స్కిల్‌ స్కాంలో పవన్‌ కల్యాణ్‌ కూడా భాగస్వామే 

రాష్ట్ర గృహ నిర్మాణ శాఖ మంత్రి  జోగి రమేశ్ 

చంద్రబాబు కొట్టేసిన రూ.371 కోట్లలో నీవాటా ఎంత?

యుద్ధం మొదలైంది... ఇక మీ పతనమే మిగిలింది.

వైయ‌స్ జగన్‌ గారిపై యుద్ధమంటే 5 కోట్ల మంది ప్రజలపై యుద్ధమే!
 
ఎవరి కాళ్ళు పట్టుకోవడానికి ఢిల్లీ వెళ్ళావ్ లోకేష్..!

ఢిల్లీ వెళ్లి మీ నాన్న రూ.371 కోట్లు కొట్టేశాడు అని చెప్తావా?

ఇంతకాలం స్టేలతో బతికిన చంద్రబాబు పాపం పండింది

ఒకవైపు బీజేపీతో సంసారం.. మరోవైపు టీడీపీతో తాళి

క్షణాల్లో బంధాలు, పార్టీలు ఎలా మారిపోతాయ్? 

బాబు-పవన్ లది ప్యాకేజీ ఫెవికాల్‌ బంధం

ఇద్దరు మెంటల్ కేసుల మధ్య పిచ్చి పవన్‌ కళ్యాణ్‌

మంత్రి  జోగి రమేశ్‌

 తాడేప‌ల్లి: చ‌ంద్ర‌బాబు చేసిన స్కిల్‌ స్కాంలో పవన్‌ కల్యాణ్‌ కూడా భాగస్వామే అని రాష్ట్ర గృహ నిర్మాణ శాఖ మంత్రి  జోగి రమేశ్  విమ‌ర్శించారు. చంద్రబాబు అవినీతి కేసులో అరెస్టై జైలులో ఉంటే.. పవన్‌ కల్యాణ్‌ పరామర్శకు వెళ్లి పొత్తులు మాట్లాడుకున్నారని మండిపడ్డారు. బీజేపీతో సంసారం చేస్తూనే టీడీపీతో పవన్‌ కలిశారని విమర్శించారు. స్కిల్ స్కాంలో పవన్ పాత్ర కూడా ఉందని.. చంద్రబాబు తన అవినీతిలో పవన్‌కు ఎంత వాటా ఇచ్చారని ప్రశ్నించారు. చంద్రబాబు చేసిన అవినీతి, అక్రమాల్లో పవన్‌ భాగస్వామి కాదా? అని నిలదీశారు.  పవన్‌, బాబులు కలిసే ఉన్నారని.. ఇప్పుడు కొత్తగా కలవడం ఏంటని ఎద్దేవా చేశారు. చంద్రబాబు చేసిన అవినీతి ప్రజలందరికీ తెలుసు అని.. చేసిన పాపాలు పండి బాబు జైలుపాలయ్యారని దుయ్యబట్టారు. వైఎస్‌ జగన్‌తో యుద్ధమంటే 5 కోట్ల మంది ప్రజలతో యుద్ధం చేయడమేనని అన్నారు. కోటిమంది డ్వాక్రా అక్కచెల్లెళ్ళపై, 66 లక్షల మంది అవ్వాతాతలు, వితంతువులు, వికలాంగుల మీద యుద్ధం చేయటమేనని పేర్కొన్నారు. సీఎం జగన్‌ పాలనలో అన్ని వర్గాలకు సంక్షేమం, అభివృద్ధి జరుగుతోందని తెలిపారు. 

