మాజీ మంత్రి జోగిరమేష్ ఇంటి పై టీడీపీ, జనసేన గుండాలు దాడి 

విజ‌య‌వాడ‌:  విజయవాడ న‌గ‌రంలో వైయ‌స్ఆర్‌సీపీ కార్యకర్తలు, నాయ­కులు, సానుభూతిపరుల ఇళ్లు, వాహనాలు, కార్యాల­యాలపై టీడీపీ నాయకులు, కార్యకర్తల దాడులు కొన­సాగుతున్నాయి. అజిత్‌సింగ్‌నగర్‌లోవైయ‌స్ఆర్‌సీపీ కార్యకర్త జహీర్‌బాషాకు చెందిన టైలరింగ్‌ దుకాణాన్ని టీడీపీ కార్యకర్తలు ధ్వంసం చేశారు. ఆదివారం మాజీమంత్రి జోగి ర‌మేష్ ఇంటిపై టీడీపీ, జ‌న‌సేన గుండాలు దాడికి పాల్ప‌డ్డారు. ఇబ్రహీంపట్నం ఫెర్రీ రోడ్డులోని జోగిరమేష్ ఇంటి పై రాళ్లు రువ్విన టీడీపీ , జనసేన అల్లరిమూకలు. AP 39 KD 3267 కారులో వచ్చిన టీడీపీ ,జనసేన అల్లరిమూకలు . జోగిరమేష్ ఇంటిముందే కారు ఆపి తమతో తెచ్చుకున్న రాళ్లను ఇంటి పైకి విసిరిన అల్లరిమూకలు .

రాళ్లు రువ్వుతున్న వారిని అడ్డుకునే ప్రయత్నం చేసిన పోలీస్ కానిస్టేబుల్ . కానిస్టేబుల్ పై తిరగబడ్డ అల్లరిమూకలు .
కానిస్టేబుల్ పట్ల దురుసుగా ప్రవర్తించిన అల్లరిమూకలు
విజయవాడ బుడమేరు వంతెన వద్ద చిరు వ్యాపారస్తుల పై టౌన్ ప్లానింగ్ సిబ్బంది అత్యుత్సాహం.
20 ఏళ్లుగా ఆ ప్రాంతంలో వ్యాపారాలు చేసుకుంటున్న వారి పై టౌన్ ప్లానింగ్ అధికారుల బెదిరింపులు
దుకాణాలు తొలగించేందుకు అర్ధరాత్రి హంగామా సృష్టించిన అధికారులు. దుకాణాలకు కరెంటు కట్ చేసిన అధికారులు
రోడ్డు పై బైఠాయించిన చిరు వ్యాపారులు. బాధితులకు అండగా నిలిచిన వైసీపీ ట్రేడ్ యూనియన్ రాష్ట్ర అధ్యక్షులు పూనూరు గౌతమ్ రెడ్డి
జీవనోపాధి కల్పిస్తున్న దుకాణాలు తొలగించడం దారుణంటూ మండిపాటు. పేద ప్రజల పై కక్ష సాధింపు చర్యలు చేయడం సరైన విధానం కాదు
జెసిబిలతో టౌన్ ప్లానింగ్ అధికారులు, పోలీసులు అర్ధరాత్రి సమయంలో ఇలాంటి చర్యలకు పాల్పడటం దారుణం. క్రిమినల్స్ మీద చర్యలు చేపట్టినట్టు అధికారులు రాత్రి సమయంలో ఇలాంటి దాడులు చేయడం సరైనవి కాదు

Back to Top