ఆర్గనైజ్డ్‌ క్రైమ్‌ చేయడంలో చంద్రబాబు దిట్ట

మాజీ మంత్రి గుడివాడ అమర్‌నాథ్‌ ఫైర్‌

అధికారం కోసం ఎంత నీచానికైనా దిగజారుతాడు

ఆ దిశలోనే విశాఖ షిప్‌ కంటెయినర్‌పై విష ప్రచారం

అందులో ఎలాంటి డ్రగ్స్‌ లేవని సీబీఐ తేల్చి చెప్పింది

గుర్తు చేసిన మాజీ మంత్రి గుడివాడ అమర్‌నాథ్‌

విశాఖ వచ్చిన షిప్‌ కంటెయినర్‌పై సీబీఐ క్లీన్‌చిట్‌

ఆ షిప్‌లో ఎలాంటి డ్రగ్స్‌ లేవని సీబీఐ ప్రకటన

అదే విషయాన్ని మేము తొలి నుంచి చెబుతున్నాం

అయినా విశాఖ బ్రాండ్‌ ఇమేజ్‌ దెబ్బతీసేలా ప్రచారం

రాష్ట్ర ప్రభుత్వాన్ని అప్రతిష్టపాల్జేసేలా విష ప్రచారం

మా పార్టీకి, విశాఖ ప్రజలకు వెంటనే క్షమాపణలు చెప్పాలి

మాజీ మంత్రి గుడివాడ అమర్‌నాథ్‌ డిమాండ్‌

డ్రగ్స్‌ కంటెయినర్‌ షిప్‌ అంటూ నాడు దుష్ప్రచారం

25 కేజీల డ్రగ్స్‌తో విశాఖకు షిప్‌ వచ్చిందని విమర్శ

గత ఎన్నికల ముందు ప్రభుత్వంపై నిందల పర్వం

లేని డ్రగ్స్‌ ఉన్నాయంటూ, ప్రభుత్వానికి ముడి పెట్టారు

అదే పనిగా ఎల్లో మీడియాలో కథనాలు వండి వార్చారు

అలా గత ఎన్నికల్లో లబ్ధి పొందేలా చంద్రబాబు కుట్ర

మాజీ మంత్రి గుడివాడ అమర్‌నాథ్‌ స్పష్టీకరణ

సీబీఐ దర్యాప్తు తీరుపై మాకు పలు అనుమానాలు

డ్రగ్స్‌పై విచారణకు ఇంత సమయం ఎందుకు?

ఏకంగా 8 నెలల పాటు ఏ దర్యాప్తు, ఎలా చేశారు? 

నాడు డ్రగ్స్‌ ఉన్నాయన్న, సీబీఐ ఇప్పుడెలా లేవంది?

ఇదంతా ఒక కుట్ర, కుతంత్రం కాదా?

కూటమికి లబ్ధి చేకూర్చడంలో సీబీఐ భాగస్వామ్యం ఉందా? 

మా అనుమానాలకు చంద్రబాబు, సీబీఐ సమాధానం చెప్పాలి

ప్రెస్‌మీట్‌లో మాజీ మంత్రి గుడివాడ అమర్‌నాథ్‌ నిలదీత

విశాఖపట్నం: ఈ ఏడాది మార్చి 21న, ఒక షిప్‌ కంటెయినర్‌ 25 వేల కేజీల డ్రగ్స్‌తో విశాఖ పోర్టుకి వచ్చిందని, దాన్ని వైయ‌స్ఆర్‌సీపీ నాయకులే తెప్పించారని గత ఎన్నికల ప్రచారంలో చంద్రబాబు, పవన్‌కళ్యాణ్‌తో పాటు, టీడీపీ నాయకులు అదే పనిగా తప్పుడు ప్రచారం చేశారు. కానీ ఆ కంటెయినర్‌లో ఎలాంటి డ్రగ్స్‌ లేవని, అది కేవలం డ్రై ఈస్ట్‌ అని సీబీఐ ప్రకటించింది. ఇదంతా చూస్తుంటే, నాడు ఒక వ్యూహం ప్రకారం ప్రభుత్వాన్ని అప్రతిష్టపాల్జేయడం, డ్రగ్స్‌ పేరుతో విశాఖ బ్రాండ్‌ ఇమేజ్‌ దెబ్బతీయాలని కుట్ర చేసినట్లుగా ఉందని, విశాఖలో మీడియాతో మాట్లాడిన మాజీ మంత్రి గుడివాడ అమర్‌నాథ్‌ వెల్లడించారు. 

