చిన్నారికి జ‌గ‌న్ నామ‌క‌ర‌ణం

గ‌డ‌ప గ‌డ‌ప‌కు మ‌న ప్ర‌భుత్వం కార్య‌క్ర‌మంలో నామ‌క‌ర‌ణం చేసిన హోం మంత్రి సుచ‌రిత 
 

అమ‌రావ‌తి:  సీఎం వైయ‌స్ జ‌గ‌న్ మోహ‌న్ రెడ్డి ఆదేశాల‌తో రాష్ట్ర‌వ్యాప్తంగా గ‌డ‌ప గ‌డ‌ప‌కు మ‌న ప్ర‌భుత్వం కార్య‌క్ర‌మం ఉత్సాహంగా సాగుతోంది. ఎమ్మెల్యేలు, పార్టీ నియోజ‌క‌వ‌ర్గ స‌మ‌న్వ‌య‌క‌ర్త‌లు, అధికారులు ఇంటింటా ప‌ర్య‌టిస్తున్నారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యేల‌కు ప్ర‌తి చోటా ఆత్మీయ స్వాగ‌తం ల‌భిస్తోంది. మూడున్న‌రేళ్ల‌లో వైయ‌స్ జ‌గ‌న్ మోహ‌న్ రెడ్డి ప్ర‌భుత్వం అందిస్తున్న సంక్షేమ ప‌థ‌కాల‌ను వివ‌రిస్తూ, స్థానికంగా ఉన్న స‌మ‌స్య‌ల‌ను అడిగి తెలుసుకుంటున్నారు. అక్క‌డిక్క‌డే స‌మ‌స్య‌ల‌ను ప‌రిష్క‌రిస్తూ ప్ర‌జ‌ల మ‌న్న‌న‌లు పొందుతున్నారు. ఈ క్ర‌మంలో రెండు నెలల అబ్బాయికి జగన్ అని  హోంమంత్రి  తానేటి వనిత నామకరణం చేశారు. ఈ అపురూప సంఘటన చాగల్లు మండలం దారవరం గ్రామంలో జరిగింది. పసివేదుల గ్రామానికి చెందిన పుచ్చకాయల బంగార్రాజు, వినోదిని దంపతులకు రెండు నెలల క్రిత్తం అబ్బాయి పుట్టాడు. పుట్టింటికి వచ్చిన వినోదిని గడప గడపకు మన ప్రభుత్వం కార్యక్రమంలో పర్యటిస్తున్న హోంమంత్రిని కలిశారు. తమ అబ్బాయికి నామకరణం చేయాలని చిన్నారి తల్లిదండ్రులు హోం మినిస్టర్ వనితని కోరారు. ఈ నేపథ్యంలో చిన్నారి బాబుకు జగన్ అని హోంమంత్రి  నామకరణం చేశారు. సీఎం వైయ‌స్ జగన్ గారిని ఎంతో అభిమానిస్తామని, ఆయన పేరును తమ అబ్బాయికి పెట్టినందుకు సంతోషంగా ఉందని బంగార్రాజు, వినోదిని దంపతులు సంతోషం వ్య‌క్తం చేశారు.

Back to Top