మా నమ్మకం నువ్వే జ‌గ‌న‌న్న‌

కోడుమూరు ఎమ్మెల్యే డాక్ట‌ర్‌ సుధాక‌ర్‌

క‌ర్నూలు: ఇవాళ ధైర్యంగా ప్ర‌జ‌ల్లోకి వెళ్లి వైయ‌స్ జ‌గ‌న్‌మోహ‌న్‌రెడ్డి పాల‌న‌లో చేసిన అభివృద్ధిని, సంక్షేమాన్ని వివ‌రిస్తున్నామంటే దానికి కార‌ణం సీఎం వైయ‌స్ జ‌గ‌న్ మోహ‌న్ రెడ్డినే అని కోడుమూరు ఎమ్మెల్యే సుధాక‌ర్ అన్నారు. కోడుమూరు నియోజకవర్గంలో వైయ‌స్ఆర్‌ సీపీ జెండా ఎగరేసి, హ్యాట్రిక్ విజయాన్ని జగనన్నకు కానుక గా ఇద్దామ‌ని కర్నూల్ మండల గ్రామ సచివాలయం కన్వీనర్లు, గృహసారధుల సమావేశంలో కోడుమూరు ఎమ్మెల్యే అన్నారు. 
 కోడుమూరు నియోజకవర్గ పరిధిలోని కర్నూలు మండలం గ్రామ సచివాలయాల కన్వీనర్లు గృహసారధులతో కోడుమూరు ఎమ్మెల్యే  డాక్టర్ జరదొడ్డి సుధాకర్ గారు స్టాంటన్ పురం లో  సమావేశమయ్యారు.  కర్నూల్ మండలానికి సంబంధించి గ్రామ సచివాలయ కన్వీనర్లుగా గృహ సారధులు గా నియమించబడ్డ వారికి, వారు రాబోయే 2024 ఎన్నికల్లో పార్టీ గెలుపునకు ఏ విధంగా సమాయత్తం కావాలో దిశానిర్దేశం చేశారు.

సీఎం వైయ‌స్ జ‌గ‌న్ అధికారంలోకి వచ్చిన తర్వాత కోడుమూరు నియోజకవర్గ చరిత్రలోనే ఎన్నడూ లేనివిధంగా వేగంగా అభివృద్ధి పనులు జరుగుతున్నాయన్నారు.  గతంలో పాలించిన నాయకులు వారు నియోజకవర్గ అభివృద్ధి కోసం చేసిన పనితీరును ప్రస్తుతం సీఎం వైయ‌స్ జగనన్న సారధ్యంలో జగనన్న సహకారంతో మేము సాగిస్తున్న ప్రజా రంజ‌క‌ పరిపాలనను గమనించి చంద్రబాబు నాయుడు, దత్తపుత్రుడు పవన్ కళ్యాణ్, ఎల్లో మీడియా విషపు రాతలను ఎప్పటికప్పుడు తిప్పికొడుతూ ప్రజలలో విశ్వసనీయతను పెంచుకోవాలని దానికి మనందరం ఒకే తాటిపై ఉంటూ కోడుమూరు నియోజకవర్గంలో వచ్చే ఎన్నికల్లో వైయ‌స్ఆర్‌ సిపి జెండా ఎగరేసి, సీఎం వైయ‌స్ జగన్ మోహన్ రెడ్డిని మ‌రోసారి ముఖ్యమంత్రిని చేయడమే ధ్యేయంగా పనిచేయాలని పిలుపునిచ్చారు.  కార్యక్రమంలో కర్నూల్ మండల ఎంపీపీ వాసు వేంకటేశ్వరమ్మ,  జెడ్పీటీసీ సంధ్య ప్రసన్న కుమార్, మండల గ్రామ సచివాలయం కన్వీనర్ల ఇంఛార్జి సత్యం రెడ్డి, ఉల్చాల వాసు, గ్రామ సచివాలయ కన్వీనర్లు, గృహ సారధులు పాల్గొన్నారు.  

పార్వ‌తీపురంలో..
పార్వతీపురం పురపాలక సంఘంలో నూతనంగా నియామితులైన గృహ సారాధులతో పార్టీ భవిష్యత్ కార్యాచరణపై ప్రత్యేక శిక్షణ కార్యక్రమం నిర్వ‌హించారు. ఈ సంద‌ర్భంగా ఎమ్మెల్యే అలజంగి జోగారావు పార్టీ శ్రేణులకు దిశానిర్దేశం చేశారు. పార్వతీపురం పురపాలక సంఘంలో 15సచివాలయంల పరిధిలో 30వార్డులలో నూతనంగా ఎంపికైన‌ 534 మంది గృహ సారధులు ఈ స‌మావేశంలో పాల్గొన్నారు.

Back to Top