ప్రజావేదిక కూల్చివేతను స్వాగతిస్తున్నా..

గత ప్రభుత్వం చట్టానికి తూట్లు పోడిచింది

వైయస్‌ఆర్‌సీపీ ఎమ్మెల్యే ఆళ్ల రామకృష్ణారెడ్డి 

అమరావతి: అక్రమ కట్టడమైన ప్రజావేదిక కూల్చివేతను స్వాగతిస్తున్నాని మంగళగిరి ఎమ్మెల్యే ఆళ్ల రామకృష్ణారెడ్డి అన్నారు.యజమానుల నుంచి భూమిని లాక్కుని ప్రజావేదిన నిర్మిచారని తెలిపారు.చంద్రబాబు అండతోనే కరకట్టపై అక్రమ నిర్మాణాలు చేపట్టారన్నారు.ప్రజాధనాన్ని దుర్వినియోగం చేస్తూ చట్టానికి తూట్లు పొడిచారన్నారు.అక్రమ కట్టడాలతో నదీగర్భం కలుషితమవుతోందన్నారు.కరకట్టపై అక్రమ కట్టడాలన్నీ కూల్చివేయాల్సిన అవసరముందన్నారు.అక్రమ కట్టడాలపై ముందు నుంచి న్యాయపోరాటం చేస్తున్నానని తెలిపారు.ప్రజాధనంతో చంద్రబాబు హైదరాబాద్‌లోనూ ఇల్లు కట్టారన్నారు.కరకట్టపై 60కి పైగా అక్రమకట్టడాలకు నోటీసులు కూడా అందాయన్నారు.ప్రజావేదిక కూల్చివేతపై సీఎం నిర్ణయాన్ని ప్రజలు హర్షిస్తున్నారన్నారు.
 

తాజా వీడియోలు

Back to Top