అమరావతి: సీఎం వైయస్ జగన్ ప్రతినిధులుగా ఇంటికి వచ్చిన వైయస్ఆర్‌సీపీ ఎమ్మెల్యేలు, నియోజకవర్గాల సమన్వయకర్తలు, సచివాలయాల కన్వీనర్లు, గృహ సారథులు, పార్టీ శ్రేణులు, వలంటీర్లకు ప్రజలు ఆత్మీయ స్వాగతం పలుకుతున్నారు. రెండో రోజు ‘జగనన్నే మా భవిష్యత్తు’ కార్యక్రమం రాష్ట్రవ్యాప్తంగా ఇవాళ ఉదయం నుంచే ప్రారంభమైంది. అన్ని వర్గాల ప్రజల నుంచి ఈ కార్యక్రమానికి విశేష స్పందన లభిస్తోంది. టీడీపీ సర్కార్‌కూ ప్రస్తుత ప్రభుత్వానికి మధ్య ఉన్న తేడాలను వివరిస్తూ కరపత్రాన్ని చదివి వినిపించినప్పుడు.. సీఎం వైయస్ జగన్ ఇచ్చిన మాటను నిలబెట్టుకుని తమతోపాటు అన్ని వర్గాల ప్రజలకు న్యాయం చేశారనే మాట ప్రతి ఇంటా విన్పించింది. గత 46 నెలలుగా సంక్షేమాభివృద్ధి పథకాలతో తమకు అండదండగా సీఎం వైఎస్ జగన్ నిలుస్తున్నారని అవ్వాతాతలు, అక్కాచెల్లెమ్మలు సంతోషం వ్యక్తం చేశారు.
ప్రజా సర్వేలో భాగంగా ప్రజా మద్దతు పుస్తకంలో స్లిప్పులలోని ఐదు ప్రశ్నలను గృహ సారథులు వినిపించినప్పుడు.. వైయస్ జగన్ ప్రభుత్వంతోనే తమకు న్యాయం జరిగిందని, మళ్లీ సీఎంగా వైయస్ జగనే కావాలంటూ సమాధానాలు చెప్పి.. వాటిని నమోదు చేయించి, రసీదు తీసుకున్నారు. రసీదు తీసుకున్నాక గృహ సారథులు అడగక ముందే.. వైఎస్ జగన్ ప్రభుత్వానికి మద్దతు తెలుపుతూ 82960 82960 నంబర్‌కు మిస్డ్ కాల్ ఇచ్చారు. ప్రభుత్వానికి మద్దతు తెలిపినందుకు కృతజ్ఞతలు తెలుపుతూ సీఎం వైఎస్ జగన్ సందేశంతో ఐవీఆర్‌ఎస్ కాల్ రావడంతో సంతోషం వ్యక్తం చేశారు. గృహ సారథుల వద్ద నుంచి వైఎస్ జగన్ ఫొటో ఉన్న స్టిక్కర్లను తీసుకుని.. ఇంటి తలుపునకు, మొబైల్ ఫోన్‌కు అతికించి.. ‘జగనన్నే మా భవిష్యత్’ అంటూ నినదించారు.
రాష్ట్ర వ్యాప్తంగా 175 నియోజకవర్గాల్లో రెండో రోజు ‘జగనన్నే మా భవిష్యత్’ కార్యక్రమం ఈ నెల 7వ తేదీ ప్రారంభమైంది. సచివాలయానికి ముగ్గురు చొప్పున నియమించిన కన్వినర్లు, ప్రతి 50 నుంచి వంద ఇళ్లకు ఇద్దరు చొప్పున నియమించిన గృహ సారథులతో కూడిన ఏడు లక్షల మంది సైన్యం ఈ కార్యక్రమంలో పాల్గొంటుంది. దీనికి సంబంధించి వారికి ప్రత్యేకమైన కిట్ బ్యాగ్‌లు అందచేశారు. ఎమ్మెల్యేలు, సమన్వయకర్తలు ఆయా నియోజకవర్గాల్లో ఈ కార్యక్రమాన్ని సమన్వయం చేస్తారు. 14 రోజులపాటు జరిగే ఈ కార్యక్రమం ద్వారా 15,004 సచివాలయాల పరిధిలో 1.60 కోట్ల కుటుంబాలలోని ఐదు కోట్ల మంది ప్రజలను కలుసుకోనున్నారు.
