట్లు, సేవలు అందాయని అన్నారు. నేడు జగనన్న ఆరోగ్య సురక్ష క్యాంపైన్ రాష్ట్ర వ్యాప్తంగా విస్తృతంగా జరుగుతోందని తెలియచేశారు. ఇవన్నీ గ్రామ, పట్టణ స్థాయిలో వేళ్ళూనుకున్న గ్రామ, వార్డు సచివాలయాల వల్లనే సాధ్యం అవుతోందన్నారు. ఈ మొత్తం ప్రక్రియకు ఇరుసులాంటిది గ్రామ సచివాలయ వ్యవస్థ అన్నారు. రాష్ట్రంలోని ప్రజలందరి హెల్త్ ప్రొఫైల్ తయారు అవుతున్నాయన్నారు. దీనివల్ల ప్రజలకు సంబంధించిన ఆరోగ్యసేవలు మరింతగా అందుబాటులోకి వస్తాయన్నారు. 15 మెడికల్ కాలేజీలు, ఫ్యామిలీ డాక్టర్ కాన్సెప్ట్ తో ప్రజలకు మరింతగా వైద్య సేవలు లభిస్తాయన్నారు.

పెత్తందారితనం లేకుండా ప్రజాస్వామ్య స్పూర్తితో నడవాలంటే పథ‌కాలు కిందిస్థాయి వరకు అందాలన్నారు. విద్యా, వైద్య రంగాలలో కార్పొరేట్ సంస్థ‌లకు దీటుగా మార్పులు తెచ్చిన ఘనత వైయస్ జగన్ దన్నారు. నిరక్షరాస్యత రూపుమాపేందుకు ప్రభుత్వం కృషి చేస్తోందన్నారు. పేరుకు పాలన వైయస్సార్ సీపీదే అయినా ముఖ్యమంత్రి వైయస్ జగన్ ప్రజల చేతుల్లోనే పాలన  పెట్టారన్నారు. గడప వద్దకే పథ‌కాలు అందిస్తున్నారన్నారు. వ్యవసాయరంగంలో కూడా రైతులకు మేలు చేసే విధానాలు అమలు చేస్తున్నారన్నారు. వైయస్ జగన్ తన పరిపాలనతో నిశ్శబ్ద విప్లవాన్ని తీసుకువచ్చారన్నారు.

మంత్రి మేరుగు నాగార్జున మాట్లాడుతూ.. మహాత్మాగాంధీ, లాల్ బహుదూర్ శాస్త్రిలు దేశం గర్వించదగ్గ మహోన్నత వ్యక్తులు అన్నారు. వారి జన్మదినాన్ని పురస్కరించుకుని వారి ఆలోచనలను స్పరించుకుంటున్నామని అన్నారు. ఆంధ్రప్రదేశ్ లో మహాత్మాగాంధీ కలలు కన్న గ్రామ స్వరాజ్యాన్ని ప్రజలకు చేరువ చేసే విధంగా ముఖ్యమంత్రి వైయస్ జగన్ పనిచేస్తున్నారని అన్నారు. గ్రామాలను అభివృద్ధి చేయడం,పేదరికాన్ని నిర్మూలించే విధంగా పరిపాలన సాగిస్తున్నారని తెలియచేశారు.

మంత్రి అంబటి రాంబాబు మాట్లాడుతూ.. మహాత్మాగాంధీ బ్రిటీష్ సామ్రాాజ్యాన్ని ఇక్కడ నుంచి పారద్రోలడంకోసం అనేక సంవత్సరాలు పోరాటాలు చేశారు. అహింసతో ఉద్యమం నడిపి తద్వారా విజయం సాధించారు. తద్వారా అహింస ద్వారా విజయాలు లభిస్తాయని మానవాళికి గొప్ప సందేశం ఇచ్చారు. అందువల్లనే ప్రపంచ వ్యాప్తంగా గాంధీజీకి ఎంతో ప్రాముఖ్యత లభించిందని అన్నారు. మహాత్మాగాంధీకి నివాళులు అర్పించడం భారతదేశంలో ప్రతి  పౌరుడి బాధ్యత అని అన్నారు.

శాసన మండలి చీఫ్ విప్ ఉమ్మారెడ్డి వెంకటేశ్వర్లు మాట్లాడుతూ.. బ్రిటీష్ సామ్రాజ్యవాదులు ఎంతగా రెచ్చగొట్టినా కూడా మహాత్మాగాంధీ అహింస మార్గంలోనే స్వాతంత్ర్య పోరాటం సాగించారని తెలియచేశారు. అహింస అనే ఏకైక సిద్ధాంతంతో దేశానికి స్వాతంత్ర్యం లభించేలా చేశారన్నారు. వైయస్ జగన్ పేద, బడుగు వర్గాల సంక్షేమమే లక్ష్యంగా పనిచేస్తున్నారని అన్నారు. 

ఎంపీ నందిగం సురేష్ మాట్లాడుతూ.. వైయస్ జగన్ మహాత్మాగాంధీ కోరుకున్నవిధంగా గ్రామ సచివాలయాల వ్యవస్ధను తీసుకువచ్చి ప్రజలకు మేలైన పరిపాలన అందిస్తున్నారన్నారు. గాంధీతో కలిసి లాల్ బహుదూర్ శాస్త్రి అనేక పోరాటాలు చేశారన్నారు. లాల్ బహుదూర్ శాస్త్రి విలువల పాటిస్తూ త్యాగాలు చేస్తూ స్వాతంత్ర్య పోరాటం సాగించారన్నారు. అదే విధంగా డాక్టర్ అంబేద్కర్, జ్యోతిరావు పూలే, జగజ్జీవన్ రామ్ వంటి మహనీయులు కోరుకున్న విధంగా పేదరికాన్ని నిర్మూలించి బడుగులకు రాజ్యాధికారంలో భాగం కల్పించిన ఘనత వైయస్ జగన్ దన్నారు.

ఎమ్మెల్సీ లేళ్ల అప్పిరెడ్డి మాట్లాడుతూ.. మహాత్మాగాంధీ, లాల్ బహుదూర్ శాస్త్రిలు అందరికీ స్ఫూర్తి అని అన్నారు. మహోన్నత విలువలు పాటిస్తూ వారు చేసిన అనేక త్యాగాల ఫలితమే నేటి మన స్వేచ్ఛా భారతదేశం అన్నారు. బ్రిటీష్ వారికి వ్యతిరేకంగా వారు చూపిన తెగువ, పోరాటాలు ఎప్పటికీ స్ఫూర్తి దాయకంగా నిలుస్తాయన్నారు. రాష్ట్రంలో బడుగు, బలహీన, మైనారిటీ, పేదవర్గాలను ఉన్నత స్థానంలోకి తీసుకువచ్చే దిశగా ముఖ్యమంత్రి వైయస్ జగన్ పనిచేస్తున్నారన్నారు.

తాజా వీడియోలు

Back to Top