ఆత్మహత్య చేసుకున్న నేతన్న కుటుంబాలకు అండగా..

తాడేపల్లి: ముఖ్యమంత్రి వైయస్‌ జగన్‌ నేతన్న కుటుంబాలకు అండగా నిలిచారు. పాదయాత్రలో ప్రజల కష్టాలు తెలుసుకున్న సీఎం వైయస్‌ జగన్‌ మేనిఫెస్టోలో ఇచ్చిన హామీలే కాకుండా చెప్పనివి కూడా అమలు చేస్తున్నారు. గత టీడీపీ ప్రభుత్వ హయాంలో ఆత్మహత్యలు చేసుకున్న నేతన్నల కుటుంబాలకు పరిహారం అందించేందుకు వైయస్‌ జగన్‌ ప్రభుత్వం జీవో జారీ చేసింది. అనంతపురం జిల్లా ధర్మవరం నియోజకవర్గంలో ఆత్మహత్య చేసుకున్న నేతన్నల కుటుంబాలకు పరిహారం అందనుంది. ఇప్పటికే వైయస్‌ఆర్‌ నేతన్న నేస్తం పథకం కింద ప్రతి చేనేత కుటుంబానికి రూ. 24 వేల సాయం అందిస్తున్న విషయం తెలిసిందే. 
 

Back to Top