రెండు మెంటల్‌ కేసుల మధ్య పిచ్చి పవన్‌ కళ్యాణ్‌:
- నిన్న రాజమండ్రి సెంట్రల్‌ జైల్‌ వద్ద ముగ్గురు మెంటల్ వాళ్ళు ఒక  చోట చేరినట్టు ఉంది. ఇద్దరు మెంటల్‌ కేసుల మధ్యలో ఒక పిచ్చి పవన్ కల్యాణ్‌ను చూశాం. 
- పవన్‌ కల్యాణ్‌ సినిమా తీయదలచుకుంటే ఇద్దరు మెంటల్‌ కేసుల నడుమ పీకే.. అని టైటిల్‌ పెట్టాలి.
- దానికి  బొక్కలో బాబు 7691 అనే ట్యాగ్‌ లైన్‌ కూడా ఇచ్చి బ్రహ్మాండమైన సినిమా తీయవచ్చు. 
- ఒక పక్క అవినీతి కేసులో చంద్రబాబు అరెస్ట్‌ అయ్యి రాజమండ్రి సెంట్రల్‌ జైలులో ఉన్నాడు. 
- పరామర్శకు వెళ్లిన ఒక పార్టీ అధ్యక్షుడు ఏం చేయాలి..? చేసింది ఏంటి..? 
- బాబు పరామర్శకు వెళ్లిన పవన్‌ కల్యాణ్‌ ఆయన మంచి చెడులు,యోగక్షేమాలు కనుక్కోవాలి. 
- చంద్రబాబు గారి ఆరోగ్యం ఎలా ఉంది అని అడగాలి. 
- మీరు చన్నీళ్ల స్నానం చేస్తున్నారట కదా...మొన్న మీ ఆవిడ చెప్పింది అని అడగాలి. 
- బయటకు వచ్చాక మీడియా వాళ్లు అడిగితే ఆయన యోగక్షేమాల గురించి చెప్పాలి. 
- కానీ లోపలికి వెళ్లి బాబుతో పొత్తులు- ప్యాకేజీలు మాట్లాడుకుని వచ్చాడు. 
- బయటకు వచ్చి టీడీపీకి నేనున్నాను అంటూ పొత్తు ప్రకటించాడు. 
- బీజేపీతో ఒక పక్కన సంసారం చేస్తూనే..మరోవైపు టీడీపీతో తాళికట్టించుకున్నాడు. 
- క్షణాల్లో బంధాలు, పార్టీలు మారిపోతాయా పవన్ కల్యాణ్? ఎవరన్నా నీ మీద ఉమ్ము వేస్తారు అన్న సిగ్గు కొంచెం కూడా లేదా? 

జగన్‌ గారిపై యుద్ధం అంటే ఐదు కోట్ల ప్రజలపై యుద్ధమే!:
- బయటకు వచ్చి యుద్ధం చేస్తాను అంటున్నాడు..ఏమి యుద్ధం చేస్తావ్‌..ఎవరి మీద యుద్ధం చేస్తావ్‌..? 
- ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి జగన్‌ గారిపై యుద్ధం చేయడమంటే ఐదు కోట్ల మంది తెలుగు ప్రజల మీద యుద్ధం చేయడమే. 
- అమ్మ ఒడి ద్వారా చదువుకుంటున్న 90 లక్షల మంది పిల్లలు, 45 లక్షల మంది వారి తల్లులతో యుద్ధం చేస్తావా? 
- వైఎస్సార్‌ ఆసరా తీసుకుంటున్న కోటి మంది డ్వాక్రా అక్కచెల్లెమ్మలపై యుద్ధం చేయడమే. 
- వైఎస్సార్‌ చేయూత ద్వారా లబ్ధిపొందుతున్న 28 లక్షల మంది బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనార్టీ అక్క చెల్లెమ్మలపై యుద్ధం చేయడమే. 
- వైఎస్సార్‌ పింఛన్‌ కానుక తీసుకుంటున్న 66 లక్షల మంది అవ్వాతాతలు, వికలాంగులు, వితంతువులపై యుద్ధం చేయడమే. 
- యుద్ధానికి రెడీ అంటున్నావ్‌...ఇదేమీ సినిమా కాదు పవన్‌ కల్యాణ్‌.
- నువ్వు సినిమాల్లో హీరోవి...రాజకీయాల్లో జీరోవి. 

స్కిల్ స్కాంలో పవన్‌ కల్యాణ్‌ కూడా భాగస్వామే!:
- చంద్రబాబు, పవన్‌ కల్యాణ్‌ కలిసి 2014 ఎన్నికల్లో పొత్తు పెట్టుకుని గెలిచిన తర్వాతే కదా స్కిల్‌ స్కాం జరిగింది..
- చంద్రబాబు కొట్టేసిన రూ.371 కోట్లలో నువ్వెంత తీసుకున్నావ్‌ పవన్‌..? 
- ఇది కూడా బయటకు రావాలి. నీకు కూడా దాంట్లో పాత్ర ఉంది. 
- చంద్రబాబు గెలవడానికి నువ్వు సహకరించినప్పుడు నీకు కూడా బాధ్యత ఉంది. 
- రూ.371 కోట్లు అప్పనంగా చంద్రబాబు కొట్టేస్తే, నీవు భాగస్వామిగా ఉన్న టీడీపీ ప్రభుత్వంలో నీకు వాటా లేదంటే రాష్ట్ర ప్రజలు నమ్మాలా? నువ్వు ఆ అవినీతిలో భాగస్వామివి కాదా..?
- మీరు ఇప్పటివరకూ కలిసి లేరా? మీరేమన్నా విడివిడిగా ఉన్నారా? మీది ప్యాకేజీ ఫెవికాల్‌ బంధం అని ప్రజలకు తెలియదా? 
- జైలు లోపలికి వెళ్లి చంద్రబాబును కలిసి వచ్చి కొత్తగా పొత్తు ప్రకటించినట్లు డ్రామాలెందుకు? 