గత 46 నెలలుగా సంక్షేమాభివృద్ధి పథకాలు, సుపరిపాలన ద్వారా ప్రజలకు చేస్తున్న మేలును వివరించి.. ప్రతిపక్షాలు, ఎల్లో మీడియా సాగిస్తున్న దుష్ఫ్రచారాన్ని తిప్పికొట్టడమే లక్ష్యంగా వైయస్ఆర్‌సీపీ చేపట్టిన ‘జగనన్నే మా భవిష్యత్తు’ కార్యక్రమానికి అన్ని వర్గాల నుంచి మద్దతు వెల్లువెత్తుతోంది.
ఏ ఇంటికి వెళ్లినా ఆత్మీయ పలకరింపులు.. ప్రభుత్వ పనితీరుపై ఎవరిని కదిపినా హర్షాతిరేకాలు.. మళ్లీ జగనన్నే సీఎం కావాలన్నది తమ ఆకాంక్షగా ప్రజా మద్దతు పుస్తకంలో నమోదు చేయాలని అవ్వాతాతలు, అక్కచెల్లెమ్మలు, అన్నదమ్ముల ఆశీర్వచనాలు.. వైయస్ జగన్ ప్రభుత్వానికి మద్దతు తెలుపుతూ ఇంటి తలుపు, మొబైల్ ఫోన్‌కు వైఎస్ జగన్ ఫొటోతో కూడిన స్టిక్కర్‌లను అతికించుకోవడానికి పోటీ పడ్డ అక్కచెల్లెమ్మలు.. 82960 82960 నంబర్‌కు మిస్డ్ కాల్ ఇచ్చి, మద్దతు తెలిపిన వెంటనే సీఎం వైయస్ జగన్ సందేశంతో ఐవీఆర్‌ఎస్ కాల్ రావడంతో కేరింతలు.. వెరసి మా నమ్మకం నువ్వే జగన్.. అంటూ నినాదాలు చేస్తున్నారు.
తిరుపతి జిల్లా:
►"జగన్ అన్నే మా భవిష్యత్తు" కార్యక్రమంలో భాగంగా పిచ్చాటూరు మండలం కీలపూడి గ్రామంలో ఇంటింటికి వెళ్లి జగనన్న సంక్షేమం పథకాలను వివరిస్తూ, తలుపులకు, ఫోన్ లకు జగనన్న స్టిక్కర్ లను అతికించి, సర్వే నిర్వహించిన స్ధానిక ఎమ్మెల్యే కోనేటి ఆదిమూలం, పార్టీ శ్రేణులు, వాలంటీర్లు గృహసారథులు, సచివాలయం కన్వీనర్లు

►కొర్లగుంట మారుతీ నగర్ లో కొనసాగుతున్న ఎమ్మేల్యే భూమన కరుణాకర్ రెడ్డి జగనన్నే మా భవిష్యత్ కార్యక్రమం
►ఇంటి ఇంటికి వెళ్లి ప్రభుత్వ సంక్షేమ పథకాలు పై లబ్ధి దారులనుంచి వివరాలు సేకరిస్తు ప్రజా మద్దతు పుస్తకంలో ఎమ్మెల్యే భూమన నమోదు చేస్తున్నారు. మా నమ్మకం నువ్వే జగన్ స్టిక్కర్ లను ప్రతి ఇంటికీ సంక్షేమ పథకం లబ్ధి దారులు సంతోషంగా అతికిస్తున్నారు
ఎన్టీఆర్ జిల్లా:
చందర్లపాడు మండలం వెలదికొత్తపాలెం గ్రామంలో జగనన్నే మా భవిష్యత్తు కార్యక్రమంలో పాల్గొన్న ఎమ్మెల్యే మొండితోక జగన్ మోహన్ రావు
నెల్లూరు జిల్లా:
ఇందుకూరుపేట (మం) కొత్తూరులో జగనన్నే మా భవిష్యత్తు కార్యక్రమం నిర్వహించిన కోవూరు ఎమ్మెల్యే ప్రసన్న కుమార్ రెడ్డి..ప్రతి ఇంటికి వెళ్లి ప్రభుత్వ సంక్షేమ పథకాలను వివరించి స్టిక్కర్ ను అంటించిన మంత్రి కాకాణి. SPS నెల్లూరు జిల్లా: తేది:07-04-2023 సర్వేపల్లి నియోజకవర్గంలో వెంకటాచలం పంచాయతీ,వడ్డిపాళెం గ్రామంలో "జగనన్నే మా భవిష్యత్తు" కార్యక్రమాన్ని ప్రారంభించిన రాష్ట్ర వ్యవసాయ మరియు సహకార, మార్కెటింగ్, ఫుడ్ ప్రాసెసింగ్ శాఖా మాత్యులు శ్రీ కాకాణి గోవర్థన్ రెడ్డి గారు.