 నాడు సీబీఐ ఏం చెప్పింది?:
– దేశంలోకి డ్రగ్స్‌ రాకుండా నిలువరించేందుకు కేంద్ర ప్రభుత్వ నిఘా సంస్థ సీబీఐ కింద పని చేసేలా ‘ఆపరేషన్‌ గరుడ’ పేరుతో ఒక సంస్థను ఏర్పాటు చేశారు. ఆ క్రమంలో బ్రెజిల్‌ నుంచి విశాఖకు వచ్చిన ఒక షిప్‌ కంటెయినర్‌లో, తమకు అందిన సమాచారం మేరకు 25 వేల కేజీల డ్రై ఈస్ట్లో నార్కోటిక్స్‌ అవశేషాలు ఉన్నట్లు అనుమానంగా ఉందని, సీబీఐ ఈ ఏడాది మార్చి 21న, ఒక ప్రకటన చేసింది.

ఎన్నికల్లో లబ్ధి కోసం టీడీపీ:
– సీపీబీ ప్రకటనతో రెచ్చిపోయిన టీడీపీ ఇష్టానుసారం ఆరోపణలు చేసింది. ఆ కంటెయినర్‌ను అధికార వైయస్సార్‌సీపీ నాయకులే తెప్పించారని, అందులో ఉన్న డ్రగ్స్‌ అమ్మి, ఆ సొమ్ముతో ఎన్నికల్లో ఓట్లు కొంటారని తమ అనుకూల ఎల్లో మీడియాలో అదే పనిగా విష ప్రచారం చేశారు.
– మేము దాన్ని ఆరోజే ఖండించాం. అసలు ఆ కంటెయినర్‌కు తమకే మాత్రం సంబంధం లేదని స్పష్టం చేశాం. అందులో డ్రగ్స్‌ లేవని, మెడికల్, ఆక్వా ఫీడ్‌కు సంబంధించిన మెటేరియల్‌ ఉండొచ్చని చెప్పాం.  అదే విషయాన్ని ఈరోజు సీబీఐ తేల్చింది. నాడు విశాఖకు వచ్చిన షిప్‌ కంటెయినర్‌లో ఎలాంటి డ్రగ్స్‌ లేవని సీబీఐ ప్రకటించింది.
– ఆనాడు అంత దుష్ప్రచారం చేసిన టీడీపీ, ఇప్పుడు సీబీఐ ప్రకటన తర్వాత నోరెత్తడం లేదు. ఎల్లో మీడియా దాన్ని పట్టించుకోవడం లేదు. కనీసం వార్తగా రాయడానికి కూడా వారికి మనసు రావడం లేదు.
– రాజకీయ అవసరాల కోసం, ఎలాగైనా అధికారంలోకి రావాలనే తపనతో దేశంలోనే శక్తివంతమైన నగరంగా అభివృద్ధి చెందుతున్న విశాఖ బ్రాండ్‌ ఇమేజ్‌ దెబ్బ తీయడానికి కూడా కూటమి నాయకులు నాడు వెనుకాడలేదు. 

