తెలుగు సాహితీ లోకంలో ప్రజ్వరిల్లిన తేజోమూర్తి గుర్రం జాషువా

వైయ‌స్ఆర్ కాంగ్రెస్ పార్టీ జాతీయ ప్ర‌ధాన కార్య‌ద‌ర్శి విజ‌య‌సాయిరెడ్డి

వైయ‌స్ఆర్‌సీపీ కేంద్ర కార్యాల‌యంలో ఘ‌నంగా జాషువా జ‌యంతి వేడుక‌లు 

 తాడేప‌ల్లి:  మహాకవి, నవయుగ కవి చక్రవర్తి గుర్రం జాషువా జయంతి వేడుకలు తాడేపల్లిలోని వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ కేంద్ర కార్యాలయంలో ఘనంగా జరిగాయి. ఈ సందర్భంగా గుర్రం జాషువా విగ్రహానికి పూలమాలలు వేసి, పార్టీ నేతలు ఘన నివాళులు అర్పించారు.  పార్టీ జాతీయప్రధాన కార్యదర్శి వి.విజయసాయిరెడ్డి ముఖ్యఅతిధిగా పాల్గొనగా, రాష్ర్ట మంత్రులు తానేటి వనిత, అంబటి రాంబాబు, శాసనమండలి ఛీఫ్ విప్ఉ మ్మారెడ్డి వెంకటేశ్వర్లు,విప్జం గా కృష్ణమూర్తి, లేళ్ళ అప్పిరెడ్డి పలువురు పార్టీ నేతలు పాల్గొన్నారు.
    
  ఈ సందర్భంగా పార్టీ జాతీయప్రధాన కార్యదర్శి వి.విజయసాయిరెడ్డి మాట్లాడుతూ... 1895లో గుంటూరు జిల్లా వినుకొండలో (నేటి పల్నాడు జిల్లా) ఆయన  జన్మించడం గుంటూరు జిల్లా ప్రజలందరికి గర్వకారణం అన్నారు. జిల్లా ప్రజలు అదృష్టంగా భావించవచ్చు అన్నారు. 1895 నాటి కాలంలో కులవివక్షతకు వ్యతిరేకంగా,కలమే ఒక ఆయుధంగా తన కవిత్వంతో స్ఫూర్తిని అందించిన వ్యక్తి, మహాకవి గుర్రం జాషువా అని కొనియాడారు. అటు జాతీయోద్యమంలో గాని, సామ్యవాద ఉద్యమంలోగాని ఆయన సమాంతరంగా యుధ్దం చేసి తన కలమే ఆయుధంగా ప్రతి ఒక్కరికీ స్ఫూర్తిని ఇచ్చారన్నారు.

కులవివక్షత సమాజానికి మంచిది కాదని తన కవితల ద్వారా గుర్రం జాషువా చాటిచెప్పారు. కుల వివక్షత పై ఆయన చేసిన పోరాటం.. భవిష్యత్తు తరాలకు కూడా దారి చూపే విధంగా, మార్గదర్శకంగా నిలిచారన్నారు.

      రాష్ర్ట హోంశాఖమంత్రి తానేటి వనిత మాట్లాడుతూ... జాషువాగారు చిన్నతనంలోనే అంటరానితనాన్ని ఎదుర్కొన్నారు. ఈ సమాజంలో సమానత్వాన్ని తీసుకురావడానికి తన కవితలనే ఆయుధంగా మలచిన వ్యక్తి జాషువా అన్నారు. సమాజంలో బడుగు,బలహీనవర్గాల వారికి,మహిళలకు సమానత్వం కోసం కృషి చేసిన వ్యక్తి అని కొనియాడుతూ.. ఎక్కడైతే అవమానాలు పొందారో అక్కడే సత్కారాలు పొందిన వ్యక్తి అని అన్నారు. 

