వ్యవసాయ రంగానికి పెద్దపీట

మంత్రి కాకాణి గోవ‌ర్ధ‌న్‌రెడ్డి
 

తిరుప‌తి:  రైతు సంక్షేమానికి, వ్యవసాయ రంగానికి వైకాపా ప్రభుత్వం పెద్దపీట వేస్తూ పథకాలు అమలు చేస్తున్నట్లు రాష్ట్ర వ్యవసాయశాఖా మంత్రి కాకాణి గోవర్ధన్‌రెడ్డి వెల్లడించారు.  డా౹౹వైయ‌స్ఆర్‌ ఉద్యానవన విశ్వవిద్యాలయం ఆధ్వర్యంలోని తిరుపతిలోని నిమ్మ పరిశోధన కేంద్రం 50 సంవత్సరాలు పూర్తి చేసుకున్న సందర్భంగా ఏర్పాటు చేసిన గోల్డెన్ జూబ్లీ వేడుకల్లో  వ్యవసాయ, సహకార, మార్కెటింగ్, ఫుడ్ ప్రాసెసింగ్ శాఖా మాత్యులు కాకాణి గోవర్ధన్ రెడ్డి  ముఖ్య అతిథిగా హాజ‌ర‌య్యారు. ఈ సంద‌ర్భంగా మంత్రి ఇన్ఫర్మేషన్ సెంటర్ ను ప్రారంభించి, స్క్రీన్ హౌస్ ను సందర్శించి, నర్సరీ మొక్కల పెంపకాన్ని పరిశీలించారు. ఎగ్జిబిషన్ స్టాల్స్ ను ప్రారంభించి, పలు సంచికలు విడుదల చేసి, ఆదర్శ రైతులను సన్మానించారు. శ్రీ వెంకటేశ్వర స్వామి సన్నిధిలో పలు కైంకర్యాలకు వినియోగించే పూలను ఉపయోగించి, డా౹౹ వైయ‌స్ఆర్‌  ఉద్యానవన విశ్వవిద్యాలయం ఆధ్వర్యంలో మహిళల చేత వెంకటేశ్వర స్వామి చిత్రపటాలను తయారుచేసి, తిరుమల తిరుపతి దేవస్థానానికి సరఫరా చేసే "పుష్ప ప్రసాదం" చిత్రపటాల తయారీని మంత్రి తిలకించి, తయారు చేసే మహిళలను అభినందించారు.

 ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సమావేశంలో మంత్రి మాట్లాడుతూ..   రైతుల సంక్షేమానికి అనేక కార్యక్రమాలు అమలు చేస్తూ.. వారికి అండగా ఉంటూ వ్యవసాయాన్ని లాభసాటిగా మార్చేందుకు ముఖ్యమంత్రి వైయ‌స్‌ జగన్‌మోహన్‌రెడ్డి నిరంతరం కృషి చేస్తున్నారని తెలిపారు.  రైతు భరోసా కేంద్రాల నిర్వహణలో దేశంలో ఇతర రాష్ట్రాలకు ఆదర్శంగా నిలుస్తున్నామన్నారు.

కార్యక్రమంలో డాక్ట‌ర్ వైయ‌స్ఆర్‌ ఉద్యానవన విశ్వవిద్యాలయం వైస్ ఛాన్సలర్ డాక్ట‌ర్ జానకిరామ్, ప్రొఫెసర్లు, శాస్త్రవేత్తలు, ఆదర్శ రైతులు, ఉద్యానవన శాఖ అధికారులు, విద్యార్థిని, విద్యార్థులు.

Back to Top