చంద్రబాబు ఆర్గనైజ్డ్‌ క్రైమ్‌:
– నాడు ఎన్టీఆర్‌ను సీఎం పదవి నుంచి దించేయడం మొదలు మొన్న ఎన్నికల్లో గెలిచే వరకు.. చంద్రబాబు ప్రతి చర్యా ఒక వ్యవస్థీకృత నేరం (ఆర్గనైజ్డ్‌ క్రైమ్‌). 
– అసత్య ఆరోపణలు చేయడం, దాన్ని తన అనుకూల మీడియాలో అదే పనిగా ప్రచారం చేయడం, మళ్లీ దానిపై పార్టీ నేతలతో మాట్లాడించడం, మళ్లీ మీడియాలో చర్చలు పెట్టడం.. ఆ విధంగా తన టార్గెట్‌ ప్రతిష్ట దెబ్బ తీయడం. రాజకీయంగా వారికి నష్టం కలగచేయడం. ఇదీ చంద్రబాబు వ్యవస్థీకృత నేర విధానం. అందుకు ఎన్నో ఉదాహరణలు.
ఉదా:
ఇదే విశాఖ వచ్చిన షిజ్‌ కంటెయినర్‌ విషయం చూస్తే..
– ఈ ఏడాది మార్చి 16న కేంద్ర ఎన్నికల సంఘం ఎన్నికల షెడ్యూల్‌ ప్రకటిస్తే.. అదే రోజు విశాఖ వచ్చిన షిప్‌ కంటెయినర్‌పై.. 5 రోజుల తర్వాత, అంటే మార్చి 21న సీబీఐ ప్రెస్‌ రిలీజ్‌ వచ్చింది. 
– ఆ వెంటనే టీడీపీ అనుకూల పత్రికలు, టీవీలు ఒక పథకం ప్రకారం డ్రగ్స్‌ అంటూ విష ప్రచారం చేశాయి. అలా వైయస్సార్‌సీపీ ప్రభుత్వంపై బురద జల్లడమే పనిగా వ్యూహం రచించారు. 
– సీఎం జగన్‌ సూచనతో వైయస్సార్‌సీపీ నాయకులు ఆ డ్రగ్స్‌  తెప్పించారని, దాని విలువ లక్ష కోట్లు ఉంటుందని, దాన్ని తెరవకుండా అధికార పార్టీ నాయకులు ఒత్తిడి తెస్తున్నారని, ఎలాంటి ఆధారాలు లేకుండా పచ్చి అబద్ధాలు రాసుకొచ్చారు.
– గుజరాత్‌లోని ముంద్రా పోర్టులో మాదక ద్రవ్యాలను పట్టుకున్నారని, దానికి విజయవాడలో వైయస్సార్‌సీపీ నేతకు చెందిన కంపెనీకి సంబంధం ఉందని కథనాన్ని అల్లుకొచ్చారు.
– కానీ, నిజానికి ఆ కంపెనీ బీజేపీ రాష్ట్ర అధ్యక్షురాలి సమీప బంధువుకు చెందిన సంస్థ. ఆ విషయం తెలిసి కూడా ఎల్లో మీడియా విపరీతంగా విష ప్రచారం చేసింది.
– అందులో భాగంగా, వారు అప్పటి విజయవాడ పోలీస్‌ కమిషనర్‌ ఇచ్చిన స్టేట్‌మెంట్‌ కూడా వక్రీకరించారు. సంధ్యా ఆక్వా ఎండీ వైయస్సార్‌సీపీ నాయకుడని తప్పుడు ప్రచారం చేశారు.
– చివరకు దేశంలో ఎక్కడ గంజాయి దొరికినా, దాని మూలాలు ఏపీలోనే అంటూ చంద్రబాబుతో సహా, కూటమి పార్టీల నాయకులంతా, రాష్ట్ర ప్రతిష్టను దెబ్బతీసేలా విపరీతంగా దుష్ప్రచారం చేశారు. 
(.. అంటూ అప్పుడు టీడీపీ హౌజ్‌ మ్యాగజైన్, ఎల్లో మీడియాలో వచ్చిన కథనాలు, వీడియో స్టోరీల థంబ్‌నెయిల్స్, చంద్రబాబు, అచ్చెన్నాయుడు విమర్శల వీడియోలు చూపారు)

– అధికారంలోకి వచ్చిన తర్వాత కూడా, కూటమి అదే దుష్ప్రచారం చేసింది. తాజాగా, సరిగ్గా నెల క్రితం, నవంబరు 9న ట్వీట్‌ చేసిన డిప్యూటీ సీఎం పవన్‌కళ్యాణ్, విశాఖ షిప్‌ కంటెయినర్‌లో డ్రగ్స్‌ ఉన్నాయని ఆరోపించారు.
(.. ఆ ట్వీట్‌ కూడా అమర్‌నాథ్‌ ప్రెస్‌మీట్‌లో చూపారు)

పతాకస్థాయికి దుష్ప్రచారం:
– వీరి దుష్ప్రచారం ఎంతవరకు సాగిందంటే బ్రెజిల్‌ అధ్యక్షుడిని అభినందిస్తూ.. రాజ్యసభలో వైయస్సార్‌సీపీ పక్షనేత శ్రీ వి.విజయసాయిరెడ్డి 2022లో ట్వీట్‌ చేస్తే.. ఆయనే బ్రెజిల్‌ అధ్యక్షుడితో మాట్లాడి డ్రగ్స్‌ తెప్పించారన్నట్టుగా ఊదరగొట్టారు.
– మరి అదే విజయసాయిరెడ్డి అమెరికాలో ట్రంప్‌ గెలిచినప్పుడూ అభినందిస్తూ ట్వీట్‌ చేశారు. అంత మాత్రాన వారిద్దరికీ అవినీతి సంబంధం అంటగడతారా?
– ఇదెక్కడి రాజకీయం?. చంద్రబాబు దిగజారుడుతనానికి ఇవి ఉదాహరణలు మాత్రమే.

