దెందులూరులో జనసునామీ చూడబోతున్నారు

మాజీ మంత్రి పేర్ని నాని

ఏలూరు సిద్ధం స‌భ‌కు కార్య‌క‌ర్త‌ల‌తో క‌లిసి త‌ర‌లివెళ్లిన ఎమ్మెల్యే పేర్ని నాని

 కృష్ణా జిల్లా: దెందులూరులో నిర్వ‌హిస్తున్న సిద్ధం స‌భ‌లో జనసునామీ చూడబోతున్నారని మాజీ మంత్రి పేర్ని నాని పేర్కొన్నారు. చంద్రబాబునాయుడు కృష్ణా, తూర్పుగోదావరి జిల్లాల్లో ఐదు ఎకరాల్లోనే సభలు పెడుతుంటే జనం రాని పరిస్థితి ఉందని, కానీ వైయ‌స్ఆర్‌  కాంగ్రెస్‌ పార్టీ ఒకే ఒక పిలుపుతో 110 ఎకరాల్లో జరిగే సభకు లక్షలాది మంది తరలిరానున్నారని చెప్పారు. శ‌నివారం మచిలీపట్నం నుంచి కార్యకర్తలతో కలిసి ఏలూరు సభకు పేర్నినాని బ‌య‌లుదేరారు. ఈ సంద‌ర్భంగా ఆయ‌న మాట్లాడుతూ..వైయ‌స్ఆర్ కాంగ్రెస్‌ పార్టీ ఎన్నికల శంఖారావం సభకు పార్టీ శ్రేణులు వేలాదిగా త‌ర‌లివెళ్తున్నార‌ని చెప్పారు. ఉభయగోదావరి జిల్లాలతో పాటు కృష్ణా జిల్లాలోని ఆయా నియోజకవర్గాల నుంచి పార్టీ శ్రేణులు సభకు తరలిరానున్న క్రమంలో ఆ మేరకు భారీగా ఏర్పాట్లు చేశామ‌న్నారు. 110 ఎకరాల సువిశాల ప్రాంగణంలో బహిరంగ సభ జరగనుంద‌ని చెప్పారు.


ఏలూరు ఆటోనగర్, దెందులూరు సమీపంలోని సహారా గ్రౌండ్స్‌లో బహిరంగ సభ వేదిక పనులు ప‌క‌డ్బందీగా చేప‌ట్టార‌ని తెలిపారు. భారీ సభా వేదిక నిర్మాణం, పదుల సంఖ్యలో గ్యాలరీల ఏర్పాటు, పార్టీ శ్రేణులందరి దగ్గరకు వచ్చి అభివాదం చేసేందుకు వీలుగా పార్టీ గుర్తయిన ‘ఫ్యాన్‌’ ఆకారంలో భారీ వాక్‌వేను ఏర్పాటు చేశామ‌ని వివ‌రించారు.  లక్షలాది మందితో నిర్వహిస్తున్న బహిరంగ సభ కావడంతో జాతీయ రహదారిపైన ఎలాంటి ఇబ్బందులూ లేకుండా ముందస్తుగా అన్ని ఏర్పాట్లూ చేశారని తెలిపారు. ఎన్నికలకు సీఎం వైయ‌స్  జగన్‌మోహన్‌రెడ్డి సిద్ధమంటే రాష్ట్ర ప్రజలు సంసిద్ధంగా ఉన్నారని పేర్ని నాని పేర్కొన్నారు.

Back to Top