గండి వీరాంజనేయస్వామి ఆలయంలో వైయస్‌ జగన్‌ ప్రత్యేక పూజలు

వైయస్‌ఆర్‌జిల్లా:వైయస్‌ జగన్‌మోహన్‌ రెడ్డి గండి వీరాంజనేయస్వామి ఆలయానికి చేరుకున్నారు. ఆలయ పూజరులు ఘన స్వాగతం పలికారు. ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. వైయస్‌ జగన్‌ అభిమానులు భారీ సంఖ్యలో ఆలయానికి చేరుకున్నారు. సీఎం అంటూ నినాదాలు చేశారు.

ఉదయం పులివెందుల సీఎస్‌ఐ చర్చిలో కుటుంబసభ్యులతో బాటు వైయస్‌ జగన్‌ ప్రత్యేక ప్రార్థనలు  నిర్వహించిన వైయస్‌ జగన్‌ గండి ఆంజనేయస్వామి ఆలయానికి చేరుకున్నారు. దారి పొడవునా అభిమానలు, ప్రజలు వైయస్‌ జగన్‌కు తమ సమస్యలు చెప్పుకున్నారు. గండి వీరాంజనేయ స్వామి ఆలయం నుంచి ఇడుపులపాయకు చేరుకుని దివంగత ముఖ్యమంత్రి వైయస్‌ రాజశేఖర్‌ రెడ్డి ఘాట్‌ వద్ద నివాళర్పిస్తారు.

Back to Top