క్షమాపణలు చెప్పాలి:
– విశాఖ వచ్చిన షిప్‌ కంటెయినర్‌లో ఎలాంటి డ్రగ్స్‌ లేవని తొలి నుంచి తాము చెబుతున్న మాటనే, ఇప్పుడు సీబీఐ కూడా తేల్చిన నేపథ్యంలో.. ఇన్నాళ్లూ గత మా ప్రభుత్వంపైనా, విశాఖ బ్రాండ్‌ ఇమేజ్‌ దెబ్బతీసే విధంగా విష ప్రచారం చేసినందుకు.. వెంటనే సీఎం చంద్రబాబు మా పార్టీకి, మా పార్టీ అధ్యక్షుడికి, విశాఖ ప్రజలకు క్షమాపణ చెప్పాలి.
– ఈ విషయంలో మా నిజాయితీ నిరూపించుకోవాలనే, ఆరోపణలు చేసిన షిప్‌ కంటెయినర్‌ విషయంపై త్వరితగతిన విచారణ చేపట్టి నివేదిక బయటపెట్టాలని కోరుతూ, గత నెల 11న మండలి విపక్షనేత బొత్స సత్యనారాయణ కేంద్ర హోం మంత్రికి లేఖ రాశారు. 
– అదే లేఖను సీఎం చంద్రబాబుకు కూడా పంపడం జరిగింది.

సీబీఐ దర్యాప్తు తీరుపై అనుమానాలు:
– ఈ ఏడాది మార్చి 16న విశాఖ పోర్టుకు షిప్‌ కంటెయినర్‌ షిప్‌ వస్తే, దానిపై ఆరోపణలు వినిపిస్తే, 5 రోజలు వరకు విషయాన్ని గోప్యంగా ఉంచి, మార్చి 21న ఎందుకు ప్రెస్‌ రిలీజ్‌ ఇచ్చారు?.
– నిజానికి మార్చి 16వ తేదీనే, కేంద్ర ఎన్నికల సంఘం రాష్ట్రంలో ఎన్నికల షెడ్యూల్‌ ప్రకటించింది. అందుకని ఉద్దేశపూర్వకంగానే 5 రోజుల ఆలస్యంగా, మార్చి 21న సీబీఐ ప్రెస్‌ రిలీజ్‌ ఇవ్వడం.. ఆ మర్నాటి నుంచే కూటమి పార్టీలన్నీ ఏకమై మా ప్రభుత్వంపై బురద జల్లడం మొదలు పెట్టాయి.
– ఇవన్నీ చూస్తుంటే, ఢిల్లీ వేదికగా దీనికి వ్యూహరచన జరిగిందా? అన్న అనుమానం కలుగుతోంది.
– పైగా 49 శాంపిల్స్‌ సేకరిస్తే అన్నింట్లో డ్రగ్స్‌ ఉన్నాయని చెప్పిన సీబీఐ.. విచారణకు ఏకంగా 8 నెలల సమయం ఎందుకు తీసుకుంది?.
– నిజానికి డ్రగ్స్‌ నిర్ధారణ పరీక్ష ఒకే రోజులో పూర్తి చేయొచ్చు. కానీ ఇన్ని రోజులు ఎందుకు పట్టింది?
– విశాఖ వచ్చిన షిప్‌ కంటెయినర్‌లో ఎలాంటి డ్రగ్స్‌ లేవని ఎనిమిది నెలల తర్వాత ప్రకటించారు. 
– వీటన్నింటి నేపథ్యంలో తమ సందేహాలన్నింటికీ సీబీఐతో పాటు, సీఎం  చంద్రబాబు సమాధానం చెప్పాల్సిన అవసరం ఉందని మాజీ మంత్రి గుడివాడ అమర్‌నాథ్‌ తేల్చి చెప్పారు.

Back to Top