సంక్షేమంలో వైయస్‌ జగన్‌ను విమర్శించే అర్హత టీడీపీకి లేదు

రుణమాఫీ పేరుతో చంద్రబాబు మోసం 

మాజీ మంత్రి కన్నబాబు

అమరావతి: సంక్షేమంలో ముఖ్యమంత్రి వైయస్‌ జగన్‌ మోహన్‌ రెడ్డిని విమర్శించే అర్హత టీడీపీకి లేదని మాజీ మంత్రి కన్నబాబు అన్నారు. సంక్షేమ పథకాల అమలుపై దమ్ముంటే చర్చకు రావాలని కన్నబాబు సవాలు విసిరారు.  మంగళవారం సభలో కన్నబాబు మాట్లాడారు. రైతు రుణమాఫీ చేస్తామని రూ.15 వేల కోట్లు ఇవ్వకుండా మోసం చేసిన బ్యాచ్‌ ఇది. పొదుపు మహిళల రుణాలు మాఫీ చేస్తామని మాయ చేశారు..చివరకు ఎన్నికల సమయంలో పసుపు–కుంకుమ అంటే ..తిరిగి వాళ్లకే ప్రజలు బోట్లు, పంగనామాలు పెట్టారు. అన్నా క్యాంటీన్‌ గురించి వీళ్లు మాట్లాడుతున్నారు. అదేదో గొప్ప ప్రాజెక్టు అన్నట్లుగా కలగలిపి తీసుకొచ్చినట్లు మాట్లాడుతున్నారు. టీడీపీ నాయకులు కొన్ని చోట్ల అన్నా క్యాంటీన్లు నిర్వహిస్తుంటే..అక్కడ ఎవరిదైనా బర్త్‌డేలు, లేదా ఎవరైనా చనిపోతే దినం పేరుతో ఆ రోజు భోజనాలు పెట్టి దాన్ని అన్నా క్యాంటీన్‌ అన్నట్లుగా టీడీపీ నేతలు బిల్డప్‌ ఇస్తున్నారు. సంక్షేమంలో వైయస్‌ జగన్‌మోహన్‌రెడ్డికి పేరు పెట్టే మగాడు టీడీపీలో ఎవరూ లేరు. చేయలేక, చేతలేక తోక ముడిచి పారిపోయిన బ్యాచ్‌ వీళ్లు. రమ్మనండి..సరైన ఫార్మెట్లో రండి సభలో చర్చిద్దాం. ప్రతి గడపకు, తెలుగు దేశం కండువాలు వేసుకుని తిరుగుతున్న ఇళ్లకు కూడా వాలంటీర్ల ద్వారా సంక్షేమ పథకాలు అందజేస్తున్నాం. పార్టీ పెట్టిన ఎన్టీఆర్‌ నుంచి కార్యకర్తల వరకు ఎంత మందిని నయవంచన చేశారో..అలాంటి వాళ్లు ఇవాళ సిగ్గులేకుండా మాట్లాడుతున్నారు. టీడీపీ సంక్షోభంలో ఉండబట్టే ఇవాళ నారా హమారా అంటూ ఉద్యమాలు చేస్తున్నారు. అమరావతిలో రైతులను రెచ్చగొట్టి రోడ్ల మీద తిరుగుతున్నారు. ఈ హౌస్‌కు రానని దొడ్డిదారి వెతుక్కొని దొంగ ఏడ్పులు ఏడ్చి పారిపోయాడు. వీళ్లు వచ్చి ఇవాళ ఏదేదో మాట్లాడుతున్నారు. సంక్షేమం సంక్షోభంలో పడిందని ఏవేవో మాట్లాడుతన్నారు. మా ముఖ్యమంత్రికి వంక పెట్టి విమర్శిస్తే ప్రజలు నవ్వుతారని టీడీపీ నేతలు గుర్తుంచుకోవాలని కన్నబాబు సూచించారు.
 

తాజా వీడియోలు

Back to Top