    రాష్ర్ట జలవనరులశాఖమంత్రి  అంబటి రాంబాబు మాట్లాడుతూ... గుర్రం జాషువా జాతి గర్వించదగిన కవి అని అన్నారు. అలాంటి మహానుభావుడు,గొప్ప కవి ,సాహిత్యవేత్త మన వినుకొండ ప్రాంతంలో జన్మించడం అందరికి గర్వకారణం అన్నారు. ఆయన ఆశయాలు,పద్యాలు ప్రజలలోకి చొచ్చుకువెళ్ళాయన్నారు. అవి చాలా అద్బుతంగా ఉంటాయన్నారు.

 శాసనమండలిలో  ఛీఫ్ విప్ఉ మ్మారెడ్డి వెంకటేశ్వర్లు మాట్లాడుతూ... గుర్రం జాషువా జయంతి వారోత్సవాల సందర్భంగా ఆయనకు ఘననివాళులు అర్పిస్తున్నానన్నారు. ఆయనతో వ్యక్తిగత సాన్నిహిత్యం ఉండటం నా అదృష్టం అన్నారు. జాషువా ఎంచుకున్న కవిత్వం సమాజంలో ఉన్న అన్నివర్గాలలో సమతుల్యత ఉండాలనేది ఆయన భావం. తన రచనల ద్వారా, ప్రతిభ ద్వారా సమాజానికి తానేంటో చెప్పారన్నారు. సమాజం గర్వించదగ్గ రచనలు చేశారు. అంబేద్కర్,జాషువా గార్లు కోరుకున్న విధంగా ఎస్సిఎస్టి బిసిలకు సమాజంలో ఓ స్ధాయి తీసుకురావాలనే వారి ఆశయాలను ముఖ్యమంత్రి శ్రీ వైయస్ జగన్ ముందుకు తీసుకువెళ్తున్నారన్నారు.

శాసనమండలిలో విప్డొ క్కా మాణిక్యవరప్రసాద్ మాట్లాడుతూ... సమసమాజాన్ని ఆశించిన వ్యక్తి శ్రీ గుర్రం జాషువా అని అన్నారు. విశ్వనరుడను తాను అని గర్వంగా చెప్పారన్నారు. జాషువాగారి పద్యాలను పామరులు కూడా పాడుకుంటున్నారంటే ఆయన పద్యాన్ని ఎంతగా ప్రజలలోకి తీసుకువెళ్ళారో తెలుసుకోవాలన్నారు. ఏ సిధ్దాంతాలు ఆచరించారు,ఏం చెప్పారనేది  తెలుసుకోవాల్సిన అవసరం ఉందని అన్నారు.తెలుగుభాష బతకాలంటే జాషువాగారి పద్యాలను ప్రచారం చేయాలన్నారు.

ఈ కార్యక్రమంలో  ఎంఎల్ఏలు అనంతవెంకటరామిరెడ్డి,హఫీజ్ ఖాన్,శాసనమండలి సభ్యులు
మొండితోక అరుణ్ కుమార్,శ్రీమతి కల్పలతారెడ్డి, విజయవాడ నగర మేయర్ భాగ్యలక్ష్మి,ఎస్సి కార్పోరేషన్ ఛైర్మన్ కొమ్మూరి కనకారావు మాదిగ, పార్టీ అధికారప్రతినిధులు శ్రీ  నారాయణమూర్తి,శ్రీ కె.రవిచంద్రారెడ్డి,శివశంకర్,గ్రంధాలయసంస్ధ ఛైర్మన్ శ్రీ మందపాటి శేషగిరిరావు,పార్టీ కార్యకర్తల సమన్వయకర్త శ్రీ పుత్తాప్రతాప్ రెడ్డి,జిడిసిబ్యాంక్ ఛైర్మన్ ఆర్ రామాంజనేయులు పలువురు పార్టీ నేతలు,అనుబంధవిభాగాలనేతలు తదితరులు పాల్గొన్నారు.

 

తాజా వీడియోలు

తాజా ఫోటోలు

Back to Top