విజయవాడ: గుడివాడ ప్రజల తాగునీటి అవసరాలు, నివాస స్థలాల కోసం టీడీపీ హయాంలో ఒక్క ఎకరా సేకరించారా మాజీ మంత్రి కొడాలి నాని ప్రశ్నించారు. టీడీపీ హయాంలో ఒక్క ఎకరా సేకరించినట్లు నిరూపిస్తే రాజకీయాల నుంచి తప్పుకుంటానని గుడివాడ ఎమ్మెల్యే సవాలు విసిరారు. ముఖ్యమంత్రులుగా వైయస్ రాజశేఖరరెడ్డి, వైయస్ జగన్ మోహన్ రెడ్డి గుడివాడ ప్రజల అవసరాల కోసం 625 ఎకరాల భూములు కొన్నారని వెల్లడించారు. గుడివాడలో తన బంధువులు ఉన్నారని చెప్పుకునే చంద్రబాబు 14 ఏళ్లు సీఎంగా ఉండి ఏం చేశారని ప్రశ్నించారు. కృష్ణా జిల్లా గుడివాడలో ముస్లిం సంచారజాతుల బీసీ(ఈ) కుల ధ్రువీకరణ పత్రాల పంపిణీ కార్యక్రమంలో కొడాలి నాని పాల్గొని.. ముస్లిం సోదరులకు ధ్రువీకరణ పత్రాలు పంపిణీ చేశారు.. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. గుడివాడ గురించి చంద్రబాబు, టీడీపీ పకోడీగాళ్లు ఇష్టం వచ్చినట్లు మాట్లాడుతున్నారు. గుడివాడ నియోజకవర్గ ప్రజల తాగునీటి అవసరాలు, నివాస స్థలాల కోసం టీడీపీ హయంలో ఒక్క ఎకరా సేకరించినట్లు నిరూపిస్తే ఎన్నికల్లో పోటీ చేయకుండా, రాజకీయాలనుండి తప్పుకుంటానని ఛాలెంజ్ చేశారు.. సీఎంలుగా వైయస్ఆర్, వైఎస్ జగన్.. గుడివాడ ప్రజల అవసరాల కోసం 625 ఎకరాల భూములు కొన్నారు. గుడివాడలో తన బంధువులు ఉన్నారని చెప్పుకునే చంద్రబాబు… 14ఏళ్లు సీఎంగా ఉండి ఏం చేశాడు..? అని నిలదీశారు. ప్రజలను ఆత్మబంధువులుగా చూసే వైయస్ జగన్.. గుడివాడ అభివృద్ధి, ప్రజా సంక్షేమానికి రూ.4 వేల కోట్లు ఖర్చు చేశారని తెలిపారు. రామాయణంలో పిడకల వేటలా పనికిమాలిన టీడీపీ, జనసేన నేతలు రోడ్లపైకి వస్తున్నారు. ధనికుల కార్లు బ్రేకులు వేయకుండా రోడ్లపై తిరగాలనే ప్రతిపక్షాలు ఆరాటపడుతున్నాయని మండిపడ్డారు. ప్రతి పేద వాడిని ఆత్మబంధువుగా చూసే వైయస్ జగన్ వాళ్ల అవసరాలు తీర్చేందుకు అధిక ప్రాధాన్యమిస్తున్నారు. చంద్రబాబు మాదిరి ఒక్క విడత ఏదైనా పథకం ఆపితే రోడ్ల సమస్యను పరిష్కరించవచ్చని సీఎం వైయస్ జగన్ కు తాము చెప్పాం అన్నారు. ప్రాణం పోయినా ప్రజలకు ఇచ్చిన మాటను తప్పనని సీఎం వైయస్ జగన్ చెప్పారు… త్వరలో రాష్ట్రంలోని రోడ్ల సమస్య పరిష్కారం అవుతుంది. గత ప్రభుత్వాలకు భిన్నంగా, సచివాలయ వ్యవస్థ ద్వారా ఇళ్లవద్దే 99 శాతం కుటుంబాల సమస్యలు పరిష్కారమవుతున్నాయని మాజీ మంత్రి కొడాలి నాని పేర్కొన్నారు.