నిమ్మగడ్డ టీడీపీ కార్యకర్తలా వ్యవహరించలేదా?

రహస్యభేటీని వర్లరామయ్య ఎందుకు భుజానికెత్తుకున్నారు?

ట్విట్ట‌ర్‌లో ప్ర‌భుత్వ స‌ల‌హాదారు స‌జ్జ‌ల రామ‌కృష్ణారెడ్డి ప్ర‌శ్న‌

తాడేప‌ల్లి: ‌పార్కు హ‌య‌త్ హోటల్‌లో సుజ‌నా చౌద‌రి, నిమ్మ‌గడ్డ ర‌మేష్‌కుమార్‌, కామినేని శ్రీ‌నివాస్‌ల ర‌హ‌స్య‌భేటీపై ప్ర‌భుత్వ స‌ల‌హాదారు స‌జ్జ‌ల రామ‌కృష్ణారెడ్డి ట్విట్ట‌ర్ వేదిక‌గా ప్ర‌శ్న‌లు సంధించారు.  `తాడిచెట్టు ఎందుకు ఎక్కావు అంటే దూడ గడ్డికోసం అన్నాడో ప్రబుద్ధుడు. స్టార్‌ హోటళ్లో ఎందుకు కలిశారంటే ఆ ముగ్గురూ చెప్తున్న సమాధానాలు ఇలానే ఉన్నాయి. నిమ్మగడ్డ 6వ ఫ్లోర్‌ వరకూ లిఫ్టులో వెళ్లి అక్కడనుంచి 8వ లిఫ్టు వరకూ నడుచుకుని వెళ్లి వారితో ఎందుకు భేటీ అయ్యారు?`

`సుజనా, కామినేని బీజేపీ మనుషులన్న టీడీపీ, కేంద్రానికి విజ్ఞాపనపత్రం తయారుచేయడానికే మీటింగు పెట్టుకున్నారంటూ ఈ రహస్యభేటీని టీడీపీ నేత‌ వర్లరామయ్య తన భుజాలమీదకు ఎందుకు ఎత్తుకున్నారు? ఇలాంటి పన్నాగాలు చేసే నిమ్మగడ్డ నిష్పక్షపాతంగా ఎలా ఉంటారు?`

`బీజేపీ ముసుగు వేసుకున్న టీడీపీ నాయకులతో భేటీ కుమ్మక్కు కాదా? స్థానిక ఎన్నికల్లో నిమ్మగడ్డ టీడీపీ కార్యకర్తలా వ్యవహరించలేదా? స్టార్‌ హోటల్‌ వ్యవహారాన్ని కోర్టుల ముందుకు తీసుకెళ్లాల్సిన అవసరం లేదంటారా?` అని స‌జ్జ‌ల రామ‌కృష్ణారెడ్డి ట్వీట్ చేశారు. 

తాజా ఫోటోలు

Back to Top