పల్నాడు : వినుకొండ మండలం ఉమ్మడివరం గ్రామానికి చెందిన వైయస్ఆర్‌సీపీ కార్యకర్త షేక్ రఫీని గత కొన్ని రోజులుగా పోలీసులు వేధింపులకు గురి చేస్తుండటంతో పురుగుల మందు తాగి ఆత్మహత్యాయత్నానికి పాల్పడ్డాడు. వైయస్ఆర్‌సీపీ కార్యకర్తగా ఉంటూ..గ్రామంలో ప్రజా సమస్యలపై ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తుండటంతో టీడీపీ నాయకులు పోలీసుల ద్వారా వేధింపులకు పాల్పడ్డారు. పోలీసులు నిరంతరం స్టేషన్‌కు పిలిపించి, మానసికంగా వేధించి, దారుణంగా కొట్టారని ఆరోపణలు ఉన్నాయి. ఇటీవల రఫీని ఎస్ ఐ సత్యనారాయణ పోలీసు స్టేషన్‌కు పిలిపించి దారుణంగా అవమానించి చిత్రహింసలకు గురిచేశారని, టీడీపీ నాయకుల కాళ్లు పట్టించి క్షమాపణ అడగమని చెప్పినట్లు రఫీ వెల్లడించారు. వేధింపుల కారణంగానే రఫీ మనస్తాపానికి గురై, పురుగుల మందు తాగి ఆత్మహత్యాయత్నానికి పాల్పడ్డాడు. విషయం తెలుసుకున్న వినుకొండ మాజీ శాసనసభ్యులు బొల్లా బ్రహ్మనాయుడు హాస్పిటల్ లో చికిత్స పొందుతున్న రఫీని పరామర్శించారు. వైయస్ఆర్‌సీపీ ప్రభుత్వంలో ఇలాంటి సంఘటనలు ఎప్పుడు జరగలేదు. ఇప్పుడు పేదవాడిని ఇబ్బందులకు గురిచేస్తున్నారంటూ మాజీ ఎమ్మెల్యే మండిపడ్డారు. రఫీకి న్యాయం జరగాలని, కోర్టు ద్వారా ప్రవేట్ కేసు వేసి రఫీ కుటుంబానికి వైయస్ఆర్‌సీపీ అన్ని విధాలుగా అండగా ఉంటుంది బ్రహ్మనాయుడు భరోసా కల్పించారు.