ఢిల్లీ వెళ్లి మీ నాన్న రూ.371 కోట్లు కొట్టేశాడు అని చెప్తావా?:
- గజదొంగేమో లోపలున్నాడు..పిల్ల దొంగ ఢిల్లీ వెళ్లాడు. 
- ఢిల్లీ వెళ్లి ఏం చెబుతావ్‌ లోకేశ్‌..మీ నాన్న స్కిల్‌ స్కాంలో రూ. 371 కోట్లు నొక్కేశాడు అని చెప్తావా? 
- మీ నాన్న అవినీతి చరిత్ర ఏపీ వరకే తెలిసింది..ఇప్పుడు నువ్వెళ్లి మీ నాన్న నిజస్వరూపాన్ని జాతీయ మీడియా ముందు ప్రెజెంటేషన్‌ ఇస్తావా?
- ఢిల్లీ నుంచి లాయర్లను స్పెషల్‌ ఫ్లైట్‌లో పిలిపించుకున్నారు అంటే మీ దగ్గర ఎంత అవినీతి సొమ్ము ఉందో అర్ధం కావాడం లేదా? 
- మీ పాపం పండింది కాబట్టి ఏ రోజుకైనా బాబు బొక్కలోకి వెళ్తాడు అని ప్రజలు భావించారు. 
- ఇప్పటి వరకూ స్టేలతోనే కదా మీరు బతికారు? ఈ రోజుకైనా మీ పాపం పండింది. 
- మీ అవినీతి నిజస్వరూపం బట్టబయలైంది కాబట్టి ఎంత మంది వచ్చి వాదించిన బాబు బొక్కలోకి వెళ్లిపోయాడు. 
- ఢిల్లీలో వాళ్ళ కాళ్ళూ, వీళ్ళ కాళ్ళూ పట్టుకుని, మా నాన్న అడ్డంగా దొరికాడు..మా నాన్నను కాపాడండి అని అడుగుతావా? 
- ఓ పక్క జాతీయ మీడియాని కలుస్తాను అంటాడు..మరో పక్క పెద్దల కాళ్లు పట్టుకునే ప్రయత్నాలు చేస్తున్నాడు. 
- చివరికి  కలిసింది... ఒక బ్రోకర్‌ విగ్గు గాడ్ని. 

యుద్ధం అల్‌ రెడీ మొదలైంది..ఇక మీ పతనమే మిగిలింది:
- మీరు ఎన్ని బుల్డోజర్లు పెట్టి లేపినా మీ అవినీతి చరిత్ర, పవన్‌ ప్యాకేజీ చరిత్ర రాష్ట్ర ప్రజలకు అందరికీ తెలుసు. 
- ఇప్పటికైనా జగన్‌ గారిని చూసి నేర్చుకోండి. దమ్మున్న లీడర్‌ అంటే జగన్‌ గారు. 
- యుద్ధం అల్‌ రెడీ మొదలైంది...మీ పతనం ఆరంభం అయ్యింది..అంతం కూడా కాబోతుంది. 
- 2024 ఎన్నికల్లో చంద్రబాబు, పవన్‌ కల్యాణ్‌..ఇంకా ఎవరు కలిసి వచ్చినా మీ ఓటమి ఖాయం. 
- ప్రజలు టీడీపీ, జనసేనలను గోదావరి, కృష్ణా నదుల్లో ముంచేస్తారు. 
- ఆంధ్రప్రదేశ్‌ చిత్రపటాన్ని ప్రపంచ పటంలో పెడతానన్న చంద్రబాబు స్కిల్డ్ గా అవినీతి చేయడంలో ఈ దేశానికి చూపించాడు. 
- ఏపీలో జరుగుతున్న అభివృద్ధి, సంక్షేమాన్ని జగన్‌ గారు దేశానికి చూపించారు. 
- మిగిలిన రాష్ట్రాల్లో ఉన్న ప్రతి ఒక్క ప్రభుత్వం జగన్‌ గారివైపు చూస్తున్నారు. 
- మిగతా రాష్ట్రాల్లో కూడా ప్రతిఒక్కరూ జగన్‌ గారిలా పరిపాలన చేయాలని కోరుకుంటున్నారు. 
- పరిపాలన ఎలా చేయాలో.. జగన్‌ గారిని చూసి నేర్చుకోండి. 
- మీరు ఎంత మీసాలు మెలేసిన, తొడలు కొట్టినా 2024లో ప్రజలు మిమ్మల్ని శాశ్వతంగా ఇంట్లో కూర్చోబెట్టబోతున్నారు. రాసిపెట్టుకోండి. 

Back to Top