ప్రతి ఇంటికి వెళ్లి బుక్ లెట్, స్టికర్ అందించి రాష్ట్ర ప్రభుత్వం అమలు చేస్తున్న వివిధ సంక్షేమ పథకాల గురించి వివరించిన మంత్రి కాకాణి గోవర్ధన్ రెడ్డి.

విశాఖపట్నం:
గాజువాక 87 వార్డులో జగనన్నే మా భవిష్యత్తు - మా నమ్మకం నువ్వే జగన్ కార్యక్రమం.
ఈ రోజు 87 వార్డు 21086379-గణేష్ నగర్ సచివాలయం పరిధిలోని, కణితి నాయీబ్రాహ్మణ వీధి, ఏకలవ్య వీధి-I, రజకుల వీధిలో వార్డు ఇంచార్జ్ కోమటి శ్రీనివాస రావు ఆధ్వర్యంలో జగనన్నే మా భవిష్యత్తు - మా నమ్మకం నువ్వే జగన్ కార్యక్రమం ప్రారంభించారు.
ఈ సందర్బంగా వై.యస్.ఆర్.సీ.పీ నాయకులు, సచివాలయం కన్వీనర్స్, వాలంటీర్లు, గృహ సారాదులుతో కలిసి ప్రతి ఇంటికి వెళ్లి గత ప్రభుత్వం కంటే మన ప్రభుత్వం ఏ విధంగా మెరుగైన పాలన, సంక్షేమ పథకాలు అందిస్తుందో వివరించారు.
గత ప్రభుత్వం జన్మభూమి కమిటీలతో అవినీతికి, వివక్షతకు పరాకాష్టగా పాలన సాగిస్తే, మన ప్రభుత్వం కులం, మతం, ప్రాంతం, పార్టీలకు అతీతంగా పరిపాలన సాగిస్తుంది అని చెప్పారు.
గత ప్రభుత్వం బి. సీ ల తోకలు కత్తిరిస్తాం, యస్సి లుగా పుట్టాలని ఎవ్వరు అనుకొంటారు అని యస్సి వర్గాలను హేళన చేస్తే, మన ప్రభుత్వం జగనన్న నా బి.సీ, నా యస్సి, నా యస్.టి, నా మైనార్టీలు అని అణగారిన వర్గాలకు అత్యధిక ప్రాధాన్యం ఇస్తున్నారని వివరించారు.
గత ప్రభుత్వం లో చదువులు కేవలం ధనవంతులు కోసమే అయితే , మన ప్రభుత్వం లో ఇంగ్లీష్ మీడియమ్, నాడు -నేడు, అమ్మ వోడి, వసతి దీవెన, విద్యా కానుక, విద్యా దీవెన వంటి సంక్షేమ పథకాలతో చదువుకు పెద్ద పీట వేసింది అని వివరించారు
గత ప్రభుత్వం లో 108 వాహనాలు , ఆరోగ్యశ్రీ మూలన పడితే, మన ప్రభుత్వం లో 17 కొత్త మెడికలు కాలేజీలు, వై. యస్.ఆర్. విలేజ్, అర్బన్ క్లినిక్కులు, ఆరోగ్యశ్రీ తో పేదలకు ఉచిత వైద్యం అందించదని వివరించారు
5. గత ప్రభుత్వం లో సోతింటి కల కలగానే మిగిలిపోతే మన ప్రభుత్వం లో అక్క చెల్లెమ్మలకు 32లక్షలు ఇళ్ల పట్టాలను అందించడమే కాక వాటి నిర్మాణం కూడ పూర్తి చేసే బాధ్యతను మన ప్రభుత్వం తీసుకొందని చెప్పారు.
అనంతరం గత ప్రభుత్వం కంటే మన ప్రభుత్వంలో అన్ని కుటుంబాలకు 1. మంచి జరిగిందా, 2.అన్ని వర్గాలకు వాలంటీర్ల ద్వారా సంక్షేమ పథకాలు అందుతున్నాయా, 3. జగనన్న పాలనలో అమలు చేస్తున్న సంక్షేమ పథకాలను భవిష్యత్తులో కూడ కొనసాగించాలా, 4.జగనన్న పై నమ్మకం ఉంచి మద్దతిస్తారా అని ప్రజలను అడిగి వారి సమాధానాలు, మద్దతు తీసుకోవటం జరిగింది.
ప్రజలు 82960 82960 నంబర్ కి మిస్ కాల్ ఇచ్చి, ప్రభుత్వానికి వారి మద్దతు తెలియజేసారు.