బడుగు, బలహీన వర్గాలకు సీఎం వైయ‌స్ జగన్ పెద్ద పీట‌

హోం మంత్రి మేక‌తోటి సుచరిత 

గుంటూరు: బడుగు, బలహీన వర్గాలవారి అభ్యున్నతికి కృషి చేసిన మహా వ్యక్తి డాక్ట‌ర్ బీఆర్ అంబేద్కర్ అని హోం మంత్రి మేక‌తోటి సుచరిత కొనియాడారు. ఆయన ఆలోచన విధానాలకు అనుగుణంగా సీఎం వైయ‌స్ జగన్ పనిచేస్తున్నారని, బడుగు బలహీన వర్గాలవారికి ముఖ్య‌మంత్రి పెద్ద పీట వేశారన్నారు. డాక్టర్ బీఆర్ అంబేద్కర్ 130వ జయంతిని వాడ వాడలా ఘనంగా జరుపుకుంటున్నామని హోంమంత్రి సుచరిత తెలిపారు. ఈ సందర్భంగా బుధవారం ఆమె మీడియాతో మాట్లాడుతూ .. ప్రతి బిడ్డకు ఉన్నత చదువు అందించాలనే ఉద్దేశంతో విద్య వ్యవస్థలో అనేక మార్పులు తీసుకువచ్చారన్నారు. రాజకీయాలలో కూడా అణగారిన వర్గాల వారికి పెద్ద పీట వేశారని, బడుగు, బలహీన వర్గాలవారి కోసం అనేక సంక్షేమ పథకాలు ప్రవేశపెట్టారని సుచరిత వ్యాఖ్యానించారు.